అనంతపురం

ఆన్‌లైన్‌లో అంగన్‌వాడీల వివరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 11 : రాష్టవ్య్రాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్న సేవలను రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ వర్కర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, లబ్ధిదారులు, సేవల సమగ్ర సమాచారాన్ని, ఏ రోజుకారోజు పక్కా వివరాల్ని సిఎం డ్యాష్ బోర్డుకు అనుసంధానమయ్యేలా నమోదు చేయడం ప్రధాన అంశాలు. ఈనేపథ్యంలో జిల్లాలోని మొత్తం 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 5,126 అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న 2,699 మంది వర్కర్లకు కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఈనెలాఖరుకు లేదా వచ్చేనెల మొదటి వారానికి వీరికి శిక్షణ పూర్తి కానుంది. ఇప్పటికే తొలి దశ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల 17 నుంచి 19 వరకు, 21 నుంచి 23వ తేదీ వరకు రెండో దశల్లో మూడు రోజుల చొప్పున మరోమారు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన అంగన్‌వాడీ వర్కర్లకు ఆయా కేంద్రాల సమాచారాన్ని నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెల్‌ఫోన్లు అందిస్తోంది. త్వరలో 2,699 మందికి అవి అందనున్నాయి. సెల్‌ఫోన్ ద్వారా ఆయా గ్రామాలకు సంబంధించి పూర్తి సమాచారం (సర్వే డేటా), అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతల వివరాలు, ఏరోజుకారోజు ఎంత మందికి ఆహారం అందించారు, ఆరోగ్య పరంగా తీసుకుంటున్న చర్యలు వంటి వివరాలను నమోదు చేస్తారు. ఈ సమాచారం అంతా సిఎం డ్యాష్ బోర్డులో నిక్షిప్తం కానుంది. వచ్చే నెల నుంచి ప్రత్యేకంగా ఐసిడిఎస్ వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. కాగా రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన నలుగురు మాస్టర్ ట్రైనర్లు జిల్లాలోని ఐసిడిఎస్ సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తారు. సుమారు 180 మంది దాకా శిక్షణ పొందుతున్న వీరంతా అంగన్‌వాడీ కేంద్రాల వర్కర్లకు శిక్షణ ఇస్తారు. ఈనేపథ్యంలో మాస్టర్ ట్రైనర్లకు ఈనెల 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురం నగర సమీపంలోని ప్రాంగణంలో వీరికి శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జుబేదాబేగం తెలిపారు.
క్షేత్రస్థాయిలో బిజెపి బలోపేతం
* ఆలయాల స్థాయి పెంపు
* దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు
గుంతకల్లు, ఏప్రిల్ 11 : క్షేత్రస్థాయిలో బిజెపి పార్టీని బలోపేతం చేసే ందుకు త్వరలో బూత్ కమిటీలు ఏ ర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. మంగళవారం స్థానిక రైల్వే కోజీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి, కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుంటారన్నారు. ఇందులో భాగంగానే బూత్ కమిటీలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఎంపిలు మురళీధర్‌రావు, కమలరాజ్ మిశ్రాలు పర్యటించారన్నారు. అట్టడగు వర్గాలకు చెందిన ప్రజలను చైతన్యవంతం చేయడానికి కమ్యూనిజం, కెఫ్టెలిజంకు ప్రత్యామ్నాయంగా ఇంటిగ్రెటెడ్ హుమనిజానికి పండిట్ ధీన్ దయాల్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇకపోతే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జనవరి 2వ తేదీ నుంచి దివ్యదర్శనం పేరుతో మండల కేంద్రాల నుంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, వసతి, బోజన సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలో దాదాపు 10 వేల మందికి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది రెట్టింపు స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్టవ్య్రాప్తంగా ఆలయాల స్థాయి పెంపు, మెరుగైన వసతులు కల్పించడంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసి ఆలయాల ఆదాయం, వ్యయం, భద్రత, ఆస్థులకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద మనుషుల చేతుల్లో ఆస్థుల వివరాలు, కోర్టులో ఉన్న వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచి ఆస్థుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపోతే శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి పర్యాటక శాఖ సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు పూర్థిస్థాయిలో అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ మంత్రికి ఆంజనేయస్వామి చిత్రపటం అందజేసి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పురంధర్, జిల్లా ఉపాధ్యక్షుడు బండారు కృష్ణమూర్తి, నాయకులు శేఖన్న, ట్రస్ట్ బోర్డు సభ్యులు మహేష్, విజయలక్ష్మి, బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు అంజి, పవన్‌కుమార్ గౌడ్, చంద్రశేఖర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా సంక్షేమ ఫలాలు
* మంత్రి పరిటాల సునీత
అనంతపురం సిటీ, ఏప్రిల్ 11: పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్దిని పారదర్శకంగా అందించాలని రాష్ట్ర శిశు సంక్షేమ, సెర్ప్ శాఖల మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో డిఆర్‌డిఎ పిడి, ఆయా శాఖల సిబ్బందితో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికి మహిళల ఆర్థిక స్వాలంబనను కల్పించేందుకు ప్ర భుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, మహిళలకు రుణాలను అం దించి లక్షాధికారులను చేయాలనే ధ్రుడసంకల్పంతో ప్రభుత్వం ముం దుకు పోతున్నదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు తమ అలసత్వాన్ని వీడి ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాల లబ్దిని అందించాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అందిస్తున్న పథకాలను ఫ్లెక్సీల రూపంలో ప్రచారం చేయాలని, అలాగే పథకాల ఉద్ద్యేశాలను ప్రజ ల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన, గాయపడిన చంద్రన్న బీమా లబ్దిదారులకు ప్రభుత్వం 13 కోట్లను జిల్లాల వారి ఖాతాల్లో జమ చేసిందన్నారు. అయితే ఏ నియోజకవర్గానికి ఎంతమంది లబ్దిదారులకు ఎంతమేర లబ్దిని అందించారన్న విషయాలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తప్పనిసరిగా అధికారులు సమాచారాన్ని అందించాలన్నారు. అర్హత కలిగిన అధికారులకు, సిబ్బందికి ప్రమోషన్లను కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి వెంకటేశ్వర్లు, ఎంపిఎంలు, ఎపిడిలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ వార్డులు టిడిపివే..
* ఐదింటిలో మూడు స్థానాలు ఏకగ్రీవం
* హిందూపురం, తాడిపత్రిలో విజయం
* జిల్లాలో ఉప ఎన్నికల తీరు...

