అనంతపురం

కాసులు కురిపిస్తున్న నీళ్ల వ్యాపారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 23 : జిల్లాలో నీళ్ల వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా చాలామందికి అత్యంత లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. పల్లెల్లో సైతం వాటర్ ప్యాకెట్లు, నీటి శుద్ధి కేంద్రాలు వెలుస్తున్నాయి. ఆదాయం లేని వారు కొంత పెట్టుబడి పెట్టుకోగలిగితే చాలు.. ఏడాదిలోనే లక్షాధీశ్వరులై పోయే పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో ఉపాధి, అదనపు ఆదాయ మార్గంగా వీధికొకటి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ పాలకవర్గాలు సైతం సక్రమంగా శుద్ధి చేయని నీటిని రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేస్తుండటంతో జనం రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు క్లోరినేషన్ చేయకపోవడం, నామమాత్రపు క్లోరినేషన్‌తో నీటిని సరఫరా చేస్తుండటంతో గృహాలకు చేరే సరికి దాని ప్రభావం తగ్గిపోవడం, ఒకట్రెండు రోజుల్లోనే పురుగులు కనిపించడం వంటి కారణాల వల్ల ఉన్నంతలో శుద్ధజలంతో గొంతులు తడుపుకుంటున్నారు. అందులో నిర్దేశించిన మేరకు మినరల్స్ లేకపోయినా, గత్యంతరం లేక వాటినే తాగుతుండటం పరిపాటే కాదు అలవాటుగా మారిపోయింది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని నీటి శుద్ధ నీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వీటిని ఏర్పాటు చేయాలంటే నిబంధనల మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్- ఇప్పటికీ పిలుపుచుకునే ఐఎస్‌ఐ) అనుమతి ఉండాలి. ఇందుకోసం హైదరాబాదులోని సంబంధిత కేంద్రంలో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. నీటి వసతి, నీటి శుద్ధి యంత్రం ఏర్పాటుకు అనువైన ప్రదేశం, దశలవారీగా శుద్ధి చేసే విధానం, ప్యాకింగ్ లేదా క్యాన్లను నింపడం, వాటికి సీల్ (మూత) వేయడం వంటి వాటిని పరిశీలించి అనుమతి ఇస్తారు. అయితే ఇవేవీ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు పట్టడం లేదు. అధికార యంత్రాంగం సైతం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్‌డీఓలకు సీజ్ చేసే అధికారం ఉన్నా ఆ దిశగా చర్యలు మృగ్యం. తాగునీరే కరవైనపుడు, కనీసం ఇలాంటి వాటి ద్వారానైనా జనానికి మేలు జరుగుతోందన్న అభిప్రాయం అధికారుల్లో ఉండటం, ధరల నియంత్రణ చర్యలు లేకపోవడం, అడపాదడపా కూడా తనిఖీలు లేకపోవడం, ఎప్పుడో ఒకసారి ఒకటో, రెండో కేసులు నమోదు చేసి మమ అనిపిస్తుండటం పరిపాటిగా మారింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఎన్ని ప్యూరిఫైడ్ ప్లాంట్లు ఉన్నాయో అధికారుల వద్ద లెక్కలేదు. ఐఎస్‌ఐ ఉన్నవి మూడు మాత్రమే. ఒక్క అనంతపురం నగరంలోనే కనీసం వెయ్యి వరకు వాటర్ ప్లాంట్లు ఉండవచ్చని అంచనా. హిందూపురం, కదిరి, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం మొదలు అనేక పట్టణాల్లో లెక్కలేనన్ని శుద్ధ జల కేంద్రాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో నలుగురు సభ్యులున్న ఒక్కో కుటుంబం రోజుకు కనీసం 2 బిందెలు నీటిని చొప్పున నెలకు 60 బిందెల వరకు శుద్ధ జలాన్ని వాడుతున్నారు. ఈలెక్కన నెలకు హీన పక్షం రూ.300 నుంచి రూ.500 ఖర్చవుతోంది. ఏడాదికి కనీసం 3,600, ఆపైనే వెచ్చించాల్సి వస్తోంది. తాగడానికే కాకుండా వంట చేసుకోవడానికి, బియ్యం కడటానికి కూడా వీటినే వాడుతుండటంతో ఖర్చు తప్పడం లేదని మధ్య తరగతి వారు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రోజుకు ఒక్కో వ్యక్తికి 135 లీటర్ల నీరు అవసరం. తాగునీరైతే ఒక్కొక్కరు కనీసం 4 నుంచి 6 లీటర్ల నీటిని తాగాల్సి ఉంది. ఈ లెక్కన నెలకు ఒక్కొక్కరు 120 నుంచి 160 లీటర్ల పైబడే తాగుతారు. నగరపాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో శుద్ధ జలం లభ్యం కాకపోవడంతో, కలుషిత నీరు కూడా సరఫరా