అనంతపురం

ఎస్సీ కాలనీ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, మే 21: రొద్దం మండల పరిధిలోని తురకలాపట్నం ఎస్సీ కాలనీలో రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమిపూజ చేశారు. అంతకుమునుపు ఎస్సీ కాలనీలో గతంలో ఏర్పాటు చేసిన సిమెంటు రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. అదే విధంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో భాగంగా లబ్ధిదారుడు అంజినప్ప నిర్మించుకున్న ఇంటిని సీఎం గృహప్రవేశం చేయించారు. కుటుంబ సభ్యులతో మాటామంతీ సాగించారు. ఈ గృహ నిర్మాణ పథకం వల్ల తమకెంతో ఆనందం కలుగుతోందని వారు సీఎంతో చెప్పారు. ఇకపోతే ఎస్సీ కాలనీలో రోడ్డుప్రక్కన కూర్చొన్న వృద్ధుడు బైలప్పతో సీఎం మాట్లాడారు. పింఛన్ వస్తోందా, ఎంత వస్తోంది అని అడిగారు. రూ.1000 వస్తోందని, ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఈ డబ్బులు ఏమీ చేస్తావని సీఎం అడగ్గా తనను పోషిస్తున్న కుమారుడికి ఇస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా రూ.25 వేల నగదును బైలప్పకు తక్షణమే అందించాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. దీనికి తోడు గ్రామంలో పెళ్ళికానుక కింద విజయమ్మ కుమార్తెకు సంబంధిత చెక్కును అందజేశారు. అలాగే విజయమ్మకు ప్రత్యేకంగా కుట్టుమిషన్‌ను సీఎం మంజూరు చేశారు. కాగా గ్రామంలో మురికి కాలువలు అస్తవ్యస్థంగా ఉన్నాయని కొందరు మహిళలు వాపోగా త్వరలోనే సమస్య తీరుతుందని సీఎం చెప్పారు. ఇకపోతే దాదాపు 40 కుటుంబాలకు స్వంత ఇళ్లు లేవని కొందరు కాలనీవాసులు సీఎం దృష్టికి తీసుకురావడంతోపాటు విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇందుకు స్పందించిన సీఎం అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, త్వరలోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న ఇంకుడు గుంతలను సీఎం పరిశీలించి ప్రతి నీటిబొట్టును సంరక్షించేందుకు ప్రజలు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని విధాలా న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

భారం తగ్గించండి..

* వాహనదారులకు భారీ అపరాధ రుసుంపై మంత్రుల అసంతృప్తి.. * ఓట్లకు గండి పడుతుందని వ్యాఖ్య..
హిందూపురం, మే 21: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యలు మంచిదేనని, అయితే దీన్ని నెపంగా పెట్టుకుని పెద్దఎత్తున అపరాధ రుసుం విధించడం తగదని మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యే బీకే పార్థసారథిలు డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ అశోక్‌కుమార్‌లతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తురకలాపట్నం హెలిప్యాడ్ వద్దకు డీఐజీ, ఎస్పీలు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాలవ శ్రీనివాసులు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మీరు చేపడుతున్న వాహనాల తనిఖీలు ఏమాత్రం సమంజసంగా లేవన్నారు. ముందుగా రోడ్డు ప్రమాద విషయాల్లో వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ చూసినా వాహనాల తనిఖీలను చేస్తూ అపరాధ రుసుంలను విధిస్తుండటం తమకు నష్టం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని, దీన్ని నెపంగా చేసుకుని పెద్ద మొత్తంలో అపరాధ రుసుం విధించడం తగదన్నారు. ఇదే క్రమంలో మంత్రి పరిటాల సునీత కూడా జోక్యం చేసుకొని దీని వల్ల వేలాది ఓట్లు తాము కోల్పోతామని విస్మయం వ్యక్తం చేశారు. మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచించారు. అపరాధ రుసుంలు భారీగా విధించడం వల్ల తమ పార్టీకి నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.