అనంతపురం

గూలపాళెంలో చిరుతల సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రకరూరు, డిసెంబర్ 4 : మండల పరిధిలోని మిరప తోటల్లో ఆదివారం రాత్రి చిరుతల సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన కొందరు రైతులు రోజూమాదిరిగానే తోటలకు నీరు పెట్టేందుకు వెళ్లారు. అయితే మూడు చిరుతలు తోటల్లో సంచరిస్తుండటం గమణించారు. దీంతో మిరపచెట్లలో, సమీప పొదల్లో దాక్కున్నట్లు రైతులు వాపోయారు. వెంటనే బంధువులు, గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో బ్యాటరీలు, లైట్ల ద్వారా తోటల్లోకి చేరుకోవడంతో చిరుతలు పారిపోయినట్లు తెలిపారు. అలాగే విషయాన్ని గుత్తి రేంజి ఫారెస్టు అధికారులతోపాటు వజ్రకరూరు పోలీసులకు సమాచారం చేరవేశారు.
గుత్తి రైల్వే ప్లాట్‌ఫాంలో
సౌకర్యాలు మెరుగుపర్చాలి
గుత్తి, డిసెంబర్ 3 : గుంతకల్లు డివిజన్ పరిధిలోని గుత్తి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నెంబర్ 2లో సౌకర్యాలు మెరుగుపర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. గుత్తి రైల్వే స్టేషన్‌లో ఉన్న రెండు ప్లాట్‌ఫారాల్లో కేవలం నంబర్ 1పై మాత్రమే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్లాట్‌ఫా ం 2కు కేవలం బ్రిడ్జి వద్ద మాత్రమే పైకప్పు ఏర్పాటు చేశారని, ముందు, వెనుక వైపున ఎలాంటి పైకప్పు లేకపోవడం వల్ల సేదతీరడానికి అవకాశం లేకుండా పోతోందని వాపోతు న్నారు. ఈ ప్లాట్‌ఫాం మీద రోజుకు వందకు పైగా రైళ్లు ముంబయి, చెన్నై, కన్యాకుమారి, బెంగళూరు, న్యూఢిల్లీ, బళ్లారి, రాయచూరు, మంత్రాలయం, అనంతపురం, తాడిపత్రి, కడప, తిరుపతి, ధర్మవరం, హిందూపురం తదితర ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రైల్వే స్టేషన్ అటు కర్నూలు జిల్లా సరిహద్దులోని ప్యాపిలి, తుగ్గలి, జొన్నగిరి, పత్తి కొండ సమీప గ్రామాలకు సౌకర్యవంతమైన ఉంటుంది. ఇక్కడి నుంచి వందలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. దీంతో రెండవ నెంబర్ ప్లాట్‌ఫాంలో కనీసం అవసరమైన బెంచీలు లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైన రైల్వేశాఖ ఉన్నతాధికారులు ప్లాట్‌ఫాం నెంబర్ 2లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రైలు కింద పడి యువకుడి మృతి
గార్లదినె్న, డిసెంబర్ 4 : మండల పరిధిలోని గుడ్డాలపల్లి గ్రామ సమీపంలో 330/7/8 కిలో మీటర్ వద్ద ఆదివారం రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు. మృతుడు 35 సంవత్సరాలలోపు ఉండి, ఆకుపచ్చ టీషర్టు ధరించినట్లు తెలిపారు. గుర్తు పట్టలేని విధంగా శరీరం ముక్కలైందని తెలిపారు. మృతుడు సిరివరం గ్రామానికి చెందిన యువకుడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి
శింగనమల, డిసెంబర్ 4 : మండలంలోని జూలాకాలువకు చెందిన లక్ష్మి(28) ఆదివారం అనంతపురంలో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన లక్ష్మి ఈనెల 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమణించిచిన కుటుంబ సభ్యులు వైద్య చికిత్సల నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హమీద్‌ఖాన్ తెలిపారు.