అనంతపురం

చీరల పంపిణీలో తోపులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, జూన్ 19: రాహుల్‌గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం కాంగ్రెస్ భవన్‌లో మెట్ల కింద టోకన్లు ఉన్న మహిళలకే చీరలు పంపిణీ చేయటంతో తోపులాట జరిగింది. భవన్ ప్రధాన గేట్లను మూసివేసి కొంతమందికి మాత్రమే డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం చీరల పంపిణీ చేపట్టారు. అయితే గేటు వేయటంతో టోకన్లు ఉన్న వారిలో కొందరు బయటనే ఉండిపోయారు. వారు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించారు. అలాగే టోకన్లు లేని వారు సైతం చీరలు అందుకోవటానికి రావటంతో గందరగోళం చెలరేగింది. ముందుగా సిద్ధం చేసిన జాబితాల ప్రకారం వేదికపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేతుల మీదుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే ప్రకటించిన వస్తువులు అందచేశారు. ఎంపిక చేసిన విద్యార్థినులకు నోటు పుస్తకాలు, అంధులకు, ఆటోరిక్షా కార్మికులకు దుస్తుల పంపిణీని ఆయన అందచేశారు. పీసీసీ అధ్యక్షుడు వెళ్ళిన తర్వాత డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం చీరల బండిల్‌ను కాంగ్రెస్ భవన్‌లోని మెట్ల వద్దకు తీసుకెళ్ళి పంపిణీ చేపట్టారు. అయితే అక్కడ గేటును మూసివేసి చీరల పంపిణీ చేపట్టటంతో మహిళలు వాటిని తీసుకోవటానికి తోపులాడుకున్నారు. వారిపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో మహిళలు తిట్టుకుంటూ బయటకు వెళ్ళటం కనిపించింది. లబ్ధిదారులను ఎంపిక చేసి టోకన్లు ఇచ్చి రమ్మని చెప్పిన నాయకులు కనపడకుండా వెళ్ళిపోయారు. పిలిచారని వస్తే తిడుతున్నారని వేదన చెందారు. ఈ సంబడానికి పిలవటం ఎందుకు, వచ్చిన తర్వాత తిట్టటం ఎందుకని వాపోవటం కనిపించింది. చేతకానపుడు మిన్నకుంటే బాగుండేదని నేతలను తిట్టుకుంటూ వెళ్ళటం కనిపించింది. ఆర్భాటంగా కార్యక్రమాలు ప్రకటించి తర్వాత చేతులెత్తేయటం సరికాదని కార్యకర్తలు నేతల వ్యవహార శైలిపై చర్చించుకోవటం కనిపించింది. ప్రతిసారీ ఇదే తంతు పునరావృతం కావటం జరుగుతోందని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివలన కాంగ్రెస్ పార్టీకి లాభంకన్నా నష్టమే జరుగుతుందని వారు వ్యాఖ్యానించటం కనిపించింది.

ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న వైకాపా నాయకులు
* పోలీసులతో బాధితులు, వైకాపా నాయకుల వాగ్వివాదం
ధర్మవరం, జూన్ 19 : పట్టణంలోని లక్ష్మీనగర్ బండగుంత సమీపంలోని నివాసం వుంటున్న ఇండ్లను మునిసిపల్ అధికారులు పోలీసుల సహాయంతో తొలగించడానికి మంగళవారం వెళ్ళడంతో అక్కడ నివాసం వుంటున్న బాధితులు, వైసీపీ నాయకులు కలిసి తొలగింపు చర్యలను అడ్డుకున్నారు. దీంతో మునిసిపల్ అధికారులకు, బాధితులకు వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో సమస్య మరింత ముదిరింది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు బాధితుల పక్షాన నిలిచి నివాస స్థలాలను ఎలా తొలగిస్తారంటూ అధికారులతో వాదనలకు దిగారు. గత 40 ఏళ్ళుగా ఇక్కడే నివాసం వుంటున్న ఇండ్లను వున్న పళంగా తొలగిస్తే వారు ఎక్కడికి వెళ్ళి తలదాచుకుంటారంటూ వైసీపీ నాయకులు బీరే ఎర్రిస్వామి, చందమూరు నారాయణరెడ్డి మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ హరినాథ్ సమస్యను జటిలం కాకుండా పరిష్కరించేందుకు ప్రయత్నించగా పోలీసులతో సైతం బాధితులు, వైసీపీ నాయకులు వాదనలకు దిగారు. ముందస్తుగా ఎలాంటి సందేశం లేకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. దీంతో ఘర్షణ ముదరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సీఐ హరినాథ్ ప్రత్యేక పోలీసు బలగాలను అక్కడికి రప్పించారు. పోలీసుల సహాయంతో పేదల నివాసాలను కూడా తొలగిస్తారా అంటూ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయంపై బాధితుల పక్షాన ఎంతవరకైనా పోరాడతామన్నారు. అయితే అధికారులు మాత్రం ముందస్తుగానే నోటీసులు ఇచ్చామని, వీరికి నివాస స్థలాలు కూడా కేటాయిస్తూ ఇండ్లను కూడా మంజూరు చేయిస్తామని అది త్వరలోనే జరుగుతుందంటూ చెప్పేందుకు ప్రయత్నించారు. కనీసం ఇప్పటికైనా మాకు స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణం కోసం అయ్యే నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.