అనంతపురం

మాదాల మృతికి సీపీఎం నేతల నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, మే 27: సినీ నటుడు, కమ్యూనిస్టు సానుభూతిపరుడు మాదాల రంగారావు మృతి కళారంగానికి తీరని లోటని సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ అన్నారు. మాదాల రంగారావు అనారోగ్యంతో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీపీఎం ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడుతూ రంగారావు కళారంగం ద్వారా సామాజిక స్పృహను చాటడం జరిగిందన్నారు. ఎర్ర మల్లెలు, విప్లవ శంఖం, స్వరాజ్యం, ఎర్ర సూర్యుడు, ఎర్ర పావురాలు, జనం, మనం ప్రజావాణి తదితర చిత్రాల్లో మాదాల రంగారావు నటించడం జరిగిందన్నారు. 80వ దశకంలో ప్రేమ కథ చిత్రాల హవా నడుస్తున్నా విప్లవాత్మక చిత్రాలు నిర్మించి మంచి విజయాలు అందుకోవటం ఆయనకే సాధ్యమైందన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించిన రంగారావుప్రజా నాట్య మండలిలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశారన్నారు.

కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
అనంతపురం సిటీ, మే 27: రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువస్తామని ఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు జి.నాగరాజు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మాసినేని గ్రాండ్ హోటల్‌లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఆర్థిక దోపిడీ నుండి జిల్లాను ఏవిధంగా కాపాడాలనే విషయంపై ఆర్‌పీఎస్, ఏఐఎస్‌ఎఫ్, నిరుద్యోగ ఐక్య వేదిక, పీడీఎస్‌యూ, ప్రజా సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు నడపాలని ఆ నిబంధనలు సక్రమంగా అమలుచేయడం కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వివిధ దశల్లో ఉద్యమాలు చేపట్టనున్నామని తెలిపారు.
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
అనంతపురం సిటీ, మే 27: స్థానిక సోమనాథ్ నగర్‌లోని ఆల్ ఇండియా టెలికాం పెన్షనర్స్ వెల్ఫేర్ భవన్‌లో ఆదివారం రచనాస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది. రచనాస్ ఆసుపత్రి డైరెక్టర్ డా.రచనారెడ్డి ఆధ్వర్యంలోని వైద్య బృందం ఉచిత వైద్య సేవలను అందించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలతోపాటు గుండెజబ్బులులకు చికిత్స చేసి పలు సలహాలు, సూచనలు అందజేసారు. ఈ సందర్భంగా డా.రచనారెడ్డి మాట్లాడుతూ ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులతో జబ్బుల నుండి దూరంగా ఉండవచ్చునని తెలిపారు. ప్రతి మనిషి జీవన శైలి విధానాన్ని పాటించాలని తెలిపారు.