అనంతపురం

జనవరిలో రాయల ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, డిసెంబర్ 27 : జనవరి నెలాఖరులోపు పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయల పట్ట్భాషేక ఉత్సవాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే బికె పార్థసారధి తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏ ర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.35 లక్షలు మంజూరు చేసిందన్నారు. అభివృద్ధి సాధించిన తర్వాతే ఉత్సవాలు జరపాలన్న నిర్ణయంతో ఉత్సవాల నిర్వహణ ఆలస్యమైందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. పట్టణ సమీపంలో షీఫ్‌ఫారం వద్ద 250 ఎకరాల్లో ఇస్కాన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.2.50 కోట్లతో సోమందేపల్లి, రొద్దం మండల కేంద్రాల్లో ఇండోర్ స్టేడియంలు నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.25 లక్షల వ్యయంతో కుంభకర్ణ ప్రాజెక్టును సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం మండల కేంద్రాల్లో సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో 2 వేల మందికి కొత్తగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. అలాగే పట్టణంలో గురువారం మండల పరిషత్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బొక్సంపల్లి రామకృష్ణ, మాధవనాయుడు, సర్పంచు అశ్వర్థనారాయణ, శ్రీరామ్‌యాదవ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
విధులకు గైర్హాజరైన కాంట్రాక్టు
అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు
మడకశిర, డిసెంబర్ 27 : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులకు హాజరుకాని 32 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు మడకశిర, గుడిబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు బాలప్ప, సత్యవరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 26 రోజులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో తరగతులు జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. వెంటనే కాంట్రాక్టు అధ్యాపకులు విధుల్లోకి చేరాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విధుల్లోకి చేరని అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశించడంతో మంగళవారం మడకశిర జూనియర్ కళాశాలలో 12, గుడిబండలో 12, అమరాపురంలో 8 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయా ప్రిన్సిపాళ్లు చెప్పారు.
తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనం
పెద్దవడుగూరు, డిసెంబర్ 27 : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు నిర్మాణానికి అవసరమైన గుంత తవ్వుతుండగా రోడ్డుపక్కనే గల మల్లికార్జునయ్య అనే వ్యక్తి పొలంలో పురాతన కాలం నాటి శాసనం, విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని ఆర్కియాలజీ డిపార్టుమెంట్ వారు స్వాధీనం చేసుకుని వాటి వివరాలు తెలపాలని గ్రామస్థులు కోరుతున్నారు. విగ్రహాలకు, శాసనాలకు తమ గ్రామనికి గల సంబంధం ఏమిటో తెలపాలని గ్రామస్థులు కోరుతున్నారు.