అనంతపురం, ఏప్రిల్ 11 : జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఖాళీ పడిన వార్డులకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఐదు స్థానాలూ టిడిపినే కైవసం చేసుకుంది. తాడిపత్రి, హిందూపురం, పామిడి, రాయదుర్గం మున్సిపాలిటీతోపాటు నగర పంచాయతీల్లో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. రాష్టవ్య్రాప్త ఎన్నికల్లో భాగంగా గతనెల ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడిపత్రిలోని 6వ వార్డు, రాయదుర్గంలోని 8వ వార్డు, పామిడిలోని 18వ వార్డుల్లో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన రెండు స్థానాల్లో హిందూపురం మున్సిపాలిటీలోని 9, తాడిపత్రిలోని 6వ వార్డులకు ఈనెల 9న ఉప ఎన్నికలు జరిగాయి. వీటికి 11న (మంగళవారం) కౌంటింగ్ నిర్వహించారు. ఈ రెండు స్థానాల్లో టిడిపి అభ్యర్థులే విజయం సాధించారు. ఏకగ్రీవమైన వార్డులకు సంబంధించి పామిడి 18వ వార్డుకు సువర్ణ, తాడిపత్రిలోని 4వ వార్డుకు రసూల్‌బి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ వార్డుకు గత ఎన్నికల్లో కౌన్సిలర్‌గా ఎన్నికైన సాధిక్ వలి హత్యకు గురికావడంతో ఖాళీ పడిన ఈ స్థానానికి అతని సోదరి అయిన రసూల్‌బీని టిడిపి బరిలోకి దింపింది. దీంతో సాధిక్ హత్యకు గురైనందున ఆ స్థానంలో వైకాపా సానుభూతి కొద్దీ అధిష్టానం ఆదేశాల మేరకు తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు. దీంతో రసూల్‌బీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అలాగే రాయదుర్గంలో 8వ వార్డు ఉప ఎన్నికల్లో ముదిగల్లు జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికైంది. గత ఎన్నికల్లో ఈమె భర్త పోటీ చేసి గెలిచాడు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భార్య అయిన జ్యోతిని టిడిపి పోటీకి నిలిపింది. ఇక్కడ కూడా సానుభూతితో వైకాపా, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపలేదు. దీంతో జ్యోతి స్థానం కూడా ఏకగ్రీవమైంది. అలాగే పామిడిలోనూ 18వ వార్డు నుంచి సువర్ణ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇక ఎన్నికలు జరిగిన హిందూపురంలోని 9వ వార్డులో టిడిపి అభ్యర్థి బోయ శాంతి, కాంగ్రెస్ నుంచి రాధ పోటీ పడ్డారు. ఈ వార్డులో 2,367 ఓట్లు ఉండగా, 1395 పోలయ్యాయి. టిడిపి అభ్యర్థికి 1167 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు కేవలం 228 ఓట్లు వచ్చాయి. కాగా వైకాపా తరఫున నామినేషన్ వేసిన అంగన్‌వాడీ టీచర్ సునీత, తన ఉద్యోగానికి చేసిన రాజీనామా ఆమోదానికి నోచుకోక పోవడంతో స్క్రూటినీలో తిరస్కారానికి గురైన విషయం తెలిసిందే. దీంతో టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టిడిపి అభ్యర్థి 939 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ మెజారిటీనే అత్యధికం కావడం విశేషం. కాగా వివిధ కారణాల వల్ల ఓటర్లు ఈ వార్డు ఎన్నికల్లో ఓటేసేందుకు అనాసక్తితో ఉండటంతో, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓటర్లను బతిమలాడి ఓటింగ్‌కు తీసుకొచ్చి ఓట్లేయించారు. వారి కృషి ఫలించడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. తాడిపత్రిలోని 4వ వార్డుకు జింకాలక్ష్మిదేవి కౌన్సిలర్‌గా ఎన్నికైంది. ఈ వార్డులో మొత్తం 1680 ఓట్లు ఉండగా, 1181 ఓట్లు పోలయ్యాయి. టిడిపి తరపున జింకా లక్ష్మీదేవికి 797, వైకాపా అభ్యర్థి షబ్బీర్‌కు 380, స్వతంత్ర అభ్యర్థి రియాజ్‌బాషాకు 4 ఓట్లు దక్కాయి. టిడిపి అభ్యర్థి 417 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఈ వార్డులో టిడిపి కౌన్సిలర్‌గా ఉన్న గంగమ్మ మృతిచెందడంతో ఆమె కోడలు లక్ష్మిదేవిని టిడిపి పోటీకి దింపింది. దీంతో ఓటర్లు సానుభూతి చూపడంతో గెలుపు సులువైంది. అయితే వైకాపా, టిడిపిలు ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెట్టడం విశేషం.

