అనంతపురం

గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మార్చి 22: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పోలా వీరాంజినేయులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం పెన్నార్ భవన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో ప్రభుత్వం కేటాయించిన లోన్లను అన్ని తెగలకు సమానంగా కేటాయించాలన్నారు. బెస్ట్ అవైలబుల్ సీట్లను కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని గిరిజన తెగలకు సమానంగా సీట్లను కేటాయించాలన్నారు. ట్రాక్టర్, ఇన్నోవా, బొలెరో, ఆటోలను గిరిజన తెగలకు సమానంగా కేటాయించి ఉపాధి కల్పించాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎస్జీటీ టీచర్స్, సీఆర్‌టీ టీచర్ల పోస్టులను కేవలం గిరిజనులకు మాత్రమే ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎస్టీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటుచేయాలని, బోగస్ ఎస్టీ ఉద్యోగులను తొలగించి, ఎస్టీలకు న్యాయం చేయాలన్నారు. ఎరుకుల కులస్తులకు ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.