అనంతపురం

మడకశిరకు బంగారు భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 2 : త్వరలో నియోజకవర్గానికి బంగారు భవిష్యత్తు వస్తుందని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న అన్నారు. శుక్రవారం మడకశిరలో నిర్వహించిన చంద్రన్న పసుపు, కుంకుమ పథకం కింద ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ మడకశిర ప్రాంత భవిష్యత్తును మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నివిధాలా కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలోని రైతుల ఆశయాలు ఆడియాశలై వలసలకు సిద్ధమవుతున్న తరుణంలో అపర భగీరథుడిగా చంద్రబాబు హంద్రీనీవా పథకం ద్వారా నీరు తెప్పించేందుకు కృషి చేస్తుండటం పూర్వఫల పుణ్యమన్నారు. ఇకపోతే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని తీర్చిదిద్దడానికి చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం డ్వాక్రా విత్తనం నాటి వారి శ్రేయస్సు కోసం అహర్నిశలూ కృషి చేస్తూ ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గతంలో రఘువీరా హంద్రీనీవా నీటిని తీసుకొచ్చేందుకు టెండర్లు పిలిచి ఆ తర్వాత అటు వైపు కనె్నత్తి చూడలేదన్నారు. రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా రూ.24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా చంద్రబాబు నిలిచారన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి నదుల అనుసంధానం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఎంపి నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ జిల్లా పేద జిల్లా అయినప్పటికీ ధైర్యంగా బతికేందుకు దారి చూపుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆనాడు నీరు నిలువ చేయడానికి శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వితే.. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస కరవులతో నీరు లేక ఎండిపోతున్న తరుణంలో చెరువులకు నీరు నింపేందుకు కృషి చేస్తున్నారన్నారు. గతంలో మహిళా సంఘాలను లక్షలాది చేస్తామని చెప్పిన నాయకులు కోటీశ్వరులయ్యారే తప్ప మహిళలకు ఆదరణ కల్పించలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్టమ్రంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, అనంతపురం మేయర్ స్వరూప పాల్గొన్నారు.
మడకశిరకు సిఎం వరాల జల్లు
నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. శుక్రవారం చంద్రన్న పసుపు, కుంకుమ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్నల అభ్యర్థన మేరకు నియోజకవర్గంలోని గుడిబండ మండలం రాళ్ళపల్లి వద్ద రెండు టిఎంసిల నీటిని నిలువ చేయడానికి అవరమైన రిజర్వాయర్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గంలో వలసలను ఆపేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కర్నాటక రాష్ట్రంలోని రహదారులతో సమానంగా మడకశిర నియోజకవర్గంలోని సరిహద్దు రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. మడకశిర వైద్య, విధాన పరిషత్ ఆసుపత్రిని 100 పడకలకు పెంచనున్నట్లు హామీ ఇచ్చారు. పర్యాటక ప్రాంతాలైన భక్తరహళ్ళి, రత్నగిరి, హేమావతిని మరింత అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలో లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి సబ్ స్టేషన్‌లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అమరావతి నుంచి కర్నాటక శిర వరకూ జాతీయ రహదారి మంజూరు కావడం వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతుల మేరకు హామీలను అమలు చేసేందుకు కలెక్టర్ కోన శశిధర్‌కు ఆదేశాలు ఇస్తున్నట్లు సిఎం తెలిపారు.