అనంతపురం

పకడ్బందీగా కౌంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మార్చి 2: ఉపాధ్యాయ, పట్ట్భద్రుల నిజయోకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ, పట్ట్భధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ జరిగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను గురువారం సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రభుత్వం పాలిటెక్నిక్ నందు వేరువేరు హాళ్లలో జరుగుతాయన్నారు. కౌంటింగ్ జరిగే ప్రతి హాల్ నందు పకడ్బందీగా మెష్, ఎల్‌ఈడీ ట్యూబులైట్లు, ఫ్యాన్లు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ కౌంటింగ్ కేంద్రంలో 14, పట్ట్భద్రుల కౌంటింగ్ కేంద్రంలో 26 టేబుళ్లను ఏర్పాటుచేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల పరిశుభ్రంగా వుంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ వినోద్‌కుమార్, డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి, ఆర్‌డిఓ మలోలా, తహశీల్దారు శ్రీనివాసులు, ఎపిడబ్ల్యూఐడిసి శివకుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆస్రఫ్ అలీ పాల్గొన్నారు.
రాయలసీమ అభివృద్ధికి సహాయ నిరాకరణ
* ఆర్‌పిఎస్ అధినేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
గుంతకల్లు, మార్చి 2 : ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా వివక్షకు గురవుతున్న రాయలసీమ అభివృద్ధికి సీమ ఎమ్మెల్యేలు, ప్రజలు సహయ నిరాకరణ చేపట్టాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నాగార్జునరెడ్డి తరుపున ప్రచారం నిమిత్తం పట్టణానికి వచ్చిన ఆయన గురువారం స్థానిక ఎన్జీఓ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం ప్రచారాలతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాయలసీమలో వందలాది ఎకరాల్లో పంటలు వర్షాభావానికి గురై ఎండిపోతుంటే రెయిన్‌గన్లతో పంటలను కాపాడానని ప్రకటనలు గుప్పించారన్నారు. అదేవిధంగా పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారన్నారు. పట్టిసీమకు రాయలసీమకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి 854 అడుగుల పైబాగాన ఉంటే హంద్రీనీవాకు నీటిని తోడుకునే అవకాశం ఉందని, అటు కిందుకు ఉంటే ప్రయోజనం ఉండదన్నారు. ప్రస్తుతం డెడ్ స్టోరేజ్‌లో ఉన్న 820 అడుగుల నీటిని సైతం కృష్ణా డెల్టాకు తరలించారన్నారు. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ నీటిని తోడటం అంటే రాయలసీమ ప్రజల ప్రాణాలను తోడుకోవడమేనన్నారు. గడిచిన రెండెన్నరేళ్ల పాలనలో కోస్తాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అనంతపురం జిల్లాకు విచ్చేసిన ప్రతిసారి ముఖ్యమంత్రి కేవలం హామీలను గుప్పించి మభ్య పెడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి చేస్తామని, వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఆశలు చెప్పారే తప్ప చేసింది శూన్యమన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించకపోవడంతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయన్నారు. అదేవిధంగా రాయలసీమలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు రావు, ఉపాధి లేదు యువత దుర్భర పరిస్థితి ఎదురొంటున్నారన్నారు. ఇక రైతుల కరవు కేకలు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కన్పించడం లేదన్నారు. ఈ విషయాలన్నీ ప్రతిపక్ష నేత జగన్‌కు సైతం కన్పించకపోవడం బాధాకరమన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజల పరిస్థితి ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’లా ఉందన్నారు. అన్ని వనరులు కల్గిన గుంతకల్లును రైల్వేజోన్‌గా ఏర్పాటు చేయడంలో అధికార పార్టీ నేతలు అయిష్టత వ్యక్తం చేయడం దారుణమన్నారు. వీటిపై శాసన మండలిలో గళం విప్పే నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు 24 ఉద్యమ సంఘాలు మద్దతు ప్రకటించి బలపరిచిన పట్ట్భద్రుల ఎమ్మెల్సీ నాగార్జునరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాయకులు చంద్రశేఖర్, రచయిత రాధాకృష్ణ, రాజశేఖర్, సుధాకర్, మురళీ పాల్గొన్నారు.