‘పురం’ వార్డు ఉప ఎన్నికలో
టిడిపి అభ్యర్థి విజయం
* రికార్డు స్థాయిలో 939 మెజార్టీ
* కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు
హిందూపురం టౌన్, ఏప్రిల్ 11 : మున్సిపల్ పరిధిలోని 9వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శాంతి ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం ఎంజిఎం పాఠశాల ఆవరణలో ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, తహశీల్దార్ చల్లా విశ్వనాథ్‌ల ఆధ్వర్యంలో కౌంటింగ్ నిర్వహించారు. వార్డు పరిధిలో మొత్తం 2576 ఓట్లు ఉండగా 1395 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శాంతికి 1167 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి వడ్డె రాధమ్మకు కేవలం 228 ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో టిడిపి అభ్యర్థికి రికార్డు స్థాయిలో 939 మెజార్టీ దక్కినట్లయింది. టిడిపి తరపున ఏ.నాగరాజు చీఫ్ ఏజెంట్‌గా వ్యవహరించగా కాంగ్రెస్ తరపున పిసిసి కార్యదర్శి ఇందాద్ చీఫ్ ఏజెంట్‌గా వ్యవహరించారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థికి మూడు పోలింగ్ బూత్‌లలో ఎక్కడా మూడంకెల ఓట్లు దక్కలేదు. చివరకు డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది. కౌంటింగ్ అనంతరం ఎన్నికల అధికారి విశ్వనాథ్‌తోపాటు ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు టిడిపి అభ్యర్థి శాంతికి ధృవీకరణ పత్రం అందజేశారు. కౌంటింగ్‌ను పురస్కరించుకుని డిఎస్పీ సుబ్బారావు నేతృత్వంలో సిఐలు ఇదుర్‌బాషా, మధుభూషణ్, రాజగోపాల్‌నాయుడు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా టిడిపి అభ్యర్థి శాంతి విజయం సాధించిన వెంటనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం బయట పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చుతూ మి ఠాయిలు పంచి పెడుతూ చిందు లు తొక్కారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, వైస్ ఛైర్మన్ జెపికె రాము, నియోజకవర్గ సమన్వయ కర్త కృష్ణమూర్తి, టిడిపి నేతలు అంబికా లక్ష్మీనారాయణ, జెఇ వెంకటస్వామి, అమర్‌నాథ్, నింకంపల్లి రామాంజి, డిఇ రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉప ఎన్నిక ఫలితంతో పెరిగిన బాధ్యత
* ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హిందూపురం, ఏప్రిల్ 11 : రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో హిందూపురం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో తమ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిచి తనపై మరింత బాధ్యత పెంచిందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం వెలువడిన ఫలితాల అనంతరం టిడిపి నాయకులు ఆయన నివాసంలో సంబరాలు చేసుకుంటుండగా బాలకృష్ణ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అభ్యర్థి శాంతి, టిడిపి నేతలను అభినందించారు. తద్వారా మరింత బాధ్యతగా హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
వైభవంగా ఆలూరు రంగనాథస్వామి
కల్యాణోత్సవం
తాడిపత్రి, ఏప్రిల్ 11 : ఆలూరు రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరంగనాథ స్వామివారి కల్యాణోత్సవం మంగళవారం తెల్లవారుజామున వైభవంగా నిర్వహించారు. మండల పరిధిలో ఆలూరుకోనలో వెలసిన శ్రీరంగనాథ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై పట్టువస్త్రాలతో సుందరంగా అలంకరించిన రంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలకు వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలతో కల్యాణోత్సవం నయనానందకరంగా నిర్వహించారు. శ్రీవారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణోత్సవానంతరం భక్తులకు అన్న సంతర్పణ జరిగింది. పుష్పాలాంకృతులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో ఆలూరు కోన నుండి ఆలూరు గ్రామంలోని మహారథం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను మహారథం పీఠంపై ఆశీనులు కాగా, గోవింద నామస్మరణల నడుమ రాతి చక్రాల మహారథాన్ని భక్తులు లాగారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.
