అనంతపురం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమందేపల్లి, మే 21: రొద్దం మండలం తురకలాపట్నంలో జరిగిన బహిరంగ సభలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను అలరించాయి. ఎనిమిది మంది చిన్నారుల బృందం సమత, గమత, గురుదేవ అనే గీతానికి నృత్యం చేశారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని బహిరంగ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్ళను ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వర్‌రావు, కాలవ శ్రీనివాస్, పరిటాల సునీత, ఎమ్మెల్యే బీకే పార్థసారథి తదితరులు సందర్శించారు. పట్టుపరిశ్రమ, వ్యవసాయ, నీటి యాజమాన్యం, ఉద్యానవన శాఖ, స్ర్తి, శిశుసంక్షేమ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ళను పరిశీలించారు.
మహిళా సంఘాన్ని అభినందించిన సీఎం
బుక్కరాయసముద్రం మండలం రోటరీపురానికి చెందిన చైతన్య గ్రామైక్య మహిళా సంఘం జాతీయ అవార్డు సాధించడంతో సంఘం సభ్యులు లలితమ్మ, రామసుబ్బమ్మ, నాగరత్నమ్మ, లలితలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అదే విధంగా ధర్మవరం పట్టణానికి చెందిన హిజ్రాలు రేఖ, అయిషాలకు రూ.1000 వంతున పింఛన్లు మంజూరు చేశారు. అలాగే పెనుకొండ మండలం కొండంపల్లికి చెందిన హనుమంతునాయక్ తన పొలంలో ఏర్పాటు చేసిన ఫారంపాండ్ వద్ద కలిగే ప్రయోజనాలను బహిరంగ సభలో వివరించారు.

పెనుకొండ నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు
పెనుకొండ, మే 21: రొద్దం మండలం తురకలాపట్నంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో వరాలు జల్లు కురిసింది. ఎమ్మెల్యే బీకే పార్థసారథి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న మక్కువతోనే ఏడుసార్లు పర్యటించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. పలు గ్రామాల్లో 38 రోడ్ల నిర్మాణాలకు రూ.53 కోట్లు విడుదల చేశారన్నారు. తాగునీటి కోసం రూ.260 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పెనుకొండకు కృష్ణాజలాలు తీసుకువచ్చి అన్ని చెరువులకు నీరు అందిస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో కియా, బెల్, నిషాన్ వంటి ఫ్యాక్టరీలు మంజూరు చేసినట్లు తెలిపారు. పెనుకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి రొద్దం మండలంలోని తురకలాపట్నం నుండి సానిపల్లికి మూడు కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి రూ.2.50 కోట్లు, పెన్నానదిపై మూడు సబ్ సర్ఫెస్ డ్యాంల నిర్మాణానికి రూ.11 కోట్లు మంజూరు చేశారు. తురకలాపట్నంలో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రూ.35 లక్షలు, గ్రామంలో శ్మశాన వాటికకు దారి ఏర్పాటుకు, కమ్యూనిటీ హాలు, అంగన్‌వాడీ భవనాలను మంజూరు చేశారు. పెనుకొండ మండలంలోని రాంపురానికి తాగునీటి పైపులైన్ కోసం రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వేదికపై నుండి ప్రకటించారు. మండల కేంద్రమైన రొద్దంలో గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత కల్పిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.