అనంతపురం

అనంతలో రౌడీరాజ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 12 : అనంతపురం రౌడీల రాజ్యంగా మారి, మాఫియా రాజ్యమేలుతోందని ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 33వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం నగర సమీపంలోని రాజా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నగరంలోతోపాటు జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థుల్ని తప్పించేందుకు హత్యలు చేస్తున్నారన్నారు. పెద్దవడుగూరు సింగిల్‌విండో సొసైటీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని సొసైటీ కార్యాలయానికి పిలిపించి హతమార్చారు. అలాగే రాప్తాడులో ప్రసాద్‌రెడ్డిని ఏకంగా తహశీల్దార్ కార్యాలయంలోనే చంపేశారు. ఇటీవల వైకాపా బీసీ విభాగం నాయకుడు ధనుంజయయాదవ్‌ను చంపడానికి కుట్ర పన్నారు. అలాగే జన్మభూమి కమిటీల పేర టీడీపీ మాఫియా గ్రామాల్ని దోపిడీ చేస్తోంది. ఇలాంటి ఘటనలతో రాజకీయాలు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి, రాజకీయ నాయకుడు చెప్పిన పని చేయకుంటే పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్లే పరిస్థితి రావాలన్నారు. జగన్ ఒక్కడే ఆ పని చేయలేడు. అందుకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు. అన్నివర్గాల ప్రజలకూ భరోసా ఇవ్వడానికే తాను యాత్ర చేపట్టినట్లు తెలిపారు. నవరత్నాల్లో మనం చేయబోయే మంచి పనులు గురించి తెలియజేస్తున్నానన్నారు. వాటిలో మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మీ అందరి ఆశీర్వాదం, దేవుడి దయతో అధికారంలోకి వస్తానని, అప్పుడు మన కొడుకు ముఖ్యమంత్రిగా వచ్చాడని మీ పిల్లలకు చెప్పండి, మన అన్న వచ్చాడని మీ ఇంటిలో చెప్పండి అని అవ్వలూ, అక్కాచెల్లెమ్మలకు సూచించారు. జిల్లాలో హంద్రీనీవాతో జీడిపల్లికి నీరు తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిదేనని, ఇపుడు నీరున్నా జిల్లాలో తాగునీటికి కటకట తప్పడం లేదన్నారు. జిల్లాలో కరవు నివారణకు వైఎస్ రూ.6000 కోట్లు ఖర్చు చేసి హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. తద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయాలని తాపత్రయపడ్డారని గుర్తు చేశారు. అప్పట్లో ఆయన పుణ్యంతో జీడిపల్లికి నీరొచ్చిందన్నారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కనీసం పిల్ల కాలువలు కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. అలాగే తుంగభద్ర రిజర్వాయర్ నీరు కూడా హెచ్చెల్సీ ద్వారా జిల్లాకు వస్తున్నాయన్నారు. అవి కూడా చాలీచాలకుండా వస్తున్నా, జిల్లా వాటా మేరకు అడగడం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేత కావడం లేదన్నారు. గ్రామాల పక్క నుంచే నీరు వెళ్తున్నా ఉపయోగించుకోలేని స్థితిలో ప్రజలు, రైతులు ఉన్నారన్నారు. అలాగే పాదయాత్రలో తనను కలిసి మాట్లాడిన మహిళలు తాగునీటికి కూడా తాము కటకటలాడాల్సి వస్తోందని, పది రోజులకోమారు నీరొస్తోందని వాపోయారన్నారు. ఇక రాప్తాడులో ఆటో నగర్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ 30 ఎకరాలు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ భూమిని అర్హులకు అందించలేదని దుస్థితిలో పాలకులు ఉన్నారని విమర్శించారు. అంతకుముందు వైకాపా రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి పరిటాల సునీత సాగునీటిని తెచ్చామంటున్నారు. మీ ఇంట్లో నీళ్లున్నంత మాత్రాన అందరికీ నీళ్లొచ్చినట్లేనా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఒక్కో ప్రాంతానికి ఒక్కరిని ఇన్‌చార్జులుగా నియమించి, ప్రజలకు ఏది కావాలన్నా వారినే అడగండని చెబుతున్నారు. ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుందన్నారు. వైకాపా నాయకురాలు గంగుల భానుమతి మాట్లాడుతూ వాళ్లను (టీడీపీ) నిద్రపోనీకూడదు.. అలా చేద్దామా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు.
