అనంతపురం

రైతు సంక్షేమమే టిడిపి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగళి, సెప్టెంబర్ 25: రైతుల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని మధూడి, మధూడి గొల్లహట్టి గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మధూడి గ్రామంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్నలతో కలిసి ఇంటింటికీ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అదే విధంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ రైతుల కోసంనష్టపరిహారం, పంటల బీమాను మంజూరు చేశామన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన కాలనీకి ఎన్టీఆర్ కాలనీగా నామకరణం చేశారు. మండల కన్వీనర్ కుమారస్వామి, సిడిపిఓ ఇందిరాదేవి, నాయకులు రామకృష్ణ యాద వ్, బసవరాజు, రామకృష్ణప్ప, తిప్పేస్వామి, రవికుమార్, శ్రీనివాసప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎండిపోయిన పండ్ల తోటలను కాపాడాలి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 25: శింగనమల నియోజవర్గంలో ఎండిపోయిన పండ్ల తోటలను సాగునీరు ఇచ్చి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మీకోసం కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఓబుళు, రామాంజినేయులు, శివారెడ్డి, సంగప్ప, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసులు, నీలం దీనేష్‌రెడ్డి, చెన్నారెడ్డి, వెంకటరెడ్డి, రామాంజి, మాధవరెడ్డి, పోతులయ్య పాల్గొన్నారు.
24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 25: జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను ఆర్‌పిఎస్ నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆర్‌పిఎస్ అధ్యక్షుడు జి.నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చిన్నపిల్లల వార్డుల నందు సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి నందు అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలిపే బోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు బ్లడ్ బ్యాంకు సేవలు అందుబాటులో ఉంచాలని, 124 జివో వెంటనే అమలుచేయాలని, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జిల్లా ప్రజలకు అందించాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజికి పిజి సీట్లను కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పిఎస్ నాయకులు సి రాజగోపాల్, చక్రధర్ యాదవ్, ఐఎంఎం భాష, ఎంఎండి ఇమామ్, సుధాకర్ యాదవ్, తనిషా, సుబ్బరాయుడు, శశియాదవ్, లక్ష్మన్, బాబా పాల్గొన్నారు.