అనంతపురం

అమ్మో.. రైలు ప్రయాణమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 4 : జిల్లాలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో తరచూ చోరీలు జరుగుతుండటంతో రైలు ప్రయాణమంటే జనం భయాందోళన చెందుతున్నారు. దుండగులు కాపు కాచి మరీ నిలబడిన రైళ్లలో యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి వ్యూహాలు రైల్వే భద్రతా సిబ్బంది, అధికారుల అంచనాలకు సైతం చిక్కడం లేదు. గుంతకల్లు డివిజన్ పరిధిలో గుంతకల్లు-తిరుపతి వయా ధర్మవరం మార్గం, గుంతకల్లు-తిరుపతి వయా కడప, ధర్మవరం నుంచి పుట్టపర్తి,హిందూపురం మీదుగా బెంగళూరు వెళ్లే మార్గాలున్నాయి. ఈక్రమంలో గుంతకల్లు నుంచి అనంతపురం వైపు తిరుపతి, హిందూపురం వెళ్లే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను దుండగులు టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. గుంతకల్లు నుంచి అనంతపురం, ధర్మవరం, హిందూపురం, ధర్మవరం నుంచి తిరుపతి వైపు వెళ్లే మార్గాల్లో అనేక చిన్నచిన్న రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో తిరుపతి వెళ్లే రైళ్లు చాలా తక్కువ. ముఖ్యంగా అనంతపురం మీదుగా గుంతకల్లు, సికింద్రాబాద్, వాడి, హైదరాబాద్, విజయవాడకు, అలాగే బెంగళూరు వైపు రైళ్లు అత్యధికంగా ప్రయాణిస్తుంటాయి. వీటిలో 24 గంటల్లో డెయిలీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 20 (వీటిలో కొన్ని నాన్‌స్ట్ఫా), 8 ప్యాసింజర్ రైళ్లు, 13 నాన్ డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లు కలిపి మొత్తం 41 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఒక్క అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి రోజూ కనీసం 6 వేల మంది ప్రయాణిస్తున్నారు. ఇక గుంతకల్లు నుంచి వెళ్లే ప్రయాణికులు సంఖ్య అంతకు రెట్టింపు ఉంటోంది. అలాగే ఒక్కరోజులో అనంతపురం రైల్వేస్టేషన్‌కు మాత్రమే రూ.5.50 లక్షల వరకు ప్రయాణికులు, ఇతర లగేజీ రవాణా ద్వారా ఆదాయం సమకూరుతోంది. ఈక్రమంలో బెంగళూరు-గుంతకల్లు మధ్య అనంతపురం, గుత్తి, పెండేకల్లు మీదుగా నడిచే రైళ్లు 38 దాకా ఉన్నాయి. దేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాదు, మహారాష్ట్ర, ఢిల్లీ తదితరాలకు రోజుకు వేలాది మంది వెళ్తుంటారు. ఈ పరిస్థితిని దుండగులు తరచూ తమకు అనుకూలంగా మలుచుకుని రైల్లేస్టేషన్ల మధ్య చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
రైళ్ల రాకపోకలు గమనిస్తూ చోరీలకు వ్యూహం
దుండగులు నిత్యం రైళ్ల రాకపోకల్ని గమనిస్తూ సమయాలతో సహా అంచనాలు వేసుకుంటూ చోరీలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు అధికంగా చోరీలకు పాల్పడుతున్నారు. రైళ్ల క్రాసింగ్ సమయాల్లోనూ చిన్నస్టేషన్లలో ఆగినపుడు, పొడవైన ప్లాట్‌ఫారాల్లో కంపలు, తుప్పలు ఉన్న ప్రదేశాలను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. చాలాసార్లు ప్యాసింజర్ రైళ్లలోని ప్రయాణికులే వీరి బారిన పడ్డారు. ఈఏడాదిలో ఇప్పటి వరకూ సుమారు 10కిపైగా రైలు చోరీలు జరిగినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. తరచూ చోరీలు జరుగుతున్నా నియంత్రణ చర్యలు మాత్రం చేపట్టడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. రైలు మార్గంలో ఎక్కడైతే చోరీలు అధికంగా చోటుచేసుకునేందుకు ఆస్కారముందో అలాంటి