అవుతుండటం వంటి కారణాలంతో ప్యూరిఫైడ్ వాటర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే నీరు ఇళ్లకు చేరే సమయానికి క్లోరినేషన్ శాతం పాయింట్ 2 పీపీఎం ఉండాలి. ఆ శాతం నగర, పట్టణాల్లో కొంత మేరకు పాటిస్తున్నా, తగినంత నీరు కూడా సరఫరా కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు మినహా ఇతరత్రా అవసరాలకు మాత్రమే రక్షిత మంచినీటి పథకాల నుంచి సరఫరా అయ్యే నీటిని వాడక తప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీటిని క్లోరినేషన్ చేయడానికి నిధుల కొరతను గ్రామ పంచాయతీ పాలక వర్గాలు సాకుగా చూపుతున్నాయి. కాగా వాటర్ ప్లాంట్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తే రూ.50 వేలు, ఆపైన అపరాధం రుసుం కూడా ఇట్టే చెల్లించి యథాతథంగా శుద్ధ నీటి కేంద్రాలు నిర్వహించుకుంటున్నారని అధికారులే చెబుతుండటం గమనార్హం. అయితే నీటిని శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేయడం, అనధికార ప్లాంట్లను తనిఖీలు చేసి ప్రమాణాలు పాటించేలా చేయడంతో పాటు నీటి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటే ఊరట కలుగుతుందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అనుమతి లేకుండానే చెత్త ట్రాలీల బిల్లుల చెల్లింపు
* అజెండాలో బహిర్గతం * కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రచ్చ..
అనంతపురంటౌన్, ఫిబ్రవరి 23: లోకంలో నిజం నిలకడ మీద తేలుతుందంటారు. కార్పొరేషన్‌లో చెత్త ట్రాక్టర్ కం ట్రాలీల అవినీతి భాగోతం బహిర్గతం కావటానికి ఏడాదికాలం పట్టింది. అదికూడా అధికారయంత్రాంగం పాలకవర్గనేత నిబంధనలకు విరుద్ధంగా సాగించిన నిర్వాకాలను పూస గుచ్చినట్లుగా అజెండాలో పొందుపరచటంతోనే వెలుగుచూసింది. శుక్రవారం కౌన్సిల్ హాలులో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మేయర్ స్వరూప అధ్యక్షత వహించారు. అదనపుకమిషనర్ కృష్ణమూర్తి వేదికను అలంకరించారు. అయితే కార్పొరేషన్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా సాగిన 3చెత్తదందా2 తీరు అధికారులను, కమిటీ సభ్యులను విస్మయానికి గురిచేసింది. ఒక పని చేయాలంటే అంచనాలు రూపొందించి టెక్నికల్ శాంక్షన్ పొందిన తర్వాత అగ్రిమెంట్ చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తారు. చెత్త ట్రాక్టర్ కం ట్రాలీల ఆన్‌లైన్ ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండరులో 25.10 శాతం తక్కువ రేట్లకు ఏకైక టెండరుదారుడైన ఎం.వెంకటేశులుకు రూ.21,04,500 లక్షలకు అప్పగించారు. ఈ ట్రాక్టర్ కం ట్రాలీల టెండరు అగ్రిమెంట్ కాలపరిమితి 9-2-2016 నుంచి ప్రారంభమై 8-6-2016వ తేదీకి ముగిసింది. అయితే మేయర్ స్వరూప ముందస్తు ఆదేశం మేరకు 1-4-2016 నుంచి 31-3-2017 వరకు పొడిగించారు. కాని మేయర్ తీసుకున్న ముందస్తు చర్యలకు అప్పటి స్టాండింగ్ కమిటీ అనుమతులు పొందలేదని అజెండాలో స్పష్టంగా పేర్కొన్నారు. అగ్రిమెంట్ పొందిన మొదటి బిల్లుకు రూ.9,87,776లు, రెండవ బిల్లుకు రూ.11,58,738 లు చెల్లించారు. అటు తర్వాత అగ్రిమెంట్ లేకుండానే మూడవ బిల్లు రూ.11,58,738లు, నాల్గవ బిల్లు రూ.17,47,600 చెల్లించారు. నాలుగు బిల్లుల మొత్తం కలిపి రూ.50,52,852లు కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు అజెండాలో పేర్కొన్నారు. అలాగే స్టాండింగ్ కమిటీ అనుమతులు, సంబంధిత అధికారులు అనుమతులు లేకుండా అగ్రిమెంట్ కాలపరిమితి దాటి పనులు చేపట్టి, అగ్రిమెంట్ మొత్తం కన్నా అధికంగా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించినట్లు అజెండాలో అధికార యంత్రాంగం స్పష్టంగా పేర్కొంది. ఇది చాలదన్నట్లుగా అదనంగా ఇంకా రూ.28,00,000 కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉందని పేర్కొనటం విశేషం. పైన తెలిపిన పొరపాట్ల వలన సదరు పనిని నిబంధనలకు విరుద్ధంగా చేసి ఉన్నందున చెల్లింపులు