అనంతపురం

పండ్ల తోటల సాగుకు నీటి గండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 30 : ఈఏడాది జిల్లాలో ఉద్యాన పంటల సాగుపై నీటి ఎద్దడి ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో దీంతో అధికారులు సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్య సాధనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో జిల్లావ్యాప్తంగా 63 మండలాల్లో 1,71,028 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేశారు. వీటిలో వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయలు, ఔషధ సంబంధ మొక్కలు, కొబ్బరి తదితరాలు, పూలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఉద్యాన పంటల సాగుకు అధికారులు కార్యచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా పంపారు. ఈమేరకు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో గతేడాది విస్తీర్ణం కన్నా అదనంగా 5 హెక్టార్లు పెరగవచ్చని భావిస్తున్నారు. అదీ వర్షం పడితేనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వర్షం కొంచెం బాగా కురిసినట్లయితే సుమారు 10 హెక్టార్ల వరకు కూడా ఉద్యన పంటల్ని సాగు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు వర్షాభావంతో నిలువునా ఎండిపోవడంతో ఆయకట్టుతో పాటు సమీపంలోని బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో అన్ని రకాల పంటలు బాగా దెబ్బ తిన్నాయి. గత ఖరీఫ్, రబీలో జిల్లాలో వేరుశనగ, ఇతర పంటలు కలిపి సుమారు 18 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే వర్షం సరిగా కురవకపోవడంతోపాటు హుదుద్ తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల సాగుపైనా క్షామ పరిస్థితులు ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో పండ్ల తోటలు 1,22,654 హెక్టార్లలో మాత్రమే సాగైంది. కూరగాయల సాగు 35,313 హెక్టార్లు, మెడిసినల్, ఆరోమేటిక్ మొక్కల పెంపకం 288 హెక్టార్లు, కొబ్బరి తదితరాలు 2,629 హెక్టార్లు, స్పైసీస్ 6,879 హెక్టార్లు, పూల తోటలు సాగు 3,665 హెక్టార్లలో సాగు చేశారు. ఈ క్రమంలో నార్పల మండలంలో 13,488 హెక్టార్లు, యల్లనూరు మండలంలో 10,185 హెక్టార్లలో అత్యధికంగా ఉద్యాన పంటలు సాగయ్యాయి. అత్యల్పంగా కణేకల్లు, గుమ్మఘట్ట, పెద్ద వడుగూరు, గోరంట్ల, నల్లమాడ, ఒడి చెరువు, నల్లచెరువు మండలాల్లో అత్యల్పంగా 500 నుంచి 955 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. మిగతా మండలాల్లో 1000 నుంచి 4,600 హెక్టార్ల వరకు సాగు చేశారు. రాష్ట్ర ఉద్యానమిషన్ రాష్ట్రీయ వికాస్ యోజన (హైబ్రీడ్ కూరగాయల పెంపకం), స్టేట్ ప్లాన్ కలిపి గత ఏడాది (2016-17) రూ.4,946 లక్షల విలువైన 2,95,900 యూనిట్ల మంజూరు లక్ష్యం కాగా, రూ.3,587 లక్షల ఖర్చుతో 2,59,718 యూనిట్లు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.6,076.89 లక్షల విలువైన 2,59,056 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా జిల్లా ప్రణాళికలో నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇందుకోసం అర్హులైన రైతుల (లబ్ధిదారులు) ఎంపిక కార్యక్రమం కొనసాగుతోందని ఉద్యాన శాఖాధికారులు తెలిపారు. కాగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రెజరీలో రూ.3 కోట్ల వరకు పెండింగ్‌లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు చెల్లింపులు ఆపేశారు. దీంతో గత ఏడాది లబ్ధి పొందిన రైతులు వేలాది మంది బకాయి సొమ్ము కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఆ ఆర్థిక సంవత్సరం (2017-18)లో రాష్ట్ర ఉద్యాన మిషన్ ఆధ్వర్యంలో పండ్ల మొక్కల ఉత్పాదన, అభివృద్ధికి నర్సరీల ఏర్పాటు, నూతన పండ్ల తోటల విస్తరణ, హైబ్రీడ్ కూరగాయ విత్తనాల ఉత్పత్తి, పూల తోటల విస్తరణ, రెండు, మూడో సంవత్సరంలో పండ్ల తోటల విస్తరణ, మల్చింగ్, షేడ్‌నెట్స్, గ్రీన్ హౌస్‌ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు తదితర 20 రకాలకు సంబంధించి 1,06,862 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు రూ.2,874.91 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద హైబ్రీడ్ కూరగాయల పెంపకంలో భాగంగా నూతన పండ్ల తోటల విస్తరణ, హైబ్రీడ్ కూరగాయల విత్తనాల పంపిణీ, శాశ్వత పందిళ్లు, టమాటా ట్రెల్లీస్, పాత తోటల పునరుద్ధరణతో పాటు టిష్యూ కల్చర్, ఐపి ఎం మామిడి తదితర 15 అంశాలకు సంబంధించి రూ.1,485.05 లక్షల అంచనా వ్యయంతో 3,850 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే రాష్ట్ర ప్రణాళిక(స్టేట్ ప్లాన్) కింద నూతన పండ్ల తోటల విస్తరణ, పూల తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణ, నీటి వనరుల ఏర్పాటు (్ఫరంపాండ్స్) తదితర 13 అంశాలకు సంబంధించి రూ.1,842.89 లక్షల అంచనా వ్యయంతో 2,59,056 యూనిట్లు మంజూరు చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం లబ్ధిదారులైన రైతుల ఎంపిక కొనసాగుతోంది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 37,000 యూనిట్లు తక్కువగా లక్ష్యాన్ని నిర్దేశించడం జిల్లాలో నీటి ఎద్దడి పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పొచ్చు.