అనంతపురం

మడకశిర రోడ్ల విస్తరణలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూన్ 23 : పట్టణంలోని మధుగిరి సర్కిల్‌లో రహదారుల విస్తరణ ఉద్రిక్తతలకు దారితీసింది. అన్యాయంగా దుకాణాలను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ సిగ్బతు ల్లా అనే యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో రెండు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో ట్రాఫిక్ పెరిగిపోవడంతో అధికారులు ఆక్రమణలకు గురైన ప్రాంతాలను గుర్తించి దశలవారీగా తొలగిస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం మధుగిరి సర్కిల్‌లో సర్వే నెంబర్ 435-3లో 60 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ కొందరు దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు అధికారులు ఇచ్చిన మార్కింగ్ మేరకు దుకాణాలను తొలగించుకున్నారు. అయితే నజీర్‌సాబ్, అంజినప్ప అనే వ్యాపారులు తొలగించుకోకపోవడంతో అధికారులు జేసీబీ యంత్రంతో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నామని, 1989లో తమకు పట్టాలు కూడా ఇచ్చారని, అధికారులు ఇచ్చిన మార్కింగ్ మేరకు తొలగిస్తే తమకు నష్టం లేదని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నఫళంగా తొలగించడం అన్యాయమంటూ అడ్డుకున్నారు. దీనికితోడు నజీర్‌సాబ్ కుమారుడు సిగ్బతుల్లా తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకొంటానని పేర్కొంటూ సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు, నగర పంచాయతీ అధికారులు నచ్చచెప్పినా వినలేదు. చివరకు స్నేహితులు నచ్చచెప్పడంతో సిగ్బతుల్లా కిందకు దిగి వచ్చాడు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంజినప్ప, రంగమ్మ, తదితరులు తమకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయం చూపే వరకు ఆక్రమణలను తొలగించకూడదని అడ్డుపడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొందరు యువకులు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. పనులను పూర్తిగా నిలిపివేసి కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అధికారులకు శాపనార్థాలు పెడుతూ స్థానికులు వెళ్లిపోయారు. దీంతో అధికారులు ఆక్రమణలను తొలగించే పనులను పూర్తి చేశారు.