అనంతపురం

ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగళి, మార్చి 23: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఉద్యమం ఆగదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గురువారం అగళిలో ప్రత్యేక హోదా, బిజెపి, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో 600 హామీలను ఇచ్చిందని, అందులో ఆరైనా నెరవేర్చిందా అంటూ ప్రజలను అడిగారు. రాష్ట్రంలో బాబు వస్తేనే జాబు వస్తుందని పేర్కొన్న చంద్రబాబు ఫీల్డ్ అసిస్టెంట్లు, డీలర్లు, ఆదర్శ రైతులు, పార్టుటైం ఉద్యోగులను తొలగించి తన ఘనత చాటుకున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన టిడిపి ఇప్పటివరకు ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ముస్లింలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్న 4 శాతం రిజర్వేషన్‌లను కూడా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద మాదిగనై ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు అందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లాకు నీటిని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. జిల్లాకు వచ్చిన నీళ్లను ఇతర ప్రాంతాలకు మళ్లించడానికి రూ.1200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.4 వేల కోట్లకు అంచనాలు పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ప్రత్యేక హోదా ప్రకటిస్తే బిజెపి 10 ఏళ్లు కావాలని, టిడిపి 15 ఏళ్లు కావాలని అప్పట్లో ప్రకటించి ప్రస్తుతం ప్రత్యేక హోదా అవసరం లేదని, తమ జేబులు నింపుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరుకొంటున్నారన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని రఘువీరా పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ పని కావాలన్నా పచ్చ చొక్కాలు వేసుకోవాలంటూ ప్రజలను మభ్య పెడుతున్నట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, కన్వీనర్ మ హేంద్ర, నాయకులు నాగరాజు, గోపినాథ్, దొడ్డయ్య, నరసింహప్ప, బషీర్ అహ్మద్ పాల్గొన్నారు.
కరవుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం..
* పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్
అనంతపురంటౌన్, మార్చి 23: రాష్ట్రంలో కరవు, వలసల నివారణలో, తాగునీటి ఎద్దడి తీర్చటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తొలుత ఈ నెల 25వ తేదీన జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరుపతలపెట్టిన జన ఆవేదన సభ పోస్టర్లను డిసిసి అధ్యక్షుడు కోటా సత్యంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. శైలజానాథ్ మాట్లాడుతూ వరుస కరవులకుతోడు ఉపాధి పనులు కరువై లక్షలాది మంది ప్రజలు వలసల బాట పట్టారన్నారు. లక్షలాది మంది రైతులు, కూలీలు వలసలు వెళ్లటంతో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యాయన్నారు. కరవు నివారణకై చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. వలసలు వెళ్లిన వారు భాష తెలియని చోట నానా అగచాట్లు పడుతున్నారని అన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందన్నారు. అయితే అధిక కూలీ వస్తుందన్న ఆశతో ప్రజలు వలసలు వెళ్ళారని పేర్కొనటం దారుణమన్నారు. ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవటమే పాలకుల ప్రథమ కర్తవ్యమన్నారు. ఆ కర్తవ్యాన్ని విస్మరించిన పాలకులకు ప్రజలు తగిన సమయంలో సరైన గుణపాఠం నేర్పుతారని అన్నారు. వేసవి రాక మునుపే గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడి తలెత్తిందన్నారు. తాగునీటి ఎద్దడిని తీర్చటానికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేయటం లేదన్నారు. దీనితో గ్రామీణ ప్రజలు తాగునీరు లభించక దాహార్తితో తల్లడిల్లుతున్నారని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా ఒక్క పైసా కూడా విడుదల కాని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం తాగునీటి ఎద్దడి, కరవు నివారణ చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని కోరారు. అంతేగాక పశుగ్రాసం, తాగునీటిని అందించి పశు సంపదను రక్షించాలని కోరారు. అలాగే పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బ్యాంకు ఖాతాలలో డబ్బులుండి తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. బ్యాంకులలో నగదు నిల్వలు లేకపోవటంతో ఎటిఎంలు సైతం నోక్యాష్ బోర్డులు పెట్టి మూసివేస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. ఈ సమస్యలన్నింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయటానికై ఈ నెల 25వ తేదీ తలపెట్టిన జన ఆవేదన సభకు ప్రజలందరూ తరలిరావాలని కోరారు. సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కోటా సత్యం, రమణ, ఓబులేశు, కొండారెడ్డి, సత్యనారాయణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
