అనంతపురం

వెంకటాపురంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, జనవరి 14: స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం సంక్రాంతి పండుగ సంబరాలు ఆదివారం ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి పండుగను జరుపుకున్నారు. ప్రధానంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో నసనకోట పంచాయతీ నుండి వచ్చిన మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా మంత్రి కోడలు జ్ఞాన, శైలజ, ఉష, ఆర్డీఓ బాలానాయక్‌లు వ్యవహరించారు. మొదటి బహుమతి సాధించిన లక్ష్మికి ఫ్రిజ్, 2వ బహుమతి సాధించిన భీమక్కకు మిక్సీ, 3వ బహుమతి నేత్రావతికి డిన్నర్‌సెట్‌ను మంత్రి, శ్రీరామ్‌ల చేతుల మీదుగా అందించారు. అదేవిధంగా పరుగుపందెం, కబడ్డీ, మ్యూజికల్ చైర్స్ నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్‌లో పలువురు మహిళలు పాల్గొనగా షాట్‌పుట్‌లో శ్రీరామ్ పాల్గొని మొదటి బహుమతి సంపాదించాడు. అంతేకాకుండా వంటలు కూడా సంక్రాంతి ప్రత్యేకతలు చేయించి అందరికి భోజనాలు పెట్టారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో రామగిరి మండలం బాగా నిర్వహించిందని, అందుకు మంత్రి అభినందనలు తెలిపారు. ఇందుకు సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ అని, రైతులందరు సుఖ సంతోషాలతో వుండాలని ఆమె ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబునాయుడు కూడా సంక్రాంతి పండుగ సంతోషాలతో జరుపుకోవాలని సంక్రా ంతి చంద్రన్న కానుకలు అందిస్తున్నారన్నారు. గ్రామంలో తెల్లవారుజామునే భోగిమంటలు కూడా వేశారు. అదేవిధంగా రామగిరిలో ప్రభుత్వం పరిధిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు, గ్రామీణ క్రీడలు, పశువుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.