అనంతపురం

విద్యతోనే యాదవుల అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 24: విద్యతోనే యాదవుల అభివృద్ధి సాధ్యమవుతుందని కర్ణాటక హిరియార్ ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం అఖిల భారతీయ యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్‌లో యాదవ కులస్తుల ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూర్ణమా శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారని, పార్టీలకు అతీతంగా యాదవులకు రాజకీయంగా అభివృద్ధి సాధించాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను బాగా చదవించాలని, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చదివించాలని కోరారు. విద్య వుంటేనే గ్రామ, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశంలోని యాదవ కులస్తులు అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలో యాదవ కులస్థులు తనకు ప్రాధాన్యతనిచ్చి సన్మానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.
ప్రమాదాల నివారణకు చర్యలు
* డీఎస్పీ విజయ్‌కుమార్
పామిడి, జూన్ 24 : జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తాడిపత్రి డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. పామిడి జాతీయ రహదారిపై గతంలో జరిగిన ప్రమాదాల స్థలాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రోడ్డు వంపు ఎక్కువగా ఉన్నందుకా.. చెట్లు అడ్డంగా ఉన్నందుకా.. రోడ్డు దాటేందుకు జరుగుతున్న ప్రయత్నంలో నిర్లక్ష్యమా.. వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరుగకుండా నివారించటానికి చర్యలు చేపడుతామన్నారు.