అనంతపురం

‘జూనియర్’ అధ్యాపకుల బడిబాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, పిబ్రవరి 25 : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు హైస్కూళ్ల బాట పట్టారు. రానున్న విద్యా సంవత్సరం (2017-18)లో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎన్‌రోల్‌మెంట్స్ (అడ్మిషన్ల)ను పెంచడం కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈఏడాది పబ్లిక్ పరీక్ష రాస్తున్న పదో తరగతి విద్యార్థులను ఆకట్టుకుని, ప్రభుత్వ కళాశాలల్లోనే చేరాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు ప్రిన్సిపాళ్లతో సహా లెక్చరర్లు నలుగురైదుగురు కలిసి బృందంగా ఏర్పడి హైస్కూళ్లకు వెళ్తున్నారు. పదో తరగతి విద్యార్థుల తరగతి గదికి వెళ్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరితే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 108 ప్రైవేటు జూనియర్ కళాశాలు ఉన్నాయి. ఇందులో 48 మాత్రమే ప్రభుత్వ కళాశాలలు ఉండటం గమనార్హం. గతేడాది కూడా ఇదే మాదిరిగా పదో తరగతి విద్యార్థుల్ని ప్రభుత్వ కళాశాల్లో చేరాల్సిందిగా కోరిన విషయం విధితమే. ముఖ్యంగా ప్రైవేటు కళాశాలల్లో చేరడం విద్యార్థులకు ఇష్టంగా మారడం, వారి తల్లిదండ్రులు కూడా ఖర్చుకు వెనుకాడకుండా అప్పోసప్పో చేసైనా సరే చేర్పిస్తుండటం పరిపాటిగా మారింది. ఇకపోతే ప్రభుత్వ కళాశాలల్లో గదుల కొరత, వెంటిలేషన్ (గాలి, వెలుతురు) సరిగా లేకపోవడం, పాత భవనాలు ఉండటం, కొత్త భవనాలు నిర్మించక పోవడమే విద్యార్థులు చేరకపోవడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. మరోవైపు అధ్యాపకులు విద్యా బోధనలో బాధ్యతగా మసలుకోరనే అపవాదు కూడా లేకపోలేదు. ప్రైవేటు కళాశాలల్లో హాస్టళ్లతో పాటు విద్యార్థుల్ని సాన పెడతారని, ఫలితంగా తమ పిల్లలు మెరుగ్గా తయారవుతారని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్ముతుండటమూ మరో కారణమే. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరే వారికన్నా ప్రవేటు కళాశాలల్లో చేరేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. అయితే ఈ ఏడాది నూతన భవనాలు మంజూరయ్యాయని, నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని, విద్యార్థులకు తగిన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని పదోతరగతి విద్యార్థులకు వివరిస్తున్నారు. అంతేగాకుండా ఉత్తీర్ణతా శాతం గత మూడేళ్లలో పెరుగుతూ వస్తోందని చెబుతున్నారు. 2013-14 విద్యా సంవత్సరం 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే 2014-15లో 62 శాతం, 2015-16లో 66 శాతం మేరకు ఉత్తీర్ణత సాధించామని, ఏటా ఉత్తీర్ణతా శాతం పెరుగుతోందని వివరిస్తున్నారు. కాగా ఈ ఏడాది 75 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్‌ఐఓ వెంకటేశులు తెలిపారు.
ఎటూ తేలని శేఖర్ వ్యవహారం!
