అనంతపురం

నేడు శివపార్వతుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూన్ 24: అరవిందనగర్ రెండవ క్రాస్‌లో గల శ్రీ సర్వేశ్వర ఆలయంలో నేడు శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గురుమూర్తి ఆదివారం తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు, రుద్ర హోమం అనంతరం శివపార్వతుల కల్యాణం జరుగునని తెలిపారు. కల్యాణోత్సవమునకు భక్తులు తరలిరావాలని ఆయన కోరారు.
అలరించిన ఆడుకుందాం - పాడుకుందాం
అనంతపురం కల్చరల్, జూన్ 24: నగరంలోని త్యాగరాజ సంగీత సభలో ఆదివారం జరిగిన ఆడుకుందాం - పాడుకుందాం కార్యక్రమం ఆహుతులను విశేషంగా అలరించింది. త్యాగరాజు, అన్నమయ్య, పురంధర దాసు కీర్తనలను శ్రీదేవి, శేషాచారి, అంజనాదేవిలు శ్రావ్యంగా ఆలపించారు. చిన్నారి అసలూరి నిత్య వయొలిన్ ద్వారా చక్కటి గీతాలను ఆలపించి అందరినీ అలరించారు. చిన్నారి నిత్యను పలువురు అభినందించారు.
డయాబెటీస్, బ్యాక్‌పెయిన్‌లకు యోగా థెరపీ
అనంతపురం కల్చరల్, జూన్ 24: వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో మొదటి రోడ్డు శివాలయంలో ఈ నెల 27 నుండి యోగా థెరపీ నిర్వహించనున్నట్లు అధ్యక్షులు ఎం.రాజశేఖర్ తెలిపారు. 40 రోజులపాటు జరిగే శిక్షణలో డయాబెటీస్, బ్యాక్ పెయిన్, సయాటిక, స్పాండిలైట్స్ లకు యోగా థైరపీ ద్వారా చికిత్స నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
విద్యాహక్కు చట్టం అమలులో ప్రభుత్వం విఫలం
అనంతపురం సిటీ, జూన్ 24: విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే నరేష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు విద్యార్థి సమాఖ్య స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం 4 సంవత్సరాలలో ప్రభుత్వ విద్యను బలహీనపరిచి, పాఠశాలను మూసివేసి, కార్పొరేట్, ప్రైవేటు విద్యను ఏపీ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఆరోపించారు. కనీస విద్యార్హత లేని కార్పొరేట్ విద్యాసంస్థలు అనేక రకాల పేర్లతో విచ్చలవిడిగా దోచుకుంటున్నాయని, అలాంటి వాటిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని, గుర్తింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.