అనంతపురం

బూదగవిలో రథసప్తమికి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, జనవరి 31 : రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బూదగవి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం లో రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ ఏ ర్పాట్లు చేస్తునట్లు సూర్యనారాయణ స్వామి సేవా సమితి చైర్మన్ చిరంజీవి, సమితి సభ్యులు మహేంద్రగౌడ్ తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 3వ తేదీ వర కూ రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 2న మ హాగణపతి పూజ, గంగపూజ, పుణ్యహవాచకం, దేవనందిపూజ, పంచగవ్యప్రాసన, రక్షాబంధన, రుత్విగరణ ం, సర్వతో భద్రమండల దేవత వాహ న నవగ్రహ ఆరాధన, కలశస్థాపన, ప్ర ధాన దేవతా వాహనపూజ, దీక్షాహో మం, జపాలు, ఏకావర్తి మహాగణపతి, నవగ్రహ, మృత్యుంజయ, మూలమం త్ర హోమాలు, మంత్రపుష్పం, అష్టావధానసేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 3న తెల్లవారుజామున షోఢశోపచార పూజ, ఈశ్వరునికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, సూర్యునికి మహా సౌర పూర్వక అరుణ రుద్రాభిషేకం, మహామంగళహారతులు, ఉదయం 9:30 గంటలకు శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీనారాయణ స్వామి కల్యాణం, మహాగణపతి, నవగ్రహ, మృత్యుంజయ, ఆయుష్య, రుద్రస్వాహాకార, మహాసౌర పూర్వక అరుణ, దుర్గా సూక్త హోమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆలయ చరిత్ర
జిల్లాలోని ఉరవకొండ పట్టణానికి 7 కి.మీ దూరంలో అనంతపురం- బళ్లారి రహదారిలో ఉన్న బూదగవి గ్రామంలో సూర్యనారాయణ స్వామి ఆలయం వెలసింది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్ధంలో చోళులు నిర్మించారు. ఏ ఆలయంలోనైనా దేవతామూర్తి తూర్పుదిక్కుగా ఉంటుంది. ప్రత్యేకించి బూదగవిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామి దక్షిణ ముఖంగా ఉంటారు. ప్రపంచంలోనే దక్షిణాభిముఖింగా ఉన్న ఏకైక సూర్యదేవాలయం ఇదే. శాస్త్ర ప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతి మరేవరో కాదు సూర్యుని కుమారుడైన యముడు. అందుకే ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. సూర్యభగవానున్ని ఆరోగ్య ప్రధాతగా చెబుతారు. దక్షిణముఖంగా ఉన్న ఈ ఆలయంలో పూజలందుకునే స్వామి అపమృత్యు భయాన్ని కూడా పోగొడతాడని భక్తులు విశ్వాసం. ఇక ఈ దేవస్థానం నిర్మాణం మూడు రాళ్లతో నిర్మించి ఉండడం మరో విశేషం.
ఇకపోతే సూర్యనారాయణస్వామి రోజూ ఓ రూపంలో దర్శినమిస్తాడు. ఈ ఆలయంలో పూజలు, యజ్ఞాలూ, యాగాలూ, దానాలూ చేస్తే ఎన్నో వి శిష్ట ఫలితాలు వస్తాయని పెద్దలు చె బుతారు. హనుమకు అన్ని విద్యలు నే ర్పిన గురువు సూర్యనారాయనుని సా ష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు ఉం టుంది. హనుమ ప్రతిమ ఈ విధంగా ఉండటం చాలా అరుదు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారం నాడు ఈ రథసప్తమి రావడం మిక్కిలి విశిష్టత కలది. కావున రథసప్తమి రో జు స్వామివారిని దర్శిస్తే పాపాలు తొ లగుతాయని పెద్దలు చెబుతారు. ఈ రథసప్తమి ఉత్సవాలను తిలకించడానికి కర్నాటక, మహారాష్ట్ర, తమిళనా డు, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల ను ంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తా రు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముం దు జాగ్రత్త చర్యగా ఉరవకొండ సిఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
మహాధర్నా విజయవంతం చేయండి
* ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి
ఉరవకొండ, జనవరి 31 : హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6న ఉరవకొండలో జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు ధర్నా నిర్వహించ తలపెట్టిన స్థలం కోసం పట్టణంలోని బస్టాండ్, గుంతకల్లురోడ్డు, కవి తాహోటల్ సర్కిల్ ప్రాంతాలను వైకాపా రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశీలా రఘురాం, మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా వైకాపా అధ్యక్షులు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బి వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టు కింద ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని అనేకసార్లు, ఎమ్మెల్యేలు, ఎంపితోపాటు వామపక్ష నాయకులకుతో కలిసి ఉద్యమాలు చేపట్టామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా ఒక ఇల్లు నిర్మించలేదని, ఒక ఎకరాకు నీరు అందించలేదన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో హంద్రీనీవా కింద ఉరకవకొండ నియోజకవర్గపరిధిలో 80వేల ఎకరాలు, జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు అందించడానికి ప్రతిపాదనలు తయారు చేసి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. 1996 సంవత్సరంలో చంద్రబాబు కేవలం హంద్రీనీవా కాలువకు పునాదులు మాత్రమే వేశారన్నారు. 2005లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా పనులు చేపట్టారన్నారు. 2012 సంవత్సరంలో మొదటి విడత కింద పనులు చేసి ఫిబ్రవరి 29న కృష్ణాజలాలను జీడిపల్లికి మళ్లించారన్నారు. దాదాపు 5 సం వత్సరాల నుంచి హంద్రీనీవా నుంచి 20 టిఎంసీల నీటిని మళ్లించారన్నారు. హంద్రీనీవా కాలవకు 40 టిఎంసీల నీటిని మళ్లించడానికి డిజైన్ తయారు చేశారన్నారు. ఈఏడాది 33 టిఎంసీల నీటిని పంపింగ్ చేసినా కనీసం 33 ఎకరాలకు నీరు అందించలేదన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఈనెల 6న జరిగే మహాధర్నా విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా నాయకులు అశోక్, జడ్పీటీసీ తిప్పయ్య, తేజనాథ్, ఈరన్న, బసవరాజు, మండల కన్వీనర్ నరసింహులు, మహేష్, నిరంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.