* తొలగింపుపై స్పష్టత ఇవ్వని ఎమ్మెల్యే బాలయ్య
* మళ్లీ నిరసనలకు సన్నాహాలు
హిందూపురం, ఫిబ్రవరి 25 : ఎమ్మె ల్యే బాలకృష్ణ శనివారం మ ధ్యాహ్నం తన పిఎ శేఖర్‌పై స్పష్టమైన ప్రకటన చేస్తారనే ఆతృతతో నియో జకవర్గం లోని టిడిపి నేతలు టివిలకు అతుక్కు పోయారు. శుక్రవారం స్థాని క అస మ్మతి నేతలతో ఫోన్‌లో మాట్లా డిన బాలయ్య శనివారం ప్రకటన చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోం ది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు చెబుతారని అక్కడి నుండి సమాచార ం వచ్చిందని తెలుసుకున్న నాయకు లు మళ్లీ టివిల ముందు కూర్చొన్నా రు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని తెలుసుకున్న అసంతృప్తి వర్గం ఆందోళనకు గురైంది. ఈ విషయంపై పలువురు ద్వితీయ శ్రేణి నేతలు అగ్రశేణి నేతలకు ఫోన్‌లు చేయడం కనిపించింది. గతంలో చెప్పిన విధంగానే శేఖర్‌ను తొలగించకపోతే ఎన్టీఆర్ సర్కిల్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మాజీ ఎమ్మెల్యే సిసి వెంకట్రాముడు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసేందుకు సన్నాహాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా లేపాక్షిలో అసంతృప్తివర్గం నాయకులకు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇందులో భాగంగా టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణ తదితరులు వెళ్లగా ఆ మండలంతోపాటు చిలమత్తూరు మండలానికి చెందిన టిడిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు. కాగా బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు లేపాక్షికి వెళ్లిన సందర్భంగా ఎంపిపి హనోక్ వచ్చి కలిశారు. ఇదే సమయంలో అసమ్మతివర్గం పెద్ద ఎత్తున వెళ్తుండటం, అక్కడికి కొందరు పామిశెట్టిని తీసుకెళ్లగా వారితో కలిసి రథోత్సవంలో పాల్గొన్నారు. ఏదేమైనా శేఖర్ వ్యవహారంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

తెగని నేల!
* గట్టిపడిన నేలలు * తవ్వలేకపోతున్న ‘ఉపాధి’ కూలీలు
* బొబ్బలెక్కుతున్న చేతులు * పట్టించుకోని అధికారులు
నల్లమాడ, ఫిబ్రవరి 25: గత కొనే్నళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నేల తల్లి గట్టిపడి బండరాతిని తలపిస్తోంది. బలాన్నంతా కూడగట్టుకుని గడ్డపారతో తవ్వడానికి ప్రయత్నిస్తున్నా నేల తెగడం లేదు. దీంతో ఉపాధి కూలీలకు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో వరుస కరవుతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతవాసులు పొట్టకూటి కోసం తమ గ్రామాలను వదిలి వలస బాట పడుతున్నారు. ఎలాగైనా జిల్లాలో వలసలు తగ్గించాలన్న సదుద్దేశ్యంతో జిల్లాలో అదనంగా ఉపాధి పనులు చేయిస్తున్నారు. దీంతో కొంతవరకు కూలీల్లో ఆనందం నింపినప్పటికీ పనులకెళ్లినప్పుడు బండలా మారిన నేలను తవ్వడానికి వారు నానాయాతన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,65,650 జాబ్ కార్డుదారులున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఉపాధి పనుల్లో పాల్గొన్న వారి కూలీ మొత్తాలు, ఇతరత్రా సామాగ్రి కోసం రూ. 446.70 కోట్లు ఖర్చు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అధికంగా ఫారం పాండ్ పనులు జరుగుతున్నాయి. ఒక్క క్యూబిక్ మీటర్ (ఒక మీటర్ పొడవు, వెడల్పు, లోతు) తవ్వితే రూ. 