ఉబిచెర్ల సోలార్ ప్లాంట్‌పై
ఏసీబీ దాడులు
నల్లచెరువు, డిసెంబర్ 12: మండల పరిధిలోని ఉబిచెర్లలో వున్న అబేద్య సోలార్ పవర్ ప్లాంట్‌పై మంగళవారం ఏసీబీ సీఐ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ కాకినాడ దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సి. సూర్యచంద్రశేఖర్ ఆజాద్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఏకధాటిగా అతనితోపాటు ఆయన బంధువులకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అందులో భాగంగా మండలంలోని ఉబిచెర్లలో నెలకొల్పిన సూర్యచంద్రశేఖర్ ఆజాద్ సోదరుడైన వివేకానంద బినామీ పేర్లతో సోలార్ ప్లాంట్ భూములను కొనుగోలు చేసి ఆ తర్వాత సోలార్ ప్లాంట్ పేరుతో బదిలీ చేసుకున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. అతని సోదరుడైన వివేకానంద కారు డ్రైవర్ అయిన సాంబశివకు తెలిసిన లక్ష్మణరావు అనే వ్యక్తి అతని భార్యపై రైతుల నుండి భూములు కొనుగోలు చేయించి ఆ తర్వాత అతని నుండి భూములు బదిలీ చేయించుకొని అతనికి వాచ్‌మెన్‌గా ఉద్యోగం ఇచ్చాడని విచారణలో తేలిందన్నారు. దాదాపు 36 ఎకరాల్లో ఉబిచెర్లలో అబేద్య సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర చెర్లపల్లి మండలం నడికుదురు గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తిపై బినామీ పేర్లతో భూములు కొని తర్వాత సోలార్ ప్లాంట్ యజమానిపై బదిలీ చేయించుకోవడం జరిగిందని తెలిపారు. ఇక్కడ సోలార్ రెండు మెగావాట్ల కెపాసిటీతో నిర్మించడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బినామీ ఆస్తులు వుంటాయన్న అనుమానంతో ఏకధాటిగా ఇక్కడ సోలార్ ప్లాంట్‌లో ఆస్తి పత్రాలను తనిఖీ చేయడం జరిగిందని, అయితే జిరాక్స్ పత్రాలు మాత్రమే ఉన్నాయని, ఒరిజనల్ డాక్యుమెంట్స్ లేవని అధికారులు తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మున్సిపల్ కార్యాలయం డీఈ సుధారాణి, సూపరింటెండెంట్ దేవశంకర్, ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.

విద్యాశాఖ బలోపేతానికి కృషి
* బాధ్యతలు స్వీకరించిన డీఈఓ జనార్ధనాచార్యులు
అనంతపురం సిటీ, డిసెంబర్ 12: జిల్లాలో ప్రణాళికతో విద్యా శాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తానని నూతన డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన జనార్థనాచార్యులు తెలిపారు. మంగళవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖాధికారిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యా శాఖను ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ పాఠశాలలను, విద్యా శాఖ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇందుకు సంబందించి డీఈఓ కార్యాలయ సిబ్బంది, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సహకారంతో సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే జిల్లాలో పదవ తరగతిలో గత సంవత్సరంలో 89శాతం ఉత్తీర్ణత ఉందని, దానిని నూరు శాతం వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇందుకు సంబందించి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలసి కమిటీని ఏర్పాటుచేసి వాటి అమలుకు పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. అలాగే జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు డిప్యూటీ డీఈఓలు, సూపరింటెండెంట్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి పరిచయం చేసుకున్నారు. డీఈఓ కార్యాలయంలో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ మర్వాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం
* మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, డిసెంబర్ 12 : బాలికలు చదువులకే పరిమితం కాకుండా కుటుంబంతోపాటు తోటివారితో సత్ససంబధాలు పెంచుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ముందడుగు వేయాలని మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ శివార్లలోని శ్రీ మద్దానేశ్వరస్వామి కల్యాణ మంటపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిశోరి వికాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలికలు మాధ్యమాలకు ఆకర్షితులు కాకుండా అత్యంత కీలకమైన కౌమార దశలో సక్రమ మార్గంలో పయనించాలని సూచించారు. తల్లితండ్రుల ఆశలను నెరవేర్చేదిశలో ఆనందమయమైన జీవితాన్ని నిర్మించుకోవాలన్నారు. భావిభారత పౌరులుగా సమాజ శ్రేయస్సుకు సైతం పాటుపడాలన్నారు. జడ్పీ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ కిశోరి వికాసంలోని ప్రయోజనాలను బాలికలు సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధికి తమవంతు కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశం, కళ్యాణదుర్గం ఆర్డీఓ రామకృష్టారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ముదిగల్లు జ్యోతి, జడ్పీటీసీ విజయకుమార్ అప్పాజీ, సర్పంచు గురుసిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు.
