అనంతపురం

సిఎందే తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 9:జడ్పీ ఛైర్మన్ మార్పుపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ నిర్ణయం మేరకు తొలి రెండున్నరేళ్ల గడువు ముగియడంతో ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్న చమన్‌సాహెబ్ దిగిపోవాలి. ఆ స్థానంలో గుమ్మఘట్ట జడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజును తదుపరి రెండున్నరేళ్లు పాటు కొనసాగించాల్సి ఉంది. గత జడ్పీటిసి ఎన్నికల్లో టిడిపికి అత్యధికంగా 41 స్థానాలు దక్కాయి. వైసిపికి 21 స్థా నాలు దక్కాయి. పుట్టపర్తి నుంచి ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి టిడిపికి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 42కు పెరిగింది. ఈ నేపథ్యంలో చైర్మన్ పీఠానికి దూదేకుల సామాజిక వర్గానికి చెందిన చమన్, వాల్మీకి వర్గానికి చెందిన పూల నాగరాజు పోటీ పడ్డారు. దీంతో సిఎం సూచన మేరకు చమన్‌సాహెబ్‌కు తొలి రెండున్నరేళ్లు ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. మంత్రి పరిటాల సునీత, పలువురు ఎమ్మెల్యేలు అప్ప ట్లో చమన్‌కు మద్దతుగా నిలిచారు. ఈ నెల 5వ తేదీ నాటికి రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో పూల నాగరాజును జెడ్పీ పీఠం పై కూర్చోబెట్టాలని చీఫ్‌విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పట్టుదలతో ఉన్నారు. అయితే తనే పదవిలో కొనసాగాలని ప్రస్తుతం ఛై ర్మన్ చమన్ గట్టి పట్టుదలతో ఉన్నా రు. దీనిపై గత నెల రోజులుగా ఈ విషయంపై జిల్లా పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఈ సమస్యను గత నెలలోనే జిల్లా మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బికె.పార్థసారథి జడ్పీ ఛైర్మన్ మార్పు విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లారు. చమన్‌కు మంత్రి సునీత అనుకూలమైనప్పటికీ, అయననే కొనసాగించాలన్న విషయంపై ప్రస్తుతం తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. దూదేకుల సామాజిక వర్గం తక్కువగా ఉండటం, రానున్న ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ బిసిల మద్దతు ఉండాలంటే ఛైర్మన్‌గా పూల నాగరాజుకే అవకాశం ఇవ్వడమే మంచిదని కూడా పలువురు జిల్లా టిడిపి నేతలు, బిసి నాయకులు, పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ నెల 11తో ముగియనున్న జన్మభూమి-మా ఊరు తర్వాత గానీ, లేదా సంక్రాంతి అనంతరం గానీ ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అవిశ్వాసం పెట్ట దలిస్తే నిబంధనల మేరకు నాలుగేళ్లు ఆగాల్సిందే. అయితే ప్రతిపక్షానికి ఆ అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టిడిపి నేతలు సైతం విభేదాల కుంపట్లు రాజేసుకోవడానికి సాహసించడం లేదు. కాగా తనకే పదవి దక్కుతుందన్న గట్టి నమ్మకంతో పూల నాగరాజు ఉన్నారు.
అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం :
టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బికె పార్థసారథి
జడ్పీ ఛైర్మన్‌ను మార్చాలా, వద్దా అనే అంశంపై అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం. ఇప్పటికే ఈ సమస్యను మేము సిఎం దృష్టికి తీసుకెళ్లాము. జన్మభూమి కార్యక్రమం ఉన్నందున నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైంది. సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మేము ఎవరికీ చెప్పే పరిస్థితి లేదు.
మారితే ఎన్నికల షెడ్యూల్ అమలు
:సిఇఒ రామచంద్ర
జడ్పీ ఛైర్మన్ మార్పు ఉన్నట్లయితే ఆయన పదవికి రాజీనామా చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. కలెక్టర్ ఆమోదం అనంతరం ఎన్నికల కమిషన్‌కు పదవి ఖాళీ పడిన విషయాన్ని నివేదిస్తాము. అనంతరం షెడ్యూల్ విడుదలవుతుంది. ఈ మేరకు ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్, ఎన్నికల అథారిటీ ఆధ్వర్యంలో నిబంధనల మేరకు ఎన్నిక నిర్వహిస్తాం. చైర్మన్ మార్పు అనివార్యమైతే చేతులెత్తి ఆమోదం తెలిపే విధానమే ఉండొచ్చు.
చిరుతపులి సంచారం
* భయాందోళనలో గ్రామస్తులు
ఉరవకొండ, జనవరి 9:మండలంలోని చిన్నముష్టూరు-కోనాపురం గ్రామాల మద్య చిరుత సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. గత రెండు, మూడు రోజుల నుండి చిరుత సంచరించడంతో పొలాలకు వెళ్లడానికి రైతులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం జిల్లా పారెస్టు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో చిరుత పశువులపై దాడిచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా పారెస్టు అధికారులు చర్యలు తీసుకుని, బోన్లు ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.