అనంతపురం

బాలయ్యా..హామీలు నిలబెట్టుకో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, డిసెంబర్ 4 : ‘ఎమ్మెల్యే బాలకృష్ణా... నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకో’ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచి ంచారు. ఆదివారం స్థానిక పాత కూరగాయల మార్కెట్ స్థలాన్ని రఘువీరాతోపాటు డిసిసి అధ్యక్షులు కోటాసత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ త దితర కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. అనంతరం రఘువీరా మాట్లాడుతూ రూ.50 కోట్లతో బహుళ అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మిస్తామని పవిత్రమైన రంజాన్ పండుగకు ముందు అకస్మాత్తుగా మార్కెట్ సముదాయాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు. కూల్చి ఏడాదిన్నర కాలం కావస్తున్నా కనీసం భూమపూజకు నోచుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం ఈ విషయమై పట్టించుకోకపోవడం తగదన్నారు. అటు వ్యాపారులు ఇటు ప్రజలు కూరగాయల మార్కెట్ సదుపాయం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదల గురించి పట్టించుకోకుండా రూ.10 లక్షలు హుండీల్లో వేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, హిందూపురం నుంచి వసూలు చేసిందా, సినిమా పరిశ్రమ నుంచి వచ్చిందా అన్న విషయమై సమాధానం చెప్పాలన్నారు. కనీసం శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం చెందగా ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాలేదన్నారు. ఎమ్మెల్యేగా మీపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకోగా ఒక్క ఇంటినైనా నిర్మించారా అంటూ ప్రశ్నించారు. ఆరునెలల్లోగా ఇచ్చిన హామీ మేరకు కూరగాయల మార్కెట్ నిర్మించి గతంలో అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ న్యాయ ం చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, పిసిసి కార్యదర్శి ఇందాద్, డిసిసి ప్రధాన కార్యదర్శి అబ్ధుల్లాఖాన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, నాయకులు రవూఫ్, కృష్ణారెడ్డి, బండ్లపల్లి జబీ, రహమత్, మల్లెపూల మధు, కదిరీష్ తదితరులు పాల్గొన్నారు.