221లు కూలీ అందజేస్తున్నారు. ఉపాధి పనులకు వెళ్ళే ఒక కూలీ రోజుకు కనీసం ఒక్క క్యూబిక్ మీటర్ అయినా తవ్వుకుంటే కూలీ గిట్టుబాటు అవుతుంది. అయితే ప్రస్తుతం భగభగమంటున్న ఎండలతో భూమిలో ఏమాత్రం తడి లేక ఎంత తవ్వినా నేల తెగడం లేదు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు శ్రమించినా నేల పూర్తిగా గట్టిగా వుండటంతో కనీసం ఒక్క క్యూబిక్ మీటర్ లెక్కన కూడా తవ్వుకోలేని పరిస్థితి వుందని కూలీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. నేల గట్టి పడటంతో తవ్వలేక పోతున్నామని అధికారులకు తెలిపితే నీళ్లు పోసి మెత్త పడ్డాక తవ్వుకోండని వాటికి సంబంధించి కూడా డబ్బులిస్తామని అంటున్నారని కూలీలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఎండలకు బోర్లలో నీళ్లు లేక తాగునీటికే అవస్థలు పడుతున్న సమయంలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేసుకుని నేలను తడిపి తవ్వండని అధికారుల చెప్పడం హాస్యాస్పదం. ముఖ్యంగా కూలీలు ఉపాధి పనులు చేసే సమయంలో ఎటువంటి బండ రాళ్లు లేని స్థలాన్ని చూపడంతోపాటు పనులు జరిగే సమయంలో అన్ని సౌకర్యాలను సమకూర్చాల్సిన బాధ్యత అధికారులపై వుంది. కానీ అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. తాగునీటి సౌకర్యం కల్పించాల్సి వున్నా అందుకు అదనంగా డబ్బులు చెల్లిస్తుండటంతో కూలీలే నీళ్లనైతే తెచ్చుకుంటున్నారు. పనులు చేసే చోట అధికారులు నీడను ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు తాగడానికి తీసుకెళ్ళిన నీళ్లన్నీ పూర్తిగా వేడెక్కుతున్నాయి. భగభగ మండుతున్న ఎండకు పనులు చేసి అలసిపోయే కూలీలు వేడెక్కిన నీళ్లు తాగలేకపోతున్నారు. దీంతో గంటల తరబడి తీవ్రమైన ఎండలో పనిచేసి సేద తీరడానికి నీడ లేక, నీళ్లున్నా అవి పూర్తిగా వేడెక్కిపోవడంతో వాటిని తాగక కూలీలు వడదెబ్బకు గురయ్యే అవకాశం వుందని వైద్యులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎండ తీవ్రమయ్యే అవకాశం వుంది. ఉపాధి పనులు జరిగే చోట కూలీలు సేద తీరడానికి, వారు తీసుకెళ్ళిన నీళ్లు, ఆహార పదార్థాలు వేడెక్కకుండా వుండేదుకు నీడను ఏర్పాటుచేయడంతోపాటు ఈ వేసవిలో క్యూబిక్ మీటర్‌కు రూ. 300లు కూలీ పెంచాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
వేసవిలో అదనంగా 20శాతం కూలీ పెంపు...
నాగభూషణం.. డ్వామా పీడీ
వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం చెల్లిస్తున్న కూలీకి అదనంగా 20శాతం అందజేస్తున్నాం. మార్చిలో 25శాతం, ఏప్రిలోలో 30శాతం, జూన్‌లో 20 శాతం అదనంగా అందజేస్తాం. ప్రస్తుతం క్యూబిక్ మీటర్‌కు రూ.221కూలీ అందజేస్తున్నాం. జిల్లాలోని కరవును దృష్టిలో పెట్టుకుని క్యూబిక్ మీటర్‌కు రూ. 221గా వున్న దాన్ని రూ. 258కి పెంచమని ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. మరో 20రోజుల్లో పెంచిన మొత్తం అందే అవకాశం వుంది. కూలీలే నీడను ఏర్పాటు చేసుకోవడానికి రూ. 10లు, నీళ్లకు రూ. 5 అందజేస్తున్నాం. మజ్జిగ కోసం రూ. 6.88 పైసలు రాబోతుంది. ఎండ తీవ్రంగా వుండటంతో ఉదయం 10 గంటల లోపే పనిని ముగించాల్సి వుంటుంది. కూలీ ఎండకు అస్వస్థకు గురై మృతి చెందితే రూ. 50వేలు అందజేయడం జరుగుతుంది. అయితే కూలీలందరూ తీవ్రమైన ఎండలో పనిచేసి ప్రాణాలకే ముప్పు తెచ్చుకోకుండా ఉదయం 10గంటల లోపే పని ముగించుకుని ఇళ్లకు వెళ్ళాలని కూలీలందరికీ తెలియజేస్తున్నాం.

