అనంతపురం

వైఎస్సార్ కుటుంబానికి ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ కుటుంబానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ తెలిపారు. సోమవారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో శంకరనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో ఇంటింటి తలుపు తట్టడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రజలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి సంపూర్తిగా పూర్తి చేయలేదన్న భావన జనంలో వ్యక్తం అవుతోందన్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీతోపాటు డ్వాక్రా సంఘాల రుణమాఫీపై తమ నిరసనను వ్యక్తం చేయటం జరుగుతుందన్నారు. పచ్చచొక్కాల వాళ్లకు మాత్రమే వీటిని సద్వినియోగం చేసుకొంటున్నారన్నారు. సమావేశంలో ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షులు మలోబులేసు. జిల్లా విద్యార్థి విభాగం నాయకులు బండి పరుశురామ్ పాల్గొన్నారు.
దరఖాస్తుల గడువు పెంపు
అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 25: పట్టణాల వారి నుంచి ఆశించిన మేర దరఖాస్తులు రాకపోవటంతోపాటు గ్రామీణ ప్రాంతాల వారికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో మహిళా పోలీస్ వలంటీర్ల దరఖాస్తుల గడువు పెంచటం జరిగిందని ఎస్పీ జీవిజీ. అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించి ఓ ప్రకటనను విడదల చేసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళా పోలీసు వలంటీర్ల (ఎం.పి.వి ) దరఖాస్తు గడువు అక్టోబర్ 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అనంతపురం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొన్నాయన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 1500 మంది ఎం.పి.వి.లను నియమించుకోవటం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.