జగన్‌కు నీరాజనం
రాప్తాడు, డిసెంబర్ 12: వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర 33వ రోజు రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి క్రాస్ నుండి ఉదయం 7:30 గంటలకే మొదలైంది. బస చేసిన శిబిరం నుండి జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. కురుగుంట బిసి కాలనీలోకి చేరుకోగానే గ్రామస్థులు జగన్‌కు దిష్టి తీసి హారతులు పట్టి తమ అభిమాన నేతపై పూల వర్షం కురిపించారు. ప్రజల సమస్యలు వింటూ వారికి న్యాయం చేస్తామని హామీలిస్తూ పాదయాత్ర కొనసాగించారు. కురుగుంట ఎస్‌సి కాలనీలోకి చేరుకోగానే గ్రామస్థులు గజమాలతో స్వాగతం పలికారు. వృద్ధులు చల్లగా వుండాలని జగన్‌ను దీవించారు. అనంతరం వైకాపా జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నదని, హామీలు నెరవేర్చేంత వరకు పోరాడుతానని, ప్రజల పక్షాన నిలబడతానని ఆయన తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీలు సక్రమంగా జరగలేదని గ్రామస్థులు జగన్‌కు విన్నవించారు. అబద్ధపు మాటలు నమ్మి మోసపోయారని, కొద్ది రోజులు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమేనని, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని జగన్ హామీలు ఇచ్చారు. ఎస్‌సి కాలనీలో వున్న అంధుల మహిళా అనాధాశ్రమాన్ని జగన్ సందర్శించారు. అంధులతో కరచాలనం చేస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంధుల సమస్యలపై, అనాధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నిర్వాహకులకు జగన్ హామీ ఇచ్చారు. అక్కడి నుండి అక్కంపల్లి క్రాస్‌లోకి పాదయాత్ర చేరుకోగానే జగన్‌కు యువకులు బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామస్థుల సమస్యలను తెలుసుకుంటు ముందుకు కదిలారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు, ప్రజలకు న్యాయం చేస్తామని హామీలిచ్చారు. అక్కంపల్లి క్రాస్‌లో పాదయాత్ర జరుగుతుండగా వైఎస్‌ఆర్ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు లక్ష్మిపార్వతి జగన్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడి నుండి కిలోమీటరు దూరం నడిచి పిల్లిగుండ్ల కాలనీలోకి చేరుకోగానే చేనేత కార్మికులు ర్యాలీగా వచ్చి పాదయాత్రకు మద్దతు పలికి ఘనంగా స్వాగతం పలికారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. అక్కడి నుండి కొద్ది దూరం నడిచిన తర్వాత సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడి విద్యార్థులతో కరచాలనం చేస్తూ వారితో సెల్ఫీలు దిగారు. అనంతరం 1గంటకు సెయింట్ ఆన్స్ స్కూల్ ఎదురుగా విడిది చేశారు. అక్కడ పార్టీ నాయకులతో చర్చించి కొద్దిసేపు సేద తీరారు. తిరిగి పాదయాత్ర 3:30 గంటలకు నందమూరి నగర్‌కు చేరుకుంది. అక్కడికి చేరుకోగానే కర్నూలు వైకాపా నాయకులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. యువకులు, పార్టీ కార్యకర్తలు, బాణాసంచాలతో ఘనంగా స్వాగతం పలికారు. వడ్డెర సంఘం నాయకులు వడ్డెర్లను ఎస్‌టి జాబితాలో చేర్చాలని వినతిపత్రం అందజేశారు. సమస్యలపై ప్రభుత్వం ఏర్పడగానే పరిష్కరిస్తామని వారికి హామీలిచ్చారు. నందమూరి నగర్ నుండి పాపంపేటకు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా పాపంపేట వైకాపా నాయకులు ఘనంగా స్వాగతం పలికి కొబ్బరి బోండాలను అందించారు. అక్కడ వికలాంగులు ట్రై సైకిళ్లపై ర్యాలీగా వచ్చి స్వాగతం పలికారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం పాపంపేటలో జరిగే బహిరంగ సభకు జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ఈ పాదయాత్రలో వైకాపా నాయకులు రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, సాంబశివారెడ్డి, ఉషశ్రీ చరణ్, గంగుల భానుమతి తదితర వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.
రాజన్న రాజ్యంలోనే పేదల అభివృద్ధి
జగన్‌మోహన్‌రెడ్డితోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని వైకాపా రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు లక్ష్మిపార్వతి పేర్కొన్నారు. జగన్ పాదయాత్రలో భాగంగా అనంతపురంకు చేరుకుని సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం హంగు, ఆర్భాటాలకే ప్రాధాన్యమిస్తున్నదని, ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. మో సపూరిత రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు. వచ్చే ప్రభుత్వం వైకాపాదేనని, ప్రజలు జగన్‌కు నీరాజనం పడుతున్నారని ఆమె తెలిపారు.