అనంతపురం

సంక్షేమ పథకాలపై రాజకీయ ముద్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం రూరల్, జనవరి 13:ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రాజకీయ ముద్ర అధికమవుతుండడంతో సంక్షేమ పథకాలకు అర్హులైన వారు నేతలు చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యమంత్రి స్థాయి నుండి గ్రామ సర్పంచ్ వరకు వేదికలపై రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అర్హులకు అందిస్తున్నామని, ఇది మా పార్టీకే సాధ్యమని ఊకదంపుడు ఉపన్యాసాలు పత్రికాప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ప్రధానంగా సంక్షేమ పథకాలకు అర్హులైనప్పటికి వారు లబ్ధిదారులుగా ఎంపిక కావాలంటే తమ పార్టీ కం డువా కప్పుకోవాల్సిందేనని గ్రామస్థాయిలోను, పట్టణాల్లోని వార్డుల్లోను ఆ యా అధికార పార్టీ నేతలు షరతులు విధిస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యా ప్తంగా ఇలా వున్నప్పటికి ధర్మవరం నేతలు ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. దీంతో చేసేది లేక సంక్షేమ పథకాల కోసం తప్పుకుంటున్నామని పలువురు లబ్ధిదారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం చిగిచెర్ల గ్రామంలో కొందరు అధికార పార్టీలోకి చేరడం, మరుసటి రోజు ప్రతిపక్ష వైకాపా నేతలతో కలిసి తాము పార్టీలోకి చేరలేదని, సంక్షేమ పథకాలు ఇస్తామంటేనే అక్కడికి వెళ్ళామని, వారు కండువాలు కప్పినట్లు మళ్ళీ ప్రకటన ఇవ్వడం, తదుపరి రోజునే వారితోనే అధికార పార్టీ నేతలు ప్రకటన ఇవ్వడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యంగా పథకాల కోసం వచ్చే వారు పార్టీలో కొనసాగుతారా లేదా అన్నది లేకుండా కేవలం బలప్రదర్శనకు నాయకులు నిమగ్నమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేయడంలో అధికారులకు తలనొప్పిగా మారుతోంది. నేతల మాటే చెల్లుబాటవుతుండడంతో అధికారులు గ్రామస్థాయిలో పర్యటనకు వెళ్ళినపుడు వారికి ప్రజా వ్యతిరేకత ఎదురవుతోంది. అయినప్పటికి చేసేది లేక అధికారులు నేతలు చెప్పినట్లే వినాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బడుగు, బలహీన వర్గాల సంక్షేమ పథకాలైన రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇంటి స్థలాలు, గృహాల మంజూరు వంటి పథకాల ఎంపికలోను నాయకుల జోక్యం అధికం కావడంతో అధికారులు లబ్దిదారుల గుర్తింపును నాయకులకే వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజాప్రతినిధులుగా ప్రాతినిథ్యం వహిస్తున్న చోట అర్హులున్నప్పటికి అక్కడ తక్కువ యూనిట్లు మంజూరు చేస్తుండడంతో పలువురు అర్హులకు అన్యాయమే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సంక్షేమ పథకాలపై రాజకీయ పార్టీ నేతల కుట్రతో అటు అధికారులు, ఇటు అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇప్పటికైనా సంక్షేమ పథకాల కేటాయింపులో రాజకీయ పాత్ర వుండదని ప్రకటనలకే పరిమితం చేయకుండా నాయకులు క్షేత్రస్థాయిలో కనపరిస్తే వారి మాటలకు అర్థముండడంతో పాటు భవిష్యత్‌లో వారికి బలం చేకూరే అవకాశముంటుంది.

పండుగ కొనుగోళ్లతో కిక్కిరిసిన
‘పురం’ రహదారులు
* ఆకాశాన్నింటిన ధరలు
హిందూపురం టౌన్, జనవరి 13 : సంక్రాంతి పర్వదినానికి ప్రజలు నిత్యావసరాలు, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు తరలిరావడంతో పట్టణంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. ఏడాది ప్రారంభంలో వచ్చే తొలి పండుగ సంక్రాంతిని జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే గతంతో పోల్చితే వ్యాపారాలు ఏమాత్రం లాభసాటిగా ఉండటం లేదని పలువురు వ్యాపారులు వాపోయారు. కరవు పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం సంక్రాంతి పర్వదినంపై స్పష్టంగా కనిపించింది. కరవు దృష్ట్యా రైతులు సాగు చేసిన ఏ ఒక్క పంట కూడా పూర్తి స్థాయిలో చేతికి అందకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సంక్రాంతి పండుగకు ఆనవాయితీగా ఉపయోగించే వాటిలో గుమ్మడి కాయ రూ.50 వరకు ధర పలుకగా చిన్నపాటి చెరుకు గడ రూ.30, చామంతి పూలు బారు రూ.60 వంతున ధరలు పలికాయి. అదే విధంగా చిలగడ దుంప కిలో రూ.50, ఆనప కాయలు రూ.100, వేరుశెనగ కాయలు కిలో రూ.40 దాకా ధరలు పలికాయి. ఇకపోతే సాధారణంగా సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకు వచ్చే రంగుల ధరలు కూడా బాగా పెరిగిపోయినట్లు మహిళలు వాపోయారు. ధరలు పెరిగిపోయినా తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు విస్మయం వ్యక్తం చేశారు. అయితే తొలి పండుగ కావడంతో ఉన్నదాంట్లో ఎంతో కొంత జరుపుకునేందుకు మధ్య తరగతి వర్గాలు సిద్ధమవుతుండగా సామాన్యులు మాత్రం ధరల పెరుగుదల పట్ల పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో శనివారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆయా దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ముస్తాబు చేస్తున్నారు.