ప్రదేశాలు, క్రాసింగ్‌లు, చిన్నచిన్న స్టేషన్లను గుర్తించి భద్రత చర్యలను పెంచడం, నిరంతర నిఘా ఉంచడంపై రైల్వే ఉన్నతాధికారులు, ఆర్‌పిఎఫ్ దృష్టి సారించాల్సి ఉంది. ప్రధానంగా ప్యాసింజర్ రైళ్లతోపాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈక్రమంలో గార్లదినె్న రైల్వేస్టేషన్లో పతకం ప్రకారం చోరీలకు పాల్పడం తీవ్ర సంచలనం రేపుతోంది. శనివారం తెల్లవారు జామున రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగి ఉండగా, క్రాసింగ్ నేపథ్యంలో మరో రైలు మధ్యలో ఉన్న పట్టాల మీదుగా వెళ్తుందన్న విషయాన్ని పకడ్బందీగా అంచనా వేసుకుని పొదల్లో కాపు కాచుకుని చోరీలకు తెగబడటమే ఇందుకు నిదర్శనం. అలాగే ఆగి ఉన్న సికింద్రాబాద్-తిరుపతి సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీలకు పాల్పడటం, జీఆర్‌పి పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడం చోటుచేసుకున్నాయి. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోపే ఆదివారం తెల్లవారు జామున బెంగళూరు-న్యూఢిల్లీ(12214) దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో దుండగులు ప్రయాణికుల్ని భయభ్రాంతుల్ని చేశారు. రైలు గుంతకల్లు సమీపానికి రాగానే గుర్తు తెలియని దుండగుడు ఓ మహిళా ప్రయాణికురాలిని బెదిరించి ఆమె వద్ద ఉన్న నగదు చోరీ చేశాడు. రెండు బోగీల్లో హల్‌చల్ చేసి 12 తులాల బంగారం, సుమారు రూ.40వేల నగదు అపహరించినట్లు బాధితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలతో రైలు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా తగినంత మంది ఆర్‌పిఎఫ్ పోలీసులు భద్రత నిమిత్తం లేకపోవడంతో రిజర్వేషన్ బోగీల్లో సైతం చోరీలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇక ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌లలో జనరల్ బోగీల్లో ప్రయాణికులు అధికంగా దుండగుల బారిన పడుతూ ప్రాణ భయంతో వణికిపోతున్నారు.
మహారాష్ట్ర ముఠాలే అధికం..
జిల్లాలో హిందూపురం నుంచి పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం మీదుగా గుంతకల్లు వరకు చోరీలు ఎప్పుడు జరిగినా ఎక్కువగా మహారాష్టక్రు చెందిన దొంగలే ఉంటున్నారు. హిందూపురం, పెనుకొండ మధ్యలో గత కొన్ని నెలల క్రితం జరిగిన పలు చోరీల్లో మహారాష్ట్ర ముఠాలు ఉన్నట్లు కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు రాష్ట్రానికి చెందిన ముఠాలు కూడా కొన్ని చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో చోరుల కోసం మహారాష్ట్ర రాష్ట్రంలోనూ, ముంబై నగరంలోనూ గాలింపు చేపట్టేందుకు రైల్వే పోలీసులు నానాతిప్పలూ పడుతున్నారు. వీరితోపాటు స్థానికంగా ఉన్న దొంగలు సైతం అడపాదడపా చోరీలకు పాల్పడుతున్నా వారి ఆచూకీ కూడా చిక్కడం లేదు. రైలు చోరీల్లో కేసులు నమోదవుతున్నా దుండగులు పట్టుబడిన దాఖలాలు మాత్రం లేవు. దీంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని రైళ్లలో ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కిటికీల వద్ద ఉండే వారు అప్రమత్తంగా ఉండక పోతే, రాత్రిళ్లు కిటికీల అద్దాలు మూసి ఉంచుకోకపోతే దుండగుల బారిన పడే ప్రమాదాలున్నాయని రైల్వే అధికారులు, భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు. ప్రయాణికులు కూడా తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.