అనంతపురం

జూనియర్ ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు చివరి స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఏప్రిల్ 19: 2015-16 ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం చరిత్రలో మొదటిసారిగా ఇంటర్మీడియట్ అధికారులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 7వ స్థానానికి చేరింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాకు చివరి స్థానం దక్కింది. జిల్లా వ్యాప్తంగా 26,950 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 18,562 మంది ఉత్తీర్ణతతో 69 శాతం సాధించారు. గత సంవత్సరంలో 56 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ సంవత్సరం 69 శాతం ఉతీర్ణత శాతం పెరిగింది. అలాగే మొదటి సంవత్సరంలో 32,771 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 57 శాతంతో 18,709 మంది ఉత్తీర్ణతను సాధించారు. గత సంవత్సరంలో మొదటి సంవత్సరం ఫలితాలు 53 శాతం ఉండగా ఈ సంవత్సరంలో 4 శాతం పెరిగి 57 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు ఒకేరోజు విడుదల చేయడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల విద్యార్థుల హవా కొనసాగించారు.
మే 24 నుంచి అడ్వాన్సుడ్ ఇంటర్ పరీక్షలు..
ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం అడ్వాన్సుడ్ పరీక్షలను మే 24వ తేదీ నుండి ప్రారంభమై మే 30తో పూర్తవుతాయని ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్ ఫలితాల సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరాల పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీన సంబందించిన కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. మే 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు అడ్వాన్సుడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా పెరిగిందని తెలిపారు.