జంబులింగేశ్వర స్వామి రథోత్సవం
విడపనకల్లు, ఏప్రిల్ 11 : మండల పరిధిలోని హావళిగ గ్రామంలో మంగళవారం శ్రీ జంబులింగేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి అర్చనలు, అభిషేకాలతో పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. సాయంత్రం స్వామివారిని రథంలో ఆశీనులను చేసి ఊరేగించారు. వేడుకలు తిలకించడానికి కరకముక్కల, పాల్తూరు, చుట్టూపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పాల్తూరు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా చెన్నకేశవస్వామి రథోత్సవం
తాడిమర్రి, ఏప్రిల్ 11: మండలంలో శ్రీలక్ష్మిచెన్నకేశవ ఆలయంలో గత ఆరు రోజులుగా బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనవాయితీగా వస్తున్న మడుగుతేరు లాగించి అనంతరం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా రాతిదూలాల లాగుడు పందేలు నిర్వహించారు. ఈ పందెంలో పలు గ్రామాల నుండి 15 జోడీల ఎద్దులబండ్లు పాల్గొన్నాయి. వీటిలో బండమీదపల్లి గ్రామం మొదటి బహుమతి రూ.8వేలు, 2వ బహుమతి గుడ్డంపల్లి రూ.5,116లు, 3వ బహుమతి దుగుమర్రి గ్రామం రూ.3వేలు నగదు బహుమతి పొందాయి. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరాణిక నాటకాలు వేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య రాకుండా
చర్యలు తీసుకోండి
* చీఫ్‌విప్ పల్లె
పుట్టపర్తి, ఏప్రిల్ 11: వేసవి సమయాన తాగునీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురంలోని తన నివాస గృహానికి పుట్టపర్తి మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లను పిలిపించి సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి నీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ కార్యాలయ భవన నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని, రూ.4.09 కోట్లతో నిర్మాణంలో వున్న సిసి రోడ్లు పూర్తి చేయాలని, రూ.14.50 కోట్లతో చేపట్టనున్న చిత్రావతి చెక్‌డ్యాం నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే నిర్మాణపు పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 24న జరిగే సత్యసాయి ఆరాధనోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో పెంచిన పన్నులు తగ్గించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు
మరింత అందుబాటులో ఉంటా....
తనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి మండలిలో చోటునిచ్చి వివిధ శాఖలను అప్పజెప్పడం ద్వారా నియోజకవర్గ ప్రజలతో పూర్తిగా అందుబాటులో వుండలేకపోయిన సందర్భాలు గతంలో వుండేవని పల్లె అన్నారు. ఇక నుండి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో వుంటానన్నారు. పుట్టపర్తిలో నీటి సమస్యను, విద్యుత్ అంతరాయ సమస్యలు కలగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ప్రసాద్, డిఈ గోపాల్‌నాయుడు, మున్సిపల్ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి, ఏఈ రామ్‌ప్రసాద్, మేనేజర్ మురళికృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వైభవంగా జంబుకేశ్వరస్వామి వెండి రథోత్సవం
రాయదుర్గం, ఏప్రిల్ 11 : పట్టణంలోని అతిప్రాచీనమైన శ్రీ జంబుకేశ్వర స్వామి రథోత్సవం మంగళవారం ఎంతోవైభవంగా జరిగింది. ఈనెల 4 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెండి రథోత్సవం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం, యాగాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కంసల నాగరాజు, ఎండోమెంటు అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా శ్రీవారి కల్యాణం
గుంతకల్లు, ఏప్రిల్ 11 : స్థానిక పురాతన కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతాకోదండరామస్వామి కల్యాణోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి రోజు నుంచి ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, హనుమన్ చాలీసా పారాయాణాలు నిర్వహించారు. మంగళవారం స్వామివారి పట్ట్భాషేకాన్ని పురస్కరించుకుని ఉదయం ఆలయంలోని మూలవిరాట్ కోదండరామస్వామి, సీతమ్మ వార్ల కల్యాణం నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం, ప్రసాద వితరణగావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు బోర్డు అధ్యక్షులు డివి సుబ్రమణ్యం, సభ్యులు జీవన్‌గుప్తా, రాజేంద్రప్రసాద్, చంద్రశేఖర్, సుధీర్ కార్వా, మురళీమోహన్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.