అనంతపురం

అట్టహాసంగా మినీమహానాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి/కొత్తచెరువు, మే 24 : పుట్టపర్తిలో ఎమ్మెల్యే, చీఫ్‌విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన జిల్లా మినీ మహానాడు ఎంతో అట్టహాసంగా జరిగింది. ముందుగా పుట్టపర్తిలో హనుమాన్ సర్కిల్ నుంచి గోకులం, ఎనుములపల్లి గణేష్‌సర్కిల్, సత్యసాయి వినాశ్రయం మీదుగా పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తిని కలుపుతూ పల్లె ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మినీ మహానాడు వేదికపై అశేష జన వాహినిని ఉద్దేశించి నేతలు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తూ తమ అధినేత చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేద్దామని ప్రతిన బూనారు. వెనుకబడిన జిల్లాను సశ్యశ్యామలం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆయన సేవలకు గుర్తుగా తిరిగి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సైనికుల్లా పని చేయాలన్నారు.
కుట్ర రాజకీయాలు తిప్పి కొడదాం :ఎంపీ నిమ్మల
బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ కనుసన్నుల్లో నడుస్తున్న వైసీపీ అధినేత జగన్, జనసేన నేత పవన్ కుట్ర రాజకీయాలను తరిమికొడదామని ఎంపీ నిమ్మల కిష్టప్ప పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు ఇస్తామని కల్లుబొల్లి మాటలు చెప్పి రాష్ట్రానికి మోదీ మోసం చేశారన్నారు. చంద్రబాబుకు భయపడి రాష్ట్రాన్ని చిన్నచూపు చూశారన్నారు. హోదాపై అవిశ్వాస తీర్మానం అమలు కాకుండా దాట వేశారన్నారు. అవినీతిని పెంచిన పోషిస్తున్న వారందరూ టీడీపీకి వ్యతిరేకమన్నారు.
ఉద్యమాలకు అనంత అడ్డా:పయ్యావుల కేశవ్
అనాదిగా జిల్లా ఉద్యమాలకు పెట్టింది పేరు అని పయ్యావుల కేశవ అన్నారు. నందమూరి తారకరామారావును అప్రజా స్వామికంగా పదవి నుంచి దించిన నాడే ఇక్కడ ఉద్యమాలు జరిగాయన్నారు. సమైఖ్యాంధ్ర ఉద్యమం ఈ జిల్లా నుంచే ఊపందుకుందన్నారు. అభివృద్ధి సంక్షేమ ప్రజలకు అండగా నిలిచింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పగల సత్తా చంద్రబాబుకు ఉందన్నారు.
వైకాపా అధికారంలోకి వస్తే ఊచకోత తప్పదు : బీకే
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన ఊచకోతే మరలా వైకాపా అధికారంలోకి వస్తే జరుగుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారధి అన్నారు. పట్టిసీమను వ్యతిరేకించిన ముర్ఖుడు జగన్ అన్నారు. రాయలసీమకు నీరు వస్తే వైకాపా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతోనే పట్టిసీమను జగన్ వ్యతిరేకించారన్నారు. ఎంఎల్‌సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ టీడీపీకి ఒక చరిత్ర ఉందన్నారు. ఎన్‌టీ రామారావును కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా గద్దె దించినప్పుడు మొట్టమొదట రాష్ట్రంలోని కొత్తచెరువు నుంచే తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. ఈ తిరుగుబాటు ఢిల్లీని కదిచించి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మెడలు వంచిందన్నారు. ప్రతి శుక్రవారం జైలుకు వెళ్లే జగన్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కుట్ర రాజకీయాలు రాష్ట్రంలో చేస్తున్నారన్నారు. కేంద్రం ప్రభుత్వం మోసం చేసినందువలనే టీడీపీ ఎన్‌డీఏ నుంచి బయటికి వచ్చిందన్నారు. కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్, బీజేపీకి సమాన బాధ్యత ఉందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిభజన వద్దని ఉద్యమాలు చేపట్టినా కాంగ్రెస్, బీజేపీ నాయకులు పట్టించుకోలేదన్నారు. ఎంఎల్‌సీ తిప్పేస్వామి మాట్లాడుతూ పోలవరం నిర్మాణం పూర్తీ అయితే రాష్ట్రం తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. ఎంఎల్‌ఏ యామినీబాల మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గానికి అధికంగా నీరు కేటాయించిన ఘనత మంత్రి దేవినేని ఉమాకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలను అనంతకు తరలించి చెరువులు నింపి రాయలసీమలోని కరవు జిల్లాను శశ్యశ్యామలం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. జిల్లాలోని చెరువులను నింపి సాగు, తాగునీటి కొరత లేకుండా చేశారన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు గత నాలుగు సంవత్సరం కాలంలో చేసిన అభివృద్ధిని ఏకరువు పెట్టారు.
పలు తీర్మానాలు...
జిల్లా మినీ మహానాడులో పలు తీర్మానాలను ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యంగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువకు నిధుల కేటాయింపు, మడకశిర, కదిరి నియోజకవర్గాలకు హంద్రీనీవా కాలువ ద్వారా నీటి కేటాయింపు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానించారు. జిల్లాలోని భైరవానితిప్ప, పేరూరు ప్రాజెక్ట్‌లకు నిధులు మంజూరు చేసినందుకుగాను ఏకగ్రీవంగా కృతజ్ఞతలు తెలిపారు. బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను కలుపుతూ రూ.200 కోట్లతో రింగు రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల అభినందించారు. జిల్లాలోని అన్ని చెరువులకు నీరు ఇవ్వాలని తీర్మానించారు. వెనుకబడిన జిల్లాకు ఇళ్లు, పింఛన్లు అదనంగా ఇవ్వాలని, విత్తన వేరుశెనగ కాయలకు అదనపు సబ్సిడీ ఇవ్వాలని, హంద్రీనీవా కాలువకు భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని తీర్మానించారు. జిల్లాకు ఇరిగేషన్ కింద రూ.10వేల కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.