అనంతపురం

వెంటాడుతున్న ‘చిల్లర’ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, డిసెంబర్ 4 : పెద్ద నోట్ల రద్దుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. ఆదివారం బ్యాంకులు పనిచేయకపోవడం, ఎటిఎంలు ఎక్కడా తెరుచుకోకపోవడంతో రోజువారి నిత్యావసరాలకూ దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల కొత్తగా రూ.2 వేల నోటు అందుబాటులో ఉంచినా చిల్లర లేని కారణంగా వ్యాపారులు ఆ నోటు తీసుకొనేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో సామాన్యులు నిత్యావసరాల కోసం నానా తంటాలు పడుతున్నారు. కనీసం ఆకుకూరలు, కూరగాయలు, పాలు వంటి ముఖ్య నిత్యావసరాల కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు దళారులు పైరవీలు చేస్తూ పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు. రూ.లక్ష పెద్ద నోట్లకు రూ.100, రూ.2 వేలు నోట్లను 30 శాతం కమీషన్‌తో ఇస్తామంటూ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా అక్రమ లావాదేవీలు, రియల్టర్లు, వడ్డీ వ్యాపారులు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను ఇస్తూ 70 శాతం నగదు పొందుతున్నట్లు తెలుసోతంది. వాణిజ్య కేంద్రమైన హిందూపురంలో గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారాలు జోరుగా సాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు నడుపుతున్న పలువురు వ్యాపారులు కొందరు బ్యాంకు మేనేజర్లతో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని కమీషన్‌ల ఎర చూపుతూ తమ వద్ద ఉన్న నల్లధనాన్ని చలామణి చేసుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా తపాలా కార్యాలయాల్లో కూడా ఇదే తంతు సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు దళారీలు తమ కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు తదితరుల ఆధార్‌కార్డులను సేకరించుకుని పెద్దనోట్లను ఇచ్చి నగదు మార్పిడి చేస్తూ పెద్ద ఎత్తున కమీషన్లు పొందుతున్నట్లు బహిరంగ విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్‌నెట్‌లో ఆధార్ కార్డులను తీసుకుని జిరాక్స్ చేయించుకుని రోజూ ఒక్కో ఆధార్ కార్డు నుండి రూ.4500 దాకా నగదు మార్చుకొంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న తమ కార్మికుల కుటుంబాల ఆధార్ కార్డులను తీసుకుని వారికి రూ.50 నుండి రూ.100 చొప్పున ఎర వేసి ప్రతిరోజూ అదే ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులను ముట్టచెబుతూ తమ వద్ద ఉన్న నల్లధనాన్ని భారీ ఎత్తున చలామణి చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇకపోతే హిందూపురం ప్రాంతంలో మూడు ఏజెన్సీల ద్వారా ఎటిఎం యంత్రాలు పనిచేస్తుండగా ఇప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో ఖాతాదారులను కరెన్సీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కేవలం ఎస్‌బిఐకి సంబంధించిన 15 ఎటిఎంలు మినహా మిగిలిన బ్యాంకులకు సంబంధించి ఎటిఎంలు పనిచేయకపోవడంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపు అన్ని వ్యాపార లావాదేవీలు స్తంభించిపోతున్నాయి. రూ.2 వేల నోటు తమ వద్ద ఉన్నా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు నిత్యావసరాల కోసం ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఆ నోటుకు సరిపడే వ్యాపారం చేస్తేనే వ్యాపారులు తీసుకొంటున్నారు. దీంతో సామాన్యులు తమ అవసరాలు తీర్చుకోలేక అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్‌యార్డు, పట్టుగూళ్ల విక్రయ కేంద్రాల్లో తమ ఉత్పత్తులను తీసుకొచ్చినా వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆయా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.