‘పురం’లో కోలాహలంగా నామినేషన్లు
హిందూపురం, మార్చి 23: స్థానిక మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు ఉప ఎన్నిక నామినేషన్‌ల ఆఖరు రోజున గురువారం తెలుగుదేశం, వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయా పార్టీల తరపున డమీ అభ్యర్థులతో కూడా నామినేషన్లు దాఖలు చేయించారు. మొత్తం 10 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. టిడిపి తరపున ప్రధాన అభ్యర్థిగా బి.శాంతి మూడు సెట్లను, డమీ అభ్యర్థిగా బిఎస్ రూప ఒక్క సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. టిడిపి అభ్యర్థిని లక్ష్మీపురంలోని వినాయక దేవాలయం నుండి ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖచ్చితంగా 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయాలని సూచించడంతో ప్రధాన అభ్యర్థి శాంతిని వాహనంలో ఎక్కించుకొని రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులుతోపాటు ముఖ్య నేతలు హుటాహుటిన మున్సిపల్ కార్యాలయం చేరుకొని నామినేషన్ దాఖలు చేయించారు. మరో సెట్‌ను మధ్యాహ్నం 2 గంటలకు దాఖలు చేశారు. ఇకపోతే వైకాపా తరపున ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్ సతీమణి సునీత శ్రీకంఠపురంలోని గంగమ్మ దేవాలయం నుండి కోలాహలంగా మున్సిపల్ కార్యాలయం చేరుకొని నామినేషన్ చేశారు. ఇకపోతే ఆ పార్టీ డమీ అభ్యర్థిగా గాయిత్రి నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాధ నామినేషన్ దాఖలు చేయగా మరో సెట్ కింద డమీ అభ్యర్థిగా నాగరత్నమ్మ నామినేషన్ దాఖలు చేశారు. సిఐలు ఇదుర్‌బాషా, మధుభూషణ్‌ల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి తరపున మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి, వైస్ ఛైర్మన్ జెపికె రాము, టిడిపి నేతలు క్రిష్ణమూర్తి, అంబికా లక్ష్మీనారాయణ, ఏ.నాగరాజు, జెఇ వెంకటస్వామి, అమర్‌నాథ్, డిఇ రమేష్‌కుమార్, కిష్టప్ప, భాస్కర్ తదితరులు పాల్గొనగా వైకాపా తరపున ప్రశాంత్‌గౌడ్, ఆసీఫుల్లా, శివ, రజని, నాగమణి, సమద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున బాలాజీ మనోహర్, ఇందాద్, నాగరాజు, బండ్లపల్లి జబీ, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
రూ. 500 నకిలీ నోట్లతో జనం బెంబేలు!
గాండ్లపెంట, మార్చి 23: నకిలీ రూ. 500లు నోట్లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల ఆర్‌బిఐ కొత్త రూ. 500లు నోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదల చేసిన కొద్ది రోజులకే రూ. 500లు, రూ. 2 వేలు నకిలీ నోట్లు మండలంలో చెలామణి అవుతున్నాయి. కూలీనాలీ చేసుకొని జీవనం సాగించే రైతులు, కూలీలకు నకిలీ నోట్లు వస్తున్నాయని, అసలు నోట్లు అని వారు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తే నకిలీ నో ట్లుగా బ్యాంకు సిబ్బంది గుర్తిస్తున్నారని పలువురు వాపోతున్నారు. దీంతో చేసేదిలేక కష్టపడిన సొమ్ము ఇలా నకిలీగా తేలిందంటూ నిరుపేదలు బాధపడుతూ తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త హ ంగు, నూతన టెక్నాలజీతో రూ. 500, రూ. 2 వేలు కొత్త నోట్లు ముద్రించామ ని ప్రధానిమోదీతోపాటు ఆర్‌బిఐ అధికారులు తెలియజేసిన విషయం తెలిసిందే. కానీ నకిలీ నోట్లు ముద్రించే వారికి ఇవేమీ అడ్డురావనే విధంగా విరివిగా దొంగ నోట్లు చెలామణి చేస్తున్నారంటూ ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రూ. 500లు, రూ. 2 వేలు కొత్త నోట్లు విడుదలైన కొద్ది రోజుల్లోనే ఇలా నకిలీ నోట్లు చెలామణి అవుతుండడంతో ప్రజలు ఏది నకిలీనో, ఏది అసలుదో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో వున్నారు. నకిలీ నోట్లకు అధికారులు అడ్డుకట్ట వేసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతున్నారు.
