అనంతపురం

ఘనంగా రాహుల్‌గాంధీ పుట్టిన రోజు వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, జూన్ 19: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 48వ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ భవన్‌లో ఘనంగా జరిగాయి. రాహుల్‌గాంధి పుట్టిన రోజును పురస్కరించుకుని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కేక్ కోశారు. స్వీట్లు పంచిపెట్టారు. రాహుల్‌గాంధీ బర్త్‌డేను పురస్కరించుకుని కాంగ్రెస్ భవన్‌లో రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పీసీసీ అధ్యక్షుడు పరిశీలించారు. రక్తదాతలకు అభినందనలు తెలిపారు.
వేరుశెనగకు మద్దతు ధర ప్రకటించాలి
* వైకాపా నాయకులు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి
రాప్తాడు, జూన్ 19 : వేరుశెనగకు ప్రభుత్వం మద్దతు ప్రకటించి కిలో రూ.60లకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైసీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద మండల వైసీపీ నాయకులు చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వేరుశెనగకు మద్దతు ధరపై నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా వర్షాభావ పరిస్థితులలో గత కొన్ని సంవత్సరాలుగా అరకొర పంటలు పండుతూ పెట్టుబడులు రాక తీవ్ర కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని పేర్కొన్నారు. అదేవిధంగా వేరుశెనగకు కిలో రూ.60లు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వ చౌకధాన్యం డిపోలలో శెనగ నూనెను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా రైతు సంఘం నాయకులు మల్లికార్జున, నాగరాజులు వున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి ఇన్‌చార్జ్ తహసిల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ తహసిల్దార్ మాట్లాడుతూ పై అధికారులకు నివేదిక పంపుతామన్నారు.
ప్యారలల్ పాఠశాలలకు
ఉపాధ్యాయులను కేటాయించాలి
అనంతపురం సిటీ, జూన్ 19: జిల్లాలోని పాఠశాలల్లో ప్యారలల్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి ఉపాధ్యాయులు కేటాయించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కరుణం హరికృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్య సంచాలకులు విన్నవించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన ప్యారలల్ ఇంగ్లీషు మీడియం ప్రారంభించారని, అందులో బోధించడానికి ఉపాధ్యాయులను కేటాయించకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఉపాధ్యాయులు ఆంగ్లమాద్యమంలో బోధించడం ద్వారా ఆదనపు భారం పడే అవకాశం ఉందని, దీంతో విద్యార్థులకు సరియైన న్యాయం జరగదని తెలిపారు. కావున తక్షణమే అదనపు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు.