అనంతపురం

అక్షరాస్యతలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అక్షరాస్యతలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వం బాలుర జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఓటు నమోదుపై జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలని, అన్ని రాష్ట్రాల్లోకంటే మన రాష్ట్రం అక్షరాస్యతలో అగ్రస్థ్భాంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి సాధించేందుకు అనేకమైన సమీక్షలు జరుగుతున్నాయన్నారు. ప్రాథమిక విద్యారంగం నుండి సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చి, అధునాతనమైన ల్యాబ్స్, భవనాలు తదితర వౌలిక వసతులను కల్పించి డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నదన్నారు. 1999-2004 సంవత్సర కాలంలో 1.44 లక్షలు పాఠశాల భవనాలను నిర్మించామన్నారు. ఐదు డిఎస్సీలను పారదర్శకంగా నిర్వహించి 1.75 లక్షల మందిని ఉపాధ్యాయులుగా నియమించామన్నారు. ఆర్థికంగా లోటు ఉన్నప్పటికి ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చామని తెలిపారు. భోధనలో సమూల మార్పులను తెస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డిజిటలైజేషన్‌కు పెద్ద పీట వేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్‌ను ఉపయోగించుకుని ప్రతి ఇంటికి 15 ఎంబిపిఎస్ స్పీడుతో ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇస్తున్నామన్నారు. రానున్న రెండు నెలల్లో ప్రతి నెల రూ. 145 ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం, వివిధ రకాల టీవి ఛానల్స్‌ను అందించబోతున్నామన్నారు. ఇందుకుగాను 330 కోట్లను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ సాంకేతిక విజ్ఞానంతో రాష్ట్రంలోని 84 లక్షల మంది రైతులు, 74 లక్షల మంది డ్వాక్రా మహిళలు వారి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నుండి రావలసిన లబ్ధిని వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న 1.30 కోట్ల మంది రెషన్ కార్డుదారులు ఎవరెవరు సరుకులు తీసుకున్నారు అన్న వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోచ్చునన్నారు. రాష్ట్రంలో కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టుబోతున్నామన్నారు. ప్రతి ఒక్కరు సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పక నేర్చుకోవాలన్నారు. అలాగే పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్ట్భద్రులకు త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరు నవంబర్ 5వ తేదీలోపు తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో మూడు సంవత్సరాల పైబడి స్కూల్ అసిస్టెంట్లకు పనిచేస్తున్న ఉపాధ్యాయులు, 2013లోపు డిగ్రీ పూర్తి చేసిన పట్ట్భద్రతులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇఓ అంజయ్య, ఎస్‌ఎస్‌ఎ పిఓ దశరథరామయ్య, ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు, డివిఇఓ వెంకటరమణ, డిప్యూటీ డిఇఓలు లక్ష్మినారాయణ, సుబ్బారావు, జూనియర్ కశాశాలల ప్రిన్సిపాల్స్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.