ఆగిపోయాయని అజెండాలో వాస్తవాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. అయితే అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనుల ఫైలుపై సంతకం చేయటానికి నిరాకరించారు. తాము చేసిన తప్పులను ఒప్పుగా చూపించుకునేందుకు పాలకవర్గం నేత అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణను దుర్భాషలాడి, బెదిరించి సంతకాలు చేయించుకునేందుకు యత్నించింది. అయితే నిజాయితీ అధికారియైన ఎస్‌ఇ పాలకవర్గం నేత నిబంధనలకు విరుద్ధంగా సాగించిన పనులకు ఆమోదముద్ర తెలపటానికి నిరాకరించారు. దీంతో ఆయన బెదరింపులకు జడిసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళారు. రూ.50 లక్షలు దాటిన ఫైలును తప్పనిసరిగా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనుమతి పొందాల్సి ఉంటుందని ఎస్‌ఇ సూచించారు. దిగువస్థాయి అధికారులకు ఫైలును విడగొట్టి ప్రత్యేక అనుమతులు పొంది ఫైలును తయారుచేసి పంపితే బిల్లు చేయటానికి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఆయన ఆదేశాలను ఎన్విరాన్‌మెంట్ డీఈఈ సురేంద్రనాథ్ బేఖాతరు చేయటంతో ఉన్నతాధికారులకు ట్రాక్టర్ కం ట్రాలీల బిల్లుల చెల్లింపువ్యవహారం ఏడాదికాలంగా పీటముడిగా మారింది. పాలకవర్గం నేత ముందస్తు చర్యలు తప్పనిసరిగా స్టాండింగ్ కమిటీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే పాలకవర్గం నేత స్టాండింగ్ కమిటీ ప్రాధాన్యతను గుర్తించకుండా త్రోసిరాజని వ్యవహరించటం గమనార్హం. అయితే స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందకనే ట్రాక్టర్ కం ట్రాలీలను కొనసాగించటం, సాంకేతిక అనుమతి (టెక్నికల్ శాంక్షన్) తీసుకోకుండా, అగ్రిమెంట్ చేయకుండా పనులు చేయించటం ఒక ఎతె్తైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్‌కన్నా అధికంగా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించినట్లు అజెండాలో స్పష్టంగా పేర్కొన్నారు. కాంట్రాక్టర్ వత్తిడి మేరకు చెత్తట్రాక్టర్లు, ట్రాలీలలో జరిగిన అవినీతి నిర్వాకాల భాగోతం శుక్రవారంనాటి అజెండాలో సవివరంగా అధికారవర్గాలు వివరించాయి. పాలకవర్గం సాగించిన నిర్వాకాలను నలుపుతెలుపు చేసుకోవటానికి బిల్లును పూర్తీ స్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరణకు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి. అగ్రిమెంట్‌తో ప్రమేయం లేకుండా రెండు దఫాలు పొడిగించిన చెత్తట్రాక్టర్లు కం ట్రాలీల కాలవ్యవధిని క్రమబద్ధీకరించటానికి ప్రస్తుత స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాలని సూచించింది. రెండు సంవత్సరాలనాటి అంశానికి సంబంధించి అప్పటి స్టాండింగ్ కమిటీ కాకుండా ప్రస్తుత కమిటీ ఏ విధంగా బాధ్యత వహిస్తుందో ఉన్నతాధికారులే సెలవివ్వాలని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అజెండాలో పొందుపరచిన అంశాలు పాలకవర్గం నేత, కొంతమంది అధికారులు అవినీతిని ప్రోత్సహించిందనటంలో అతిశయోక్తి లేదని వారంటున్నారు.

ఏజేసీగా సుబ్బరాజు బాధ్యతల స్వీకరణ
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 23: అనంతపురం జిల్లా రెండవ సంయుక్త కలెక్టర్‌గా హెచ్.సుబ్బరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న జేసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ జూయింట్ కలెక్టర్ -2 నుండి చార్జీని తీసుకున్నారు. హెచ్ సుబ్బరాజు 1990 సంవత్సరంలో రెవిన్యూ శాకలో సర్వీసులో చేరి చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాలలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. కృష్ణ జిల్లా మచిలీపట్నం అర్భన్ డెవలప్‌మెంటు అథారిటీలో సెక్రటరీగా పనిచేసి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. జెసి-2గా పనిచేసిన సయ్యద్‌ఖాజామొహిద్దీన్ శాసనమండలి ఛైర్మెన్ వద్ద ఓఎస్‌డిగా నియమింపబడ్డారు.