అనంతపురం

గూడ్స్ దోపిడీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, మార్చి 25 : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని గూళపాల్యం వద్ద ఈనెల 23వ తేదీ రాత్రి గూడ్స్ రైలులో కొంతమంది వ్యక్తులు దోపిడీకి పాల్పడిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గూడ్స్ వ్యాగెన్‌లో ఉన్న బియ్యం బస్తాలను చోరీ చేసేందుకు యత్నించిన నిందితులను ఆర్పీఎఫ్ ఐపిఎఫ్ ప్రసాద్, సిఐబి అంథోని ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు హర్యాణాలోని కర్నల్ నుంచి కృష్ణరాజపురానికి బియ్యం రవాణా చేస్తున్న గూడ్స్ రైలు గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని గూళపాల్యం స్టేషన్‌కు రాత్రి 9.30 గంటలకు చేరుకుంది. రాత్రి 11.30 సమయంలో రైల్వే కాంట్రాక్ట్ పనులకు వచ్చిన వలస కూలీల్లో కొంత మంది బియ్యం బస్తాలను రైలు నుంచి కిందకు పెద్దఎత్తున దించేందుకు యత్నించారు. గమనించిన స్థానికులు స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించడంతోపాటు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో దుండుగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆర్పీఎఫ్ సిబ్బంది పథకం ప్రకారం మాటు వేసి దాక్కున్నారు. గమణించిన దుండుగులు బియ్యం బస్తాలను తరలించేందుకు రాగా వ్యక్తిని ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు హరీష్‌నాయక్, రాము నాయక్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
రాళ్లతో దాడి... వ్యక్తి మృతి
రొళ్ల, మార్చి 25 : మండల పరిధిలోని హెచ్‌టి హళ్లిలో శనివారం తెల్లవారుజామున నిద్రించిన గోవిందప్ప (48)పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున గోవిందప్పపై రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడగా వెంటనే చికిత్స నిమిత్తం టుంకూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కలెక్టరేట్ ముట్టడి
అనంతపురం కల్చరల్, మార్చి 25: నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొందరు వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు నిర్వహిస్తూ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని ఎపి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్.రాజు పేర్కొన్నారు. ఈమేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో రోగుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో తమ విధులను నామమాత్రంగా నిర్వహిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు నెలకొల్పి, ప్రభుత్వాసుపత్రిలోని రోగులను సైతం తమ క్లినిక్‌లకు తరలిస్తున్న వైద్యులపై చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా కోట్ల రూపాయల అక్రమాస్తులను కూడబెట్టిన వైద్యుల ఆస్తులను జప్తు చేయాలని, ఏళ్లతరబడి ఇక్కడే తిష్టవేసుకున్న వైద్యులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంటిమద్ది ఓబిలేసు, చిన్న పెద్దన్న, స్వామిదాస్, కనేకల్ కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.