అనంతపురం

‘టెన్’ టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మార్చి 13: జిల్లాలో మార్చి 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు టెన్షన్ మొదలైంది. జిల్లాలో పూర్తిగా హాల్‌టికెట్లు అందలేదని కొంతమంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 189 పరీక్ష కేంద్రాలలో 50,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుంటే, అందులో కొన్ని పాఠశాలలకు హాల్‌టికెట్లు రాకపోవడంతో వారు విద్యా శాఖ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 189 పరీక్ష కేంద్రాలలో దాదాపు 80 పరీక్ష కేంద్రాలలో అసంపూర్తిగా సౌకర్యాలు ఉన్నాయి. పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్ష కేంద్రానికి కేటాయించిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 97 పాఠశాలల్లో పూర్తిగా బల్లలు వుంటే, 13 పాఠశాలల్లో కొన్ని గదులకు వుంటే మరికొన్ని గదులకు బల్లలు లేకుండా వుండే పాఠశాలలు, 79 పాఠశాలలకు పూర్తిగా బల్లలు లేకుండా ఉన్నాయి. ఇలాంటి పాఠశాలలను విద్యా శాఖాధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యా శాఖ కమిషనర్ అధికారులు మాత్రం ప్రతి పాఠశాలలోను బల్లలను తప్పకుండా వేయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని మడకశిర, రొద్దం, కుందర్పి, గుంతకల్లు, గుత్తి, హిందూపురం, కదిరి ప్రధాన కేంద్రాల్లో కాకుండా మారుమూల ప్రాంతాలలో ఎక్కువ బల్లలు లేకుండా నేలపై కూర్చొని పది పరీక్షలు రాయడానికి అధికారులు విద్యార్థులను సిద్ధం చేయడం చాలా దారుణం. జిల్లా కేంద్రంలోని రాంనగర్, రుద్రంపేట బైపాసులలోని ప్రైవేటు పాఠశాల పరీక్ష కేంద్రాలలో సరియైన బల్లలుకానీ, వెలుతురుగానీ, ఫ్యాన్లుకానీ లేవని, అలాంటి వాటిలో పరీక్ష కేంద్రాలుగా కేటాయించడంలో పరీక్షల విభాగం అధికారులు చేసిన చేతివాటమే విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఈ రెండు పాఠశాలల్లో పూర్తిగా అసౌకర్యాలతో ఉన్నాయని అక్కడికి వెళ్లి వచ్చిన విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పాతవూరు పాఠశాలలో కూడా సరియైన వెలుతురు లేకుండా గదులు ఉన్నాయని, వాటికి సరియైన వెలుతురు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం అన్ని పరీక్ష కేంద్రాలలో పూర్తిగా బల్లలను ఏర్పాటు చేశామని చెబుతున్నా దాదాపు 79 పాఠశాలల్లో లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యా శాఖ అధికారులు సత్వర చర్యలు తీసుకొని 79 పాఠశాలలకు బల్లలు, తాగునీరు, వెలుతురులాంటి ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.