అనంతపురం

కనుమ వద్ద దారి దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, డిసెంబర్ 4 : మండల పరిధిలోని కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో శనివారం రాత్రి దారి దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనం వెళ్తున్న ముగ్గురిని అడ్డగించి రూ.11వేల నగదు, 4 తులాల బంగారం, మూడు సెల్‌ఫోన్‌లను దోచుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొత్త చాములపల్లికి చెందిన నాగేంద్రబాబు, అనసూయ, నాగమణి కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన బంధువుల వివాహానికి హాజరై రాత్రి యజ్ఞశెట్టిపల్లికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అయితే వీరు వెళ్తున్న రహదారిపై మరో ద్విచక్ర వాహనంలో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులు చూపించి భయపెట్టి రూ.11 వేల నగదు, నాలుగు తులాల బంగారం, మూడు సెల్‌ఫోన్‌లను దోచుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. వెంటనే బాధితులు కనుమ ఆలయ ప్రాంగణం చేరుకుని విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఓ సెల్‌ఫోన్, దుండగులు వచ్చిన ద్విచక్ర వాహనాన్ని అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాశిరెడ్డినాయన 21వ ఆరాధన మహోత్సవాలు
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 4: అవధూత కాశిరెడ్డినాయన 21వ ఆరాధన మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కర్నూలు జిల్లా అవుకు మండలం సీతారామపురం గ్రామంలోని అవధూత ఆశ్రమంలో మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు గణపతి నాయన తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహిస్తామన్నారు. ఆశ్రమంలో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నట్లు గణపతి నాయన తెలిపారు. రాత్రి ఏసుపుల్లయ్య ఆధ్వర్యంలో సాంస్కతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తుల సౌకర్యార్థం తాడిపత్రి ఆర్టీసీ డిపో వారు యాడికి నుంచి ప్రత్యేక బస్సు నడుపుతున్నారు.