అనంతపురం

వైకాపా ఎమ్మెల్సీకి బాసటగా ఐటి ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 18: పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల నియోజవర్గం వైకాపా మద్దతుతో బరిలో వున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి గెలుపుకోసం శనివారం నుంచి ప్రచారాన్ని నిర్వహించినట్లు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంకలకడ తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో కార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి శ్యాంకలకడ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అన్యాయానికి గురైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండున్నరేళ్ల పాలనలలో అభివృద్ధి మాటున పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతకు ప్రధానంగా నిరుద్యోగ భృతి అమలులో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ప్రత్యేక హోదా సాధనలో ప్రధాన అడ్డంకి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తరలివచ్చే అవకాశం వుందన్నారు. సమావేశంలో ఐటి ఉద్యోగులు ప్రతాపరెడ్డి, కుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
20న డిగ్రీ ప్రథమ, తృతీయ సెమిష్టర్ ఫలితాలు
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 18: ఎస్కేయూ డిగ్రీ ప్రథమ, తృతీయ సెమిష్టర్ డిగ్రీ పరీక్షల ఫలితాలు ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. బిఎ, బి.కాం, బిఎస్సీ కోర్సుల్లో పరీక్షలు రాసిన విద్యార్థులు మొదటి సెమిష్టర్, మూడవ సెమిష్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు 12 గంటల తరువాత ఎస్కేయూ వెబ్‌సైట్ నందు ఫలితాలను చూసుకోవచ్చు.
20న జరిగే మీకోసం రద్దు
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 18: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం సోమవారం 20వ తేదీన రద్దు చేసినట్లు డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో మాత్రమే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు తెలిపారు. డివిజన్, మండల స్థాయిలలో ఫిర్యాదుల దినోత్సవం యథావిధిగా నిర్వహించాలన్నారు.
మార్చి 1 నుండి ప్రీ ఫైనల్ పరీక్షలు
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 28: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో మార్చి 1వ తేదీ నుండి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి పి.లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 1వ తేదీన తెలుగు, 2న సంస్కృతం, 3న ద్వితీయ భాష, 4న ఇంగ్లీషు-1, 6న ఇంగ్లీషు-2, 7న గణితం-1, 8న గణితం-2, 10న భౌతిక, రసాయనశాస్త్రం, 11న జీవశాస్త్రం, 13న సాంఘికశాస్త్రం-1, 14న సాంఘికశాస్త్రం-2లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబందించిన ఈ నెల 26న ప్రైవేటు స్కూల్స్, కెజిబివిలకు, మోడల్ స్కూల్స్, ఏపి రెసిడెన్షియల్స్ స్కూల్స్‌కు, 27న ప్రభుత్వ జిల్ల పరిషత్, మున్సిపల్ పాఠశాలలకు ప్రశ్నాపత్రాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ భవన్‌లో ప్రశ్నాపత్రాలను తీసుకోవాలని తెలిపారు.
నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని
అందించటమే ప్రభుత్వ లక్ష్యం
పామిడి, ఫిబ్రవరి 18: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం 3ఎన్టీఆర్ వైద్యసేవ, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం, పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణా పథకం2లను తీసుకొచ్చి వీటితో లబ్దిపొందలేని వారి కోసం ఆరోగ్య రక్షను ప్రవేశపెట్టిందని ఎన్టీఆర్ వైద్యసేవా మిత్ర బాబు శనివారం తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబంలోని పిల్లలు, పెద్దలు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున సంవత్సవారికి రూ.1200 హెల్త్ కార్డుతో ప్రీమియం చెల్లించిన వారంతా రూ.2 లక్షల వరకు వ్యక్తిగత ఆరోగ్య బీమాను పొందవచ్చన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకాన్ని జనవరి 1న ప్రారంభించటం జరిగిందని, ఈ నెల 28వ తేదిలోగా ప్రతి ఒక్కరూ ప్రీమియాన్ని చెల్లించి పథంకలో నమోదు చేయించుకుని రూ.2 లక్షల వ్యక్తిగత బీమాను పొందుతూ 1044 జబ్బులకు వైద్యసేవలను పొందవచ్చని తెలిపారు.

వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి
పెద్దపప్పూరు, ఫిబ్రవరి 18: చిన్నారుల్లో ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే వైద్యులు తెలిపిన జాగ్రత్తలు తప్పక పాటించాలని మండల వైద్యాధికారి విష్ణుమూర్తి పేర్కొన్నారు. శనివారం ఆయన తిమ్మనచెరువు గ్రామంలో చిన్నారులకు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిరోధక టీకాలను వేసి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు రమీజా, హాజీవలి, ప్రమీల పాల్గొన్నారు.