అనంతపురం

రిటైల్ రంగంలోకి తనిష్క్ జ్యుయలరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 21: దేశంలో ఎక్కువమంది అభిమానించే బంగారం ఆభరణాల బ్రాండ్ తనిష్క్ రిటైల్ రంగంలోకి అడుగిడింది. అనంతపురంలో తమ మొదటి స్టోర్‌ను తనిష్క్ జనరల్ మేనేజర్ గోపాలరత్నం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ గోపాలరత్నం మాట్లాడుతూ గతంలో గోల్డ్‌ప్లస్ - ఏ టాటా స్టోర్‌గా ఉన్న ఈ స్టోర్ ఇప్పుడు అతి పెద్ద, వృద్ధి చెందుతున్న తనిష్క్ రిటైల్ నెట్‌వర్క్‌లో 229వ స్టోర్‌గా అనంతపురం స్టోర్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకు ప్రతి ఆభరణం కొనుగోలుపై ఉచిత బంగారు నాణెములను అందుకునే అవకాశం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆఫర్ 21నుంచి సెప్టెంబర్ 23 వరకే ఉంటుందన్నారు. అనంతరం తనిష్క్ బంగారు ఆభరణాలు ధరించిన మోడల్స్ క్యాట్‌వాక్ నిర్వహించారు.
ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఫిజియో థెరఫీ
ఆత్మకూరు, సెప్టెంబర్ : ఆత్మకూరు ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఎస్సీ కాలనీ పాఠశాలలో ప్రత్యేక అవసరాల అవసరమున్న పిల్లల కోసం ప్రతి గురువారం ఫిజియో థెరఫీ ఏర్పాటుచేసినట్లు ఫిజియో థెరఫిస్ట్ జగన్మోహన్ తెలిపారు. గురువారం 11 మంది పిల్లలకు ఫిజియో థెరఫీ నిర్వహించారు. మానసిక శారీరక అంగవైకల్యం కల్గిన వారి కోసం ఈ థెరఫీ ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియో థెరఫీ సిబ్బంది అరుణ, రమేష్ పాల్గొన్నారు.

మీ సేవా వినియోగదారులకు పారదర్శకంగా సేవలందించాలి
* జెసి టికె.రమామణి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: మీ సేవా వినియోగదారులకు సేవల కొరకు పారదర్శకంగా విధులు నిర్వహించాలని, లేకపోతే మీపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జెసి టికె.రమామణి మీ సేవా నిర్వాహకులను ఆదేశించారు. గురువారం స్థానిక రెవిన్యూ భవన్‌లో గల సమావేశ మందరంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో మీ సేవా అమలుతీరుపై వినియోగదారులకు అందించే సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ మీ సేవా వినయోగదారులతో స్నేహపూరిత వాతావరణంలో నిర్వహింపబడాలని తెలిపారు. మీసేవా ఆపరేటర్లు సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో అధికారులను ప్రలోభాలకు గురిచేసి క్రమపద్ధతిలో కాకుండా ఇతర విధాలుగా సేవలు పరిష్కారం చేసినట్లుగా కనుగొన్నయెడల మీ సేవా ఆపరేటర్లపై, సంబందిత అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ సేవా నిర్వాహకులు అనుమతి ఉన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మార్చిన యెడల మీసేవను రద్దు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి, ఆర్‌డిఓ మలోలా, మీ సేవా నిర్వాహకులు పాల్గొన్నారు.
పదోన్నతులను వెంటనే చేపట్టాలి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: ప్రభుత్వ పాఠశాలల్లోని సీనియార్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులను వెంటనే చేపట్టాలని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జిలాన్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని పిఎస్ హెచ్‌ఎంలకు, మిగిలిన సబ్జెక్టులలోని సీనియార్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు పూర్తిగా పాఠ్య పుస్తకాలను అందజేయాలని, ఏకరూప దుస్తులను అందించాలని డిమాండ్ చేశారు. బదిలీలు, ప్రమోషన్స్ పొందిన పండితులకు ఒకే జూయినింగ్ తేదీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి డిఇఓ సంఘాల కో ఆర్టినేషన్ మీటింగ్‌ను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధాకర్, ఎస్‌వివి.రమణయ్య, గౌరవాధ్యక్షులు నాగేంద్రబాబు నాయకులు గోవిందరాజులు, జయచంద్రారెడ్డి, ఈశ్వరయ్య, సాయినాథ్‌బాబు, సరళ, రామపచ్చారం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.