అనంతపురం

టిడిపికి ప్రజలే గుణపాఠం చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, జనవరి 21 : రానున్న ఎన్నికల్లో టిడిపికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి జో స్యం చెప్పారు. శనివారం పట్టణంలోని దేవాంగుల కల్యాణ మండపంలో హం ద్రీనీవా ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద నియోజకవర్గ పరిధిలోని 70వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డి మాండ్ చేశారు. హంద్రీనీవా పథకాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 90 శాతం పనులు పూర్తి చేస్తే కనీసం ప్ర స్తుతం టిడిపి ప్రభుత్వం కనీసం డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నిత్యం కర వు కాటకాలకు నిలయమైన రాయలసీమను ఆందుకోవడానికి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, మైసూరరెడ్డితోపాటు వామపక్ష పార్టీ నాయకులు అనేకసార్లు పోరాటాలు చేయడంతో టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గాలేరు-నగరి, వెలుగోడు, తెలుగుగంగా, హంద్రీనీవా పథకాలు చేపట్టడానికి ప్రతిపాదనలు చేశారన్నారు. ఓట్లు దండుకోవడం కోసం చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. జిల్లాలో వరుస కరవులు నెలకొంటున్నా టిడిపి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. హంద్రీనీవా కింద ఎన్టీఆర్ కేవలం 5 టిఎంసీల నీటిని మాత్రమే కేటాయించి జిఓను విడుదల చేస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 40 టిఎంసిల నీటిని కేటాయించారన్నారు. హంద్రీనీవా కింద నియోజకవర్గ పరిధిలో ఆగస్టులో 30వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటనలు చేశారుగానీ ఒక్క ఎకరాకు నీరు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల అంచనాల పేర చంద్రబాబు దోపిడీ చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని 70వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు జిబిసి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలన్నారు. అలాగే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఫిబ్రవరి మొదటి వారంలో చేపట్టే ధర్నాకు వైకాపా అధినేత జగన్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హంద్రీనీవా ఆయకట్టు సాధన సమితి సభ్యులు అశోక్, తేజనాథ్, జడ్పీటీసీ తిప్పయ్య, జిల్లా వైకా పా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, మండల కన్వీనర్ నరసింహులు, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మాజీ ఎంపిపిలు రమణారెడ్డి, ఎర్రిస్వామి పాల్గొన్నారు.
మార్చిలోపు రుణాలు అందజేయాలి
* లీడ్ బ్యాంక్ మేనేజర్ జయశంకర్
మడకశిర, జనవరి 21: జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు మార్చి నెలాఖరులోపు రూ.551 కోట్ల రుణాల పంపిణీ చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ జయశంకర్ ఆయా బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికాభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంఘాల సభ్యులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 2016-17 సంవత్సరానికి రూ.931 కోట్ల రుణాలు అందజేయాల్సి ఉండగా కేవలం రూ.380 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వెలుగు అధికారులు అర్హత కలిగిన సంఘాల రికార్డులను సిద్ధం చేసి బ్యాంకర్లకు అప్పగిస్తే మార్చి చివరి నాటికి రుణాలు అందజేస్తారన్నారు. అంతేకాక రుణాలు పొందిన సంఘాలు సక్రమంగా వాపస్ చెల్లించాలన్నారు. జిల్లాలో అన్ని రంగాల్లో ఇప్పటి వరకు రూ.6882కోట్ల రుణాలకు రూ.5700 కోట్లను డిసెంబర్ నాటికి పంపిణీ చేశామన్నారు. వ్యవసాయ రుణాల కింద రూ.4,623 కోట్లకు రూ.4800 కోట్లు ఖరీఫ్, రబీ సీజన్‌లో రైతులకు అందించినట్లు తెలిపారు. 2015-16 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా మంజూరైన సబ్సిడీ రుణాలను ఈనెల 31వ తేదీ లోపు పూర్తిస్థాయిలో అందజేయాలన్నారు. 2016-17 సంవత్సరానికి సైతం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలను పరిశీలించి త్వరలోనే మంజూరు చేయాలన్నారు. ఇకపోతే ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డులు కలిగిన వ్యవసాయ కూలీలు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. 8 లక్షల జన్‌ధన్ ఖాతాలు ఉండగా కేవలం 1.25 లక్షల మంది ఖాతాదారులు మాత్రమే ఆధార్ సీడింగ్ చేసుకున్నారన్నారు. సాధారణ ఖాతాల్లో 65 శాతం మాత్రమే ఆధార్ సీడింగ్ చేసుకున్నారని, మరో 35 శాతం మంది ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సి ఉందన్నారు. జన్‌ధన్ ఖాతాదారుల్లో 4.85 లక్షల మందికి నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు రూపే కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆర్‌ఎం శ్రీరంగన్న, డిఆర్‌డిఏ ఏఓ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఎపిఓ రత్నకుమారి, రూడ్‌సెట్ డైరెక్టర్ రాంకుమార్, బ్యాంక్ అధికారులు సన్యాసిరావు, సుబ్రమణ్యం, ఎంపిడిఓలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
ఎస్‌బిఐ అధికారులపై ఎల్‌డిఎం ఆగ్రహం
సమావేశ నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల స్థానిక స్టేట్ బ్యాంక్ అధికారుల తీరుపై ఎల్‌డిఎం జయశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన వివిధ ఉద్యోగులు, బ్యాంకర్లు బయటే ఉండటాన్ని గమనించిన ఆయన కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.