అనంతపురం

25 నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, మార్చి 23 : మండలంలోని నీలకంఠాపురం నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 5వ తేదీ నుంచి శ్రీరామనవతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 25న సుప్రభాతసేవ, అభిషేకాలు, ఉయ్యాలసేవ, మంగళహారతి నిర్వహించనున్నారు. 26న సీతారాముల కల్యాణోత్సవం, 7 గంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ నంజావధూతస్వామిజీ హాజరుకానున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు నీలకంఠేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి, శారదాదేవి ఊరేగింపు నిర్వహించనున్నట్లు చెప్పారు. 27న గోవిందపురం, గంగళవాయిపాళ్యం స్వాముల జ్యోతుల ఉత్సవం నిర్వహించి 5 గంటలకు ఉట్ల పరుష నిర్వహించనున్నట్లు తెలిపారు.
భగత్‌సింగ్‌కు నివాళి
హిందూపురం టౌన్, మార్చి 23 : అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భగత్‌సింగ్ స్ఫూర్తితో ప్రత్యేక హోదా, రాయలసీమ ప్యాకేజీ, అనంతపురం సమగ్రాభివృద్దికి సీపీఎం పోరాటం కొనసాగిస్తుందన్నారు. అలాగే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎంజీఎం పాఠశాల సమీపంలో ఉన్న భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
అమరాపురంలో...
అమరాపురం : మండలంలోని ఉదగూరు ప్రాథమిక పాఠశాలలో భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా తాలూకా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమంలో చురుకైన నాయకుడిగా ఎంతో పేరు ప్రతిష్టలు పొంది బ్రిటిషు వారిని పారదోలిన మహోన్నత వ్యక్తి భగత్‌సింగ్ అంటూ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు.