అనంతపురం

వైభవంగా ప్రారంభమైన ఖాద్రీశున్ని బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరిటౌన్, ఫిబ్రవరి 25 : శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఆంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ప్రధాన ఆర్చకుల నివాసం నుంచి ఆలయ ఆనవాయితీ ప్రకారం అధికారులు, పాలకమండలి సభ్యులు మంగళహారతులతో అర్చకులను తీసుకుని వచ్చారు. అనంతరం గర్భగుడిలోని అర్చకుల ఆలయ ప్రవేశం చేసి స్వామిని దర్శించుకుని స్వామికి విశేష ఆరాధన పూజలు నిర్వహించారు. అనంతరం తూర్పు, ఉత్తరమధ్య భాగమైన ఈశాన్య భాగంలో భూమాతకు పూజలు నిర్వహించి, ఆ మట్టిని ప్రధాన పళ్లెంలోకి తీసుకుని శేషవస్త్రం కట్టుకుని ఆంకురార్పణ చేశారు. అనంతరం దేవతలు, అష్టదిక్పాలకులు, కోటి దేవతలకు కుంభారాధన నిర్వహించారు. కుంభం మట్టిని పాలీకలు (కుండలు) స్వామి ఆశీర్వాధంతో నవధాన్యలు నింపారు. బ్రహోత్మత్సవాలు అనంతరం పాలీకలలో ఏ దిక్కున నవధాన్యలు మొలకెత్తాయో అప్రాంతం సుభిక్షంగా ఉండి పంటలు బాగా పండుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ట్ఘీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్, కందికుంట యశోదమ్మ, ఆర్డీఓ రాంమోహన్, తహశీల్దార్ పీవీ రమణ, ఈఓ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, సభ్యులు ఎం.చంద్రశేఖర్, రోడ్డారపు నాగారాజు, రామకృష్ణ, రఘునాథరెడ్డి, గంగులమ్మ, కర్రెనాగరాజు రెడ్డెప్ప, తిప్పేపల్లిహనుమంతు, కటికెల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇళ్ల నిర్మాణాల లక్ష్యంలో ముందడుగు
* మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, ఫిబ్రవరి 25 : రాయదుర్గంలో ఈనెల 26న ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలకు ముందడుగు వేయనున్నట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలకు ఇళ్లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధి వహించి ముందడుగు వేస్తున్నారన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 3లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో భూమిపూజ చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులతోపాటు ఆయా జిల్లా అధికారులు సమష్టిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ముదిగల్లు జ్యోతి పాల్గొన్నారు.