అనంతపురం

బలవంతపు భూ సేకరణతో రైతుల విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 2: కరవు జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పేరుతో రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం పూనుకుంటోంది. దీంతో తరతరాలుగా అనుభవంలో ఉన్న కన్నతల్లిలాంటి భూమిని నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా అన్నదాతలకు కన్నీరే మిగులుతోంది. భూమిని కోల్పోతే భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుండటంతో గుండెలు ఆగుతున్నా రు. అంతేగాకుండా రైతులు ఆశించిన మేరకు భూములకు సరైన ధర కల్పించి పరిహారాన్ని ఇవ్వడంలోనూ అధికారులు చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని నంబులపూలకుంటలో ఏర్పాటు చేసిన సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుకు సేకరించిన భూమికి పరిహారం చెల్లించే విషయంలో రెండేళ్లుగా రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే అనేక పరిశ్రమలకు భూ సేకరణ చేసినప్పటికీ తమకు ఆశించిన రీతిలో న్యాయం జరగలేదని రైతులు వాపోతున్నారు. తాజాగా పెనుకొండలో కార్ల కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఎపిఐఐసికి బాధ్యత అప్పగించారు. ఇక్కడా రైతులకు అన్యాయం జరుగుతోంది. తమ తాతలుముత్తాతల కాలం నుంచి వ్యవసాయ భూముల్నే నమ్ముకుని జీవిస్తున్న రైతులు, వారి వారసులకు కనీసం చెప్పుకునేందుకు సెంటు భూమి కూడా పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రదేశంలో లేకుండా పోతోంది. ఈ తరుణంలో తమకు న్యాయమైన ధర ఇవ్వాలని ఇటీవల పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నారు. దీనిపై ఇప్పటికే కొంత వ్యతిరేకతను కూడా రైతులు ఆందోళన రూపంలో వెలిబుచ్చారు. అధికారులతో సర్వేకు సహకరించలేదు. వాదోపవాదాలు కూడా జరిగాయి. ఎకరాకు కనీసం రూ.15 లక్షలైనా ఇస్తే తాము, తమ వారసులు బాగు పడతామని, మరో చోట ఖరీదైనప్పటికీ భూములు కొనుక్కుని బాగు పడతామని స్పష్టం చేశారు. అయితే అధికారులు రూ.8 లక్షల నుంచి బేరసారాలు మొదలు పెట్టారు. ఎట్టకేలకు గురువారం పెనుకొండ ఆర్‌డిఓ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మికాంతం, స్థానిక ఎమ్మెల్యే బికె.పార్థసారథి, ఆర్‌డిఓ రామ్మూర్తితో పాటు ఎపి ఐ ఐసి జోనల్ మేనేజర్ రంజిత్ తదితరులు సుమారు 400 మంది రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా ఎకరాలకు రూ.10.50 లక్షలు పరిహారం ఇచ్చేలా అధికారులు రైతుల్ని బలవంతంగా ఒప్పించినట్లు విమర్శలుస్తున్నాయి. దీనిపై సంబంధిత రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కార్ల కంపెనీ వల్ల జిల్లాకు మేలు జరుగుతుందని, సహకరించాలని, లేకుంటే ప్రజా ప్రయోజనం దృష్ట్యా చట్టాన్ని ప్రయోగించి బలవంతంగా భూములు లాక్కునే పరిస్థితి రానీకండని, అలా జరిగితే మీరు కోరినంత పరిహారం కూడా దక్కదంటూ రైతులను అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. సమన్వయంతో సామరస్యంగా మాట్లాడుకుని పరిహారం చెల్లింపునకే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నా ఓ విధంగా ప్రత్యక్షంగానే తమకు అధికారుల నుంచి బెదిరింపుల ధోరణి కనిపిస్తోందని పలువురు ఆరోపిస్తున్నట్లు సమాచారం.
కార్ల కంపెనీ ఏర్పాటుకు 2,200 ఎకరాలు అవసరం
పెనుకొండ ప్రాంతంలో కొరియా దేశానికి చెందిన కియో కార్ల ఉత్పత్తికి ఆ కంపెనీ ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీ కోసం మొత్తం 2,200 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ బాధ్యతను ఎపిఐఐసికి ప్రభుత్వం అప్పగించింది. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పెనుకొండ సమీపంలోని అమ్మవారిపల్లి, కురవవాండ్లపల్లి, గుట్టూరు, దుద్దేబండ, మునిమడుగు, మక్కాజిపల్లి గ్రామాల పరిధిలో భూ సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 235 మంది రైతులకు చెందిన దాదాపు 600 ఎకరాల భూమిని సేకరించేందుకు వీలుగా రైతులతో సంప్రదించి వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. గురువారం పెనుకొండ ఆర్‌డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు బాలూ నాయక్(50) గుండెపోటుకు మృతిచెందడంతో రైతులను కలవరపరిచింది. రైతులు ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని, పరిహారంపై ఓ అంగీకారం కుదిరిన తర్వాత నోటీసులు ఇవ్వాలనుకున్నట్లు పెనుకొండ తహశీల్దార్ తెలిపారు.