అప్పుల ఊబిలో రైతన్నలు
* మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్
గుంతకల్లు, మార్చి 23: జిల్లాలో వరుసగా నెలకొన్న కరవు పరిస్థితులపై గురువారం కాంగ్రెస్ పార్టీ మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ మండలంలో పర్యటించి రైతులతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దౌల్తాపురం ప్రభాకర్ ఆధ్వర్యంలో మండలంలోని నల్లదాసరపల్లి, తిమ్మాపురం, ఎన్ తండా తదితర గ్రామాల్లో వారు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతంలోని రైతులతో వారు ముచ్చటించారు. వరుస కరవు పరిస్థితుల కారణంగా పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రాక ఏడాదికేడాది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు వివరించారు. మరికొంతమంది రైతులు వృద్ధులను, పసిపిల్లలను ఇంటి వద్దే వదిలి బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారన్నారు. వలసలకు వెళ్లి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ అనేక రోగాలకు గురికావడంతోపాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. నల్లదాసరిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతు వరసగా పంటలు సాగుచేయడంతోపాటు పొలాల్లో బోర్లు వేయించామన్నారు. కనీసం నీరు పడక బోర్లు వేయించడానికి చేసిన అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుని కుటుంబ సభ్యులు విలపించారు. కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం మొత్తం వీధిన పడిందని, ప్రభుత్వం కనీస సహాయక చర్యలు చేపట్టలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై స్పందించిన నాయకులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్‌రెడ్డి, చంద్ర, వెంకటరాముడు, వీరారెడ్డి పాల్గొన్నారు.
అందరి సహకారంతోనే...
ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు విజయవంతం
కదిరి, మార్చి, 23: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంద రి సహకారంతోనే అంగరంగ వైభవంగా జరిగాయని ఈఓ వెంకటేశ్వరరెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు అన్నారు. ఈఓ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో వారు మాట్లాడుతూ వివిధ ప్రభు త్వ శాఖల అధికారులు, గ్రామీణ బ్యా ంకు సిబ్బంది, దాతలు, ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది బ్రహ్మరథం ముందుకు సాగేందుకు మొద్దు లు, తెడ్లు వేసిన కుటాగుళ్ల, మూర్తిపల్లి, గజ్జెలరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్థులకు, వలంటీర్లు, అన్నదాన కేంద్రాలు ఏర్పాటుచేసిన ప్రతి ఒక్కరికీ ఆలయం తరపున ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 90 వేల మంది భక్తులకు నిత్య అన్నదానం ఏర్పాటుచేశామన్నారు. ప్రసాదాలు ద్వారా రూ. 18.81 లక్షలు, పూజా టికెట్ల ద్వారా రూ. 12.14 లక్షలు, కానుకలు రూ. 5.15 లక్షలు, హుండీ ద్వారా రూ. 48.43 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. నిత్య అన్నదాన పథకానికి రూ. 5.45 లక్షలు విరాళాలు వచ్చాయని తెలిపారు. కల్యాణోత్సవం కోసం దాదాపు రూ. 30 లక్షలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా వేదికను ముస్తాబు చేయించిన మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు పు
యువతకు స్ఫూర్తి

అనంతపురం కల్చరల్, మార్చి 23: దేశాన్ని బ్రిటీష్ సామ్రాజ్యవాదుల బానిస సంకెళ్ల నుండి విడిపించి, స్వాతంత్య్రాన్ని సాధించేందుకు విప్లవ పంథాను ఎంచుకుని పోరాటం సాగించిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల బలిదానం నేటి యువతకు స్ఫూర్తి అని పలువురు అన్నారు. ఈమేరకు వివిధ విద్యార్థి, యువజన సంఘాలు విప్లవ వీరులకు గురువారం ఘనంగా నివాళులర్పించారు. టవర్‌క్లాక్ సర్కిల్‌లోని విప్లవ వీరుడు భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ విగ్రహానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాప్రవాహ్ జిల్లా కన్వీనర్ ఇల్లూరు ఉమాకాంతరెడ్డి, రఘు, పులిరాజు, నాగేంద్ర, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎఐడిఎస్‌ఓ, ఎఐడివైఓల ఆధ్వర్యంలో భగత్‌సింగ్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఐడిఎస్‌ఓ జిల్లా అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి నరేంద్ర, ఎఐడివైఓ జిల్లా కార్యదర్శి తబ్రేజ్‌ఖాన్, ఎఐఎంఎస్‌ఎస్ నాయకులు రమా, అమిరున్ తదితరులు పాల్గొన్నారు. పిడిఎస్‌ఓ, ఎన్‌వైఎస్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల బలిదాన దినాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటదినంగా నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, ఎపిటిఎఫ్ జిల్లా నాయకులు రామచంద్రయ్య, పిడిఎస్‌ఓ నాయకులు మల్లేశ్వరి, హరీష్, స్ర్తివిముక్తి సంఘటన నాయకురాలు శ్రీలక్ష్మి, ఎఐఎఫ్‌టియు(న్యూ) రాష్ట్ర అధ్యక్షులు సి.పెద్దన్న తదితరులు హాజరయ్యారు. డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కసాపురం ఆంజనేయులు మాట్లాడుతూ యువత భగత్‌సింగ్ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. నేటి ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలన్నారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలక్రిష్ణ, నూరుల్లా, హరీష్, ఆలం, అమర్, నాగభూషణం, సిద్ధు, శ్రీనివాసులు, అజయ్, మహి పాల్గొన్నారు.

