అనంతపురం

నేడు, రేపు ‘కానుక’లు ఇవ్వండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 13 : ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న ‘చంద్రన్న సంక్రాంతి కానుకల’ను నేడు, రేపు కూడా పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం డీలర్లను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు చంద్రన్న సంక్రాంతి కానుకల్ని రూ.11 లక్షల 20వేల పాత రేషన్‌కార్డులకుగాను 10 లక్షల 50వేల మందికి పంపిణీ చేసి 94 శాతం పూర్తి చేశామన్నారు. అలాగే కొత్తగా జన్మభూమిలో ఇచ్చిన 89000 తెల్ల రేషన్‌కార్డుల్లో 32000 మందికి అందించామన్నారు. దీంతో 38 శాతం మేరకు పూర్తయిందని, మిగతా వారికి నేడు, రేపు అందిస్తామన్నారు.
బియ్యం దందా!
* రేషన్ బియ్యానికి మెరుగులు
* అధిక ధరకు విక్రయం
* వ్యాపారుల ఘరాణా మోసం
* మోసపోతున్న జనం
డి.హీరేహాల్, జనవరి 13 : రాయదుర్గం కేంద్రంగా బియ్యం దందా కొనసాగుతోంది. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొంతమంది దళారులు, వ్యాపారులు తక్కువ ధరకు తీసుకుని రైస్ మిల్లుల్లో మెరుగులు దిద్ది అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో హెచ్చెల్సీ ఆయకట్టు కింద వరి పండుతుండటంతో ఆయా ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని ఎవరూ వాడరు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న బియ్యం చిల్లర వ్యాపారులు పెద్ద మొత్తంలో బియ్యాన్ని పోగు చేసి హోల్‌సేల్ వ్యాపారులకు అమ్ముతున్నారు. వారు తమ గోడౌన్లలో నిల్వ చేసుకుని మిల్లుల్లో కొద్దిగా మెరుగులు దిద్ది సరిహద్దు దాటిస్తున్నట్లు సమాచారం. ఈ బియ్యాన్ని కర్నాటకలోని చెళికెర, ఇరియూరు, తుంకురు తదితర ప్రాంతాల్లో క్వింటాల్ రూ.1700 వరకూ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది మిల్లర్లతో కుమ్మక్కై యంత్రాలతో రంగు మార్చి సోనా మసూరి బియ్యంలా తయారు చేసి మంచి ప్యాకెట్లలో నిల్వ చేసి రూ.3200 వరకూ అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యాపారం రాయదుర్గం పట్టణంలో చిన్న స్థాయి షాపుల నుంచి పెద్దషాపుల్లో వరకూ సాగిస్తున్నట్లు సమాచారం. గతవారం కొందిమంది సోనామసూరి బియ్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తుండగా రాయదుర్గంలోని పాత బస్టాండ్‌లో ఆపారు. దీంతో స్థానికులు కొందరు వాహనం వద్దకు వెళ్లి బియ్యం పరిశీలించి ఇవి సోనామసూరి బయ్యం కాదని, రేషన్ బియ్యమని చెప్పగా బాధితులు ఖంగుతిన్నారు. ఏదిఏమైనా కణేకల్లు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.