అనంతపురం

అనంతను మలేరియా రహితంగా నమోదు చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, ఏప్రిల్ 24: అనంతపురం జిల్లాను మలేరియా రహితం జిల్లాగా నమోదు చేయడానికి ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనిల్‌కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి అనిల్‌కుమార్ తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆఫ్రికా దేశాలలో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆఫ్రికా మలేరియా డే జరుపుకొనేవారన్నారు. కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మలేరియా దినోత్సవాన్ని ఒక్క ఆఫ్రికా దేశాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాలని భావించి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017 ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవంగా ప్రకటించటం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. దీని ముఖ్య ఉద్ధేశ్యం మలేరియా నివారణకు అన్ని సౌకర్యాలు కల్పించటం, విస్తృత ప్రచారం చేయడం ప్రధాన ఉద్ధేశ్యం అన్నారు. ప్రపంచం మొత్తం మలేరియా పూర్తి స్థాయిలో నివారణకు 2016 నుంచి 2030 వరకు అంచెలంచెలుగా పూర్తిగా నిర్మూలించేందుకు నిర్ణయించటం జరిగిందన్నారు. భారతదేశం మాత్రం 2018 నాటికి దీనిని అంతం చేయడానికి సర్వం సిద్ధమవుదాం అను నినాదంతో ముందుకు వెళ్లటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా మాలేరియా కేసుల నమోదులో తొమ్మిదవ స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టి మనం మంచిస్థానంలో నిలుద్దామని, ఇందుకు అన్ని శాఖల సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. మలేరియా వ్యాధి దోమకాటు వల్ల వస్తుందని, ఇది అంటువ్యాధి అన్నారు. ఈ వ్యాధి చలి వణుకు నొప్పులతో కూడిన విపరీతమైన జ్వరంతో తన ప్రభావాన్ని చూపుతుందన్నారు. సత్వరమే వైద్య సేవలందకపోతే మెదడుకు పాకి రోగి మృతి చెందే అవకాశం ఉందన్నారు. మలేరియాతో డెంగీ ప్రభావం కలగలిసి ఉంటుందన్నారు. జిల్లాలో 20 గ్రామాలను ఇప్పటికే హైరిస్క్ మాలేరియా గ్రామాలుగా గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మలేరియా నివారణకు సంబంధించి బుధవారం నగరంలోని వైద్య కళాశాల ఆడిటోరింతోపాటు ఐఎమ్‌ఏ హాల్‌లో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వాహకులు ఐఎమ్‌ఏ హాల్‌నందు నిర్వహించే సదస్సులో పాల్గొనాలని ఆయన కోరారు.