రాష్ట్భ్రావృద్ధిలో జియోస్పేషియల్ టెక్నాలజీ
అనంతపురం సిటీ, మార్చి 23: రాష్ట్రాబివృద్ధిలో జియోస్పేషియల్ టెక్నాలజీని అప్లికేషన్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఎస్కేయూ ఉప కులపతి ఆచార్య కె.రాజగోపాల్ తెలిపారు. గురువారం ఎస్కేయూలోని పాలిమర్ సైన్సు సెమినార్ హాల్ నందు డిస్సెమినేషన్ ఆఫ్ జియోస్పేషియల్ టెక్నాలజీ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అను అంశంపై ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య సుధాకర్‌బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా విసి, రెక్టార్ ఆచార్య లజపతిరాయ్, ఎపిఎస్‌ఏసి వైస్ ఛైర్మెన్ ఆచార్య రమణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి సంవత్సరం 16 బిలియన్ డాలర్స్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని, దీని ద్వారా 11 నుండి 15శాతం వ్యాపారాభివృద్ధి వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కేయూ ఆచార్యులు రమణ, సైన్సు కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య రంగస్వామి, ఇస్త్రో శాస్తవ్రేత్త డా.డి.్భనుమూర్తి, సదస్సు కో ఆర్టినేటర్ ఆచార్య కృష్ణకుమారి, పాలక మండలి సభ్యులు ఆచార్య మల్లికార్జునరెడ్డి, ఆచార్య ఇందిర, ఆచార్య గీతాంజలి, అనిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బిపిఇడి కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం
అనంతపురం సిటీ, మార్చి 23: పాఠశాల విద్యా శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల నందు పనిచేస్తున్న వ్యాయామ విద్యా ఉపాధ్యాయులకు బిపిఇడి కోర్సులో శిక్షణ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిఇఓ పి.లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 3 సంవత్సరాలు సర్వీసు పూర్తయిన వ్యాయామ ఉపాధ్యాయులు 2017-18, 2018-19 సంవత్సరానికి బిపిఇడి కోర్సులో శిక్షణ పొందుటకు ఆసక్తి గల పిఇటిలు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ దరఖాస్తులను ఈ నెల 27వ తేదీలోపు అందజేయాలని తెలిపారు.
బి.టెక్, ఫార్మసీ ఫలితాలు విడుదల
అనంతపురం సిటీ, మార్చి 23: జెఎన్‌టియూ అనంతపురం పరిధిలో డిసెంబర్ 2016లో జరగిన బి.టెక్, బి.్ఫర్మసీ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు జెఎన్‌టియూ పరీక్షల విభాగాధిపతి ఆచార్య శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో బి.టెక్ మొదటి సంవత్సరంలోని రెండవ సెమిష్టర్ సప్లిమెంటరీ, మొదటి సంవత్సరం సప్లిమెంటరీ, బి.్ఫర్మసీలో మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే 2017 జనవరి, ఫిబ్రవరిలో జరిగిన ఫార్మ-డిలోని రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరం సప్లిమెంటరీ, మొదటి సంవత్సరంలోని సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు.
పదవ తరగతి పరీక్షల్లో 254 మంది గైర్హాజరు
అనంతపురం సిటీ, మార్చి 23: పదవ తరగతి పరీక్షల్లో గురువారం మ్యాథమెటిక్స్ పేపర్-1 పరీక్షలో 254 మంది గైర్హాజరయ్యారని డిఇఓ పి.లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 49,205 మంది విద్యార్థులకుగాను 254 మంది గైర్హాజరయ్యారని, 48,951 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆర్‌జెడి, డిఇఓ, ఏసి, స్క్వాడ్స్ బృందాలు కలసి 99 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు.

ముగిసిన నామినేషన్ల పర్వం
తాడిపత్రి, మార్చి 23: తాడిపత్రి మునిసిపాలిటీలో జరుగనున్న ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మునిసిపల్ కమిషనర్(ఎఫ్‌ఎసి) రఘుకుమార్ తెలిపిన వివరాల మేరకు నామినేషన్ల సమయం ముగిసే సరికి మొత్తం 11 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరపున 5 నామినేషన్లు, వైసిపి తరపున 5, ఇండిపెండెంటు నామినేషన్ ఒకటి వేశారని తెలిపారు. 24న ఉదయం 11గంటలకు మునిసిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని కమిషనర్ తెలిపారు.
రెండు నామినేషన్లు దాఖలు
మునిసిపాలిటీలో నిర్వహించనున్న కౌన్సిలర్ల ఉప ఎన్నికలకు సంబందించి గురువారం రెండు నామినేషన్లు దాఖలైనాయి. వైసిపి తరపున 4వ వార్డుకు సయ్యద్ జావిద్ ఖాద్రీ నామినేషన్ దాఖలు చేయగా, వైకాపా కౌన్సిలర్ గయాజ్‌బాషా(మున్నా) బలపరిచారు. 6వ వార్డుకు పొగబుడ్డి కరీముల్లా ఇండిపెండెట్‌గా నామినేషన్ దాఖలు చేశారు.

చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
అనంతపురం సిటీ, మార్చి 23: ప్రస్తుత వేసవికాలంను దృష్టిలో వుంచుకుని గ్రామ పంచాయతీలో గ్రామ సమైక్య సంఘాల ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటుచేయాలని జెసి బి.లక్ష్మికాంతం ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుండి ఆర్‌డిఓలు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, మునిస్పల్ కమిషనర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో జెసి టెలికాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉష్ణోగ్రత పెరిగి బయోకెవిటిక్ జోన్ దాటుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి ఎద్దడిని తీర్చే క్రమంలో శుక్రవారం లోపు 1003 పంచాయతీ గ్రామాల్లో గ్రామ సమైక్య సంఘాల ద్వారా, 373 మున్సిపల్ వార్డుల్లో కూడా మెప్మా నేతృత్యంలో చలివేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఇకపోతే రుణాల మంజూరులో బ్యాంకర్లు లబ్ధిదారులకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు 28,223 మంది లబ్ధిదారులకు వివిధ రకాల రుణాల మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు 26,044 మంది లబ్ధిదారుల జాబితాలను ఆయా ఎంపిడిఓలకు, మున్సిపల్ కమిషనర్లుకు, జిల్లాలోని 450 బ్యాంకులకు పంపడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 7,500 మంది లబ్ధిదారులు రెండు బ్యాంకు ఖాతాలు తెరవడం ద్వారా కలెక్టర్ నుండి పరిపాలన ఆమోదం ఉత్తర్వులు అనంతరం ఫ్రభుత్వం తరపున సబ్సిడీ మంజూరు కాబడుతుందని జెసి తెలిపారు.

మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా వెంకటరమణ
అనంతపురం అర్బన్, మార్చి 23: జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులుగా కోటా వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా బెస్త నారాయణ స్వామిని ఎంపిక చేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంత నగేష్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నగేష్, ఉపాధ్యక్షులు కుళ్లాయప్ప వ్యాస్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలను సంక్రమంగా నిర్వర్తించి, మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

వలస కూలీలకు పనులు కల్పించండి..
అనంతపురం సిటీ, మార్చి 23: జిల్లాలో వరుస కరవులతో సొంత గ్రామాల్లో ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన రైతులు, కూలీలను తిరిగి సొంత గ్రామాలకు రప్పించి ఉపాధి హామీ పథకం ద్వారా పనలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు గురువారం డ్వామా పిడి నాగభూషణంకు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగయ్య, కేశవరెడ్డిలు మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది జిల్లాలో భయంకరమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పంటలు పండక రైతులు, పనుల్లేక వ్యవసాయ కూలీలు పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటకకు లక్షలాది మంది వలస వెళ్లారన్నారు. ఆ ప్రాంతాల్లో రైతులు, కూలీలు పనలు కోసం దుర్భర జీవితాలను గడుపుతున్నారన్నారు. కేరళలోని కొచ్చిన్ నగరంలోని కాలూరు జంక్షన్, కడవేంద్రి జంక్షన్, గాంధీనగర్‌లాంటి ప్రాంతాల్లో వలస కూలీలు ఫుట్‌పాత్‌లు, బస్టాండుల్లో నిద్రిస్తూ ఉదయానే్న పనులు కోసం ఎదురుచూస్తుండడం చాలా దారుణమన్నారు. అ ందులో కొంతమంది పనులు దొరకక పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలైతే లైగింక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు.
ఇంత దుర్భర జీవనం గడుపుతున్నా ప్రభుత్వం, అధికారులు అధిక ఆదాయం కోసమే రైతులు, కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని చెప్పడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించి పనులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి.నారాయణస్వామి, శ్రీకాంత్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.