అనంతపురం

ఎన్‌ఫోర్స్‌మెంట్ తనీఖీల్లో 71 కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 18: జిల్లా ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు జరిపిన వారంతపు తనిఖీల్లో 71 కేసులు నమోదు చేశారని జెసి బి.లక్ష్మికాంతం తెలిపారు. శనివారం జెసి క్యాంపుకార్యాలయంలో ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లా ఆహార పరిరక్షణ అధికారులు తనిఖీల్లో 14 శాంపిల్స్‌ను సేకరించి, పరీక్ష నిమిత్తం ఆహార ప్రయోగశాలకు పంపించారు, గతంలో సేకరించిన వాటి నుండి వచ్చిన నివేదికల ఆధారంగా 3 కేసులను నమోదు చేశారని తెలిపారు. అలాగే తూనికలు, కొలతల శాఖ వారు నిర్వహించిన తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 55 కేసులు నమోదు చేసి 7,75,000 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేశారని తెలిపారు. అలాగే జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అధికారులు తనిఖీల్లో 18 కేసులు నమోదు చేసి 12 మందుల షాపుల లైసెన్సులను రద్దు చేశారని తెలిపారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం, తూనికలలో మోసానానికి గురికాకూడదని, జనరిక్ మందుల వినియోగం అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌ఓ శివశంకర్‌ఱెడ్డి, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ శంకర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంధ్య, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఎల్లమ్మ, రవిశంకర్ పాల్గొన్నారు.
కన్యకాపరమేశ్వరి దేవస్థానం దాతలకు రోశయ్య సన్మానం
అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 18: కొత్తూరు కన్యకాపరమేశ్వరి దేవస్థానం అధునికీకరణకు, వెండి ఉ య్యాల దాతలకు మాజీ ముఖ్యమం త్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సన్మానించారు. శనివా రం రోశయ్య నగరంలోని కొత్తూ రు కన్యకాపరమేశ్వరి దేవస్థానాన్ని చేరుకోగా ఆమ్మవారిశాల కమిటీ సభ్యులు రోశయ్యకు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిశాలలోకి ప్రవేశించిన రోశయ్య మెదటిగా కన్యకాపరమేశ్వరీ అమ్మవారిని దర్శించుకొన్నారు. మొదటిగా ఆర్యవైశ్యలకు ఆరాధ్య దైవమైన కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆధునికీకరణకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ. కోటి అందజేయటంతో ఆలయ అధునికీకరణ, వెండి ఉయ్యాల, వాటర్‌ప్లా ంట్, కుంజేటి బసయ్యశెట్టి కల్యాణ మండపంను రోషయ్య ప్రారంభించారు. ఆరవ రోడ్డులోని శివాలయం శ్మశానంవాటిక సౌకర్యాలతో వీటన్నింటికి ఏర్పాటుకు ముందుకు వచ్చిన 16మంది దాతలకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఆ ర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండటం గొప్ప విషయం అ న్నారు. ప్రధానంగా ఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందించాలని ఆలయ కమిటీకి ఆయన సూచించారు. ఆర్యవైశ్యుల మధ్య ఐక్యత ఇలాగే కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిశాల ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా నరసింహులు, గుంతకల్లు జగదీష్, కోటా సత్యం, కలవల రాము, మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలాదేవి, యువజన సంఘం నాయకులు అనిల్‌కుమార్, మల్లికార్జున. ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దాల్‌మిల్‌పై విజిలెన్స్ దాడులు
బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 18: బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఉన్న ఉమామహేశ్వర దాల్‌మిల్‌లో అక్రమంగా తరలించిన కందులు నిల్వ ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో శనివారం విజిలెన్స్ సిఐ శ్రీనివాసరెడ్డి, డిసిసిఓ చెన్నమయ్య వారి సిబ్బందితో కలసి దాల్ మిల్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 805 క్వింటాళ్ల కందులు నిల్వ ఉన్నాయని, వాటి ధర రూ.40,65,250 విలువ గల కందుల నిల్వలను గుర్తించి వాటికి సక్రమమైన బిల్లులు చూపించకపోతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అధికారుల తనిఖీలలో గుర్తించిన కందులను ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎక్కడికీ తరలించకూడదని దాల్‌మిల్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తనిఖీలో అధికారులతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.