అభివృద్ధి పనుల విచారణాధికారిగా
కడప ఎస్‌ఇ నియామకం
అనంతపురంటౌన్, ఫిబ్రవరి 25: కార్పొరేషన్‌లో జరిగిన అభివృద్ధి పను ల అవినీతి, అక్రమాలు నిగ్గు తేల్చటానికి తాజాగా కడప ఎస్‌ఇ ఉమామహేశ్వరరావును నియమించారు. ఇప్పటికే కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు పబ్లిక్ హెల్త్ ఎస్.ఇ శ్రీనాథరెడ్డి విచారణ నిర్వహించి నివేదిక సమర్పించా రు. నివేదిక సమర్పణతో బిల్లుల మం జూరుకు మార్గం సుగమమైందని కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. కాంట్రాక్టర్ల ఆశలపై నీళ్లు చల్లుతూ మరో విచారణాధికారిని నియమించటంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 8 నెలలుగా పనులు పూర్తి చేసి బిల్లులకై కాంట్రాక్టర్లు పడిగాపులు కాస్తున్నారు. అప్పటి కమిషనర్ సురేంద్రబాబుపై దాడి సంఘటన జిల్లా అధికార యంత్రాంగంతోపాటు ప్రభుత్వం లో కదలిక తెచ్చింది. దాడికి పాల్పడిన వ్యక్తులపై కాకుండా నేరం ఒకరిది, శిక్ష మరొకరికి అన్నట్లుగా అభివృద్ధి పనులలో అక్రమాలు జరిగాయన్న నెపం తో విచారణకు ఆదేశించారు. విచారణ పూరె్తై నివేదిక వస్తే బిల్లులు మంజూరవుతాయన్న కాంట్రాక్టర్ల ఆశలు తాజా గా మరో కమిటీని నియమించటంతో నీళ్లు చల్లినట్లైంది. కార్పొరేషన్‌లో ఎస్‌ఇగా, కమిషనర్‌గా పనిచేసి కడపకు బదిలీపై వెళ్లిన ఎస్.ఇ ఉమామహేశ్వరరావుకు విచారణాధికారిగా నియమించటం విశేషం. శనివారం ఆయన ఉత్తర్వులు అందుకున్నారు. వారం రోజుల్లో ఆయన అభివృద్ధి పనులను తనిఖీ చేసేందుకు ఇక్కడికి రానున్నట్లు తెలిసింది. అభివృద్ధి పనుల పేర విచారణ కమిటీలను ఏర్పాటుచేయటం కేవలం కాలయాపన చేయటానికేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎనిమిది నెల లు కావస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో ఆర్థిక ఇబ్బందులుపడుతున్న కాంట్రాక్టర్లకు తాజా విచారణాధికారి నియామకం ఆశనిపాతంగా మారింది. అధికార పార్టీలోని ముఖ్య నేతల వర్గపోరులో కాంట్రాక్ట ర్లు బలిపశువులుగా మారాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. అభివృ ద్ధి పనులు చేపట్టటానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు తడిసి మోపెడు కావటం తో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విచారణల పేరుతో కాలయాపన చేస్తూ బిల్లుల జారీలో జా ప్యం జరిగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
సాయి శివనామస్మరణతో
పులకించిన ప్రశాంతి నిలయం
* ముగిసిన అఖండ భజన కార్యక్రమం
పుట్టపర్తి, ఫిబ్రవరి 25: సాయి శివనామస్మరణలతో ప్రశాంతినిలయం పులకించింది. మహాశివరాత్రి వేడుకలు సత్యసాయి సన్నిధిలో ఘనంగా జరిగాయి. శివరాత్రి పర్వదినం సత్యసాయి వైభవాన్ని తెలియజేస్తు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని సాయికుల్వంత్ సభామందిరాన్ని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన అఖండ భజన కార్యక్రమం దేశ, విదేశీ అశేష భక్తజనం పాల్గొని 24గంటలపాటు నిర్విఘ్నంగా భజనా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం అఖండ భజన కార్యక్రమాన్ని మంగళహారతితో ముగించారు. సత్యసాయి ఆత్మోద్భవ లింగం, మహాశివలింగానికి ఋత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపారాయణం, శివనామస్మరణం, అభిషేకం, కలశ పూజలు నిర్వహించారు. ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులు నృత్యనాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.