అనంతపురం

కమనీయం సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఏప్రిల్ 15 : శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం కమనీ యంగా సాగింది. నెట్టికంటి సన్నిధిలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య వధూవరుల తిరు కల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మూలవిరాట్ ఆంజనేయస్వామికి తెల్లవారుజామున మహాభిషేకం, వజ్రకవచాలంకరణ, బంగారు కిరీటధారణ, విశేష పుష్పలంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని ఆకుపచ్చని పందిళ్లతో అలంకరించారు. ముందుగా సీతారామ స్వామి ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదిక వద్దకు పల్లకిలో తీసుకుచ్చి ఆలయ సంప్రదాయాలు, భాజ భజంత్రీల నడుమ స్వామి వారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలను అలంకరించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి తిరుకల్యాణం భక్తుల నేత్రపర్వంగా సాగింది. దీంతో ఒక్కసారిగా ఆలయం గోవింద, రామనామస్మరణలతో హోరెత్తింది. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి పెద్దఎత్తున భక్తులు విచ్చేశారు. రాత్రి స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ ముత్యాల రావు, ఎఇఓ ధనుంజయ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యురాలు సుగుణమ్మ, ఆలయ సిబ్బంది భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
గుంతకల్లులో శ్రీవారి కల్యాణోత్సవం
స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి, వాసవీమాత ఆలయాలతో పాటు స్థానిక ఆలూరు రోడ్డులో ఉన్న సాయిబాబా, కసాపురం రోడ్డులో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతం, సాయి సచ్చరిత్ర పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు.
నేమకల్లులో...
బొమ్మనహాల్ : శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం మండల పరిధిలోని నేమకల్లు ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం వైభంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కాశీవిశ్వనాథ్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య వేద పండితులు కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ఊరేగించారు.
మురడిలో...
డి.హిరేహాల్ : శ్రీరామనవమిని పురస్కరించుకుని మండలంలో ప్రసిద్ధిగాంచిన మురడి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం సీతారామ కల్యాణోత్సవం అత్యంత కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో ఆంజనేయస్వామికి అభిషేకం, ఆకుపూజ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అలంకరించిన కల్యాణ మండపంలో సీతారాముల్ని కొలువుదీర్చి అర్చకులు సంప్రదాయబద్దంగా కల్యాణోత్సవం నిర్వహించాచారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు తీసుకున్నారు.