అనంతపురం

కియా పనులు గడువులోగా పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 25: కియా కార్ల ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన నీరు, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణానికి సంబందించిన పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో కియా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్, ఇతర ప్రతినిధులతోపాటు సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ కియా కార్ల ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కియా ప్రతినిధులు కోరిన విధంగా నిర్ధేశింన గడువులోపు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు. కియా ప్రాజెక్టుకు నీటి సరఫరాకు సంబంధించి శాశ్వత పనులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. నీటి పైపులైను ఏర్పాటుకు భూ సేకరణ చేయాల్సిన అవసరం లేదని కియా ప్రతినిధులకు స్పష్టం చేశారు. టౌన్‌షిప్, ట్రైనింగ్ సెంటర్లకు తాత్కాలికంగా నీటిని సరఫరా చేసేందుకు కియా ప్రతినిధులు కోరిన మేరకు బోర్లను వేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ హరేరాం నాయక్‌ను ఆదేశించారు. విద్యుత్ సరఫరా శాశ్వత పనులకు అక్టోబర్ 9వ తేదీన టెండర్ వేసి, అక్టోబర్ 15 నుండి పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాక్సంపల్లి నుండి ప్లాంట్‌కు విద్యుత్‌లైను ఏర్పాటుకు అటవీ శాఖ, రైల్వేల నుండి మూడు వారాల్లోపు అనుమతులు తెప్పించి తాత్కాలికంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కియా టీం ప్రతినిధులను సంప్రదించి ఆర్‌ఓబి డిజైన్లను రూపొందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కియా ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎపిఐఐసి జోనల్ మేనేజర్ రఘునాథ్, డిప్యూటి జిఎం నాగభూషణం, పరిశ్రమల శాఖ జిఎం సుదర్శనరావు, పెనుకొండ ఆర్‌డిఓ రామ్మూర్తి, డిఎఫ్‌ఓ చంద్రశేఖర్, డిపిఓ సుధాకర్‌రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

3నెలలకు ఒకసారి ఆహార సలహా సంఘం సమావేశం
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 25: జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆహార సలహా సంఘం సమావేశాలు నిర్వస్తామని జెసి టికె.రమామణి సభ్యులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో జెసి అధ్యక్షతన ఆహార సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ గతంలో సంవత్సరానికి ఒకసారి కాకుండా ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆహార సలహా సంఘ సమావేశాలను ఏర్పాటు చేస్తామని సభ్యులకు తెలిపారు. వచ్చే నెల నుండి ఇన్‌ఛార్జి డీలర్లకు సరుకులు ఇవ్వరాదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. జిల్లాలో ఖాళీగా వున్న 149 చౌక ధరల దుకాణాల డీలర్ల నియామకాలు జరపాలని ఆర్‌డిఓలను ఇదివరకే ఆదేశించామన్నారు. నంద్యాల స్టాక్‌పాయింట్ నుండి సరుకులు తెప్పిస్తున్నారని, అయితే గుంతకల్లు, జంగాలపల్లిలో వున్న గోడౌన్ల మూతపడి వున్నాయని, వాటిని వినియోగంలోకి తేవడం ద్వారా ప్రభుత్వానికి రవాణా ఖర్చులు తగ్గుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ సూచించారు. అందుకు జెసి స్పందిస్తూ జంగాలపల్లిలో గోడౌన్‌లో మెయిన్‌టేనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 50 వేల మెట్రిక్ టన్నుల సరుకు నిల్వ చేసే జంగాలపల్లి గోడౌన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు సివిల్ సప్లైస్ ఎండి అంగీకరించారని, మరో రెండు నెలల్లో దీనిని ప్రారంభిస్తామన్నారు.
డీలర్ల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఈ-పాస్ యంత్రాల మరమ్మతుల కోసం డీలర్ల నుండి 15 రూపాయలు వసూలు చేస్తున్నారని, అందే సరుకుల్లో తూకాలు తక్కువగా వస్తున్నాయని తెలిపారు. దీనిపై డీలరు ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద వేలిముద్ర వేసి సరుకు తీసుకుని వెళ్లేలా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపుతామని సివిల్ సప్లైస్ డిఎం శివశంకర్‌రెడ్డి తెలిపారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉజ్వల పథకం కింద ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారో నివేదికలో పొందుపరచాలన్నారు. దీనిపై డిఎస్‌ఓ స్పందిస్తూ ఉజ్వల పథకం కింద 4,276 కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, వినయోగదారుల సంఘం అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ సరుకులు సరియైన సమయంలో అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి-2 సయ్యద్‌ఖాజామొహిద్దీన్, ఐసిడిఎస్ పిడి వెంకటేశం, జిల్లాలోని ఆర్‌డిఓలు, ఆహార సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

దుర్గంలో జడ్పీ ఛైర్మన్‌కు ఘనస్వాగతం
రాయదుర్గం, సెప్టెంబర్ 25: జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికైన పూల నాగరాజు పట్టణానికి మొదటిసారి రావడంతో సోమవారం ప్రజలు అపూర్వమైన స్వాగతం పలికారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్ నుండి వర్షంలో ప్రారంభమైన ఈ భారీర్యాలీలో మంత్రి కాలవ శ్రీనివాసులుతోపాటు జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, మునిసిపల్ ఛైర్‌పర్సన్ ముదిగల్లు జ్యోతి, రాయదుర్గం జడ్పీటిసి విజయకుమార్ అప్పాజీ తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధానరహదారులు లక్ష్మీబజారు, పాతబస్టాండు, శ్రీ వినాయకసర్కిల్, బళ్ళారిరోడ్డు, నేసేపేట, శాంతినగర్‌ల ద్వారా సాగి తదనంతరం శాంతినగర్‌లోని ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలువేసి కాలవ శ్రీనివాసులు, పూల నాగరాజులు ఘనంగా నివాళి అర్పించారు. ఈ భారీర్యాలీలో సాంప్రదాయ నృత్యాలు కురుబర డొల్లు, చెక్క్భజన లాంటివి పలువురిని ఆకర్షించగా పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ టిడిపి అభిమానులు కార్యకర్తలు నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈభారీ ర్యాలీ తదనంతరం పూల నాగరాజు తమ స్వంత ఇంటికి వెళ్ళి తనతల్లికి పాదాభివందనం చేశారు.