అనంతపురం

వైభవంగా సామూహిక వివాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, ఏప్రిల్ 21 : పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌లు గురువారం నిర్వహించిన ఉచిత సామూహిక వివాహాలు వైభవోపేతంగా జరిగాయి. సాంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య వివాహాలు నిర్వహించారు. 250 జంటలు ఒక్కటయ్యాయి. నూతన వధూ వరులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీర్వదించారు. 10:30గంటలకు పెళ్లిళ్లు జరుగగా ముఖ్యమంత్రి కాస్త ఆలస్యంగా వచ్చినా నూతన జంటలన్నింటిని ఆయన ఆశీర్వదించి నూతన జంటలతో ఫొటోలు దిగారు. 9:45గంటల నుండి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్లకు పలువురు ప్రముఖులు వచ్చి నూతన వధూ వరులను ఆశీర్వదించారు. లక్షలాది మంది నూతన జంటలను ఆశీర్వదించడానికి తరలివచ్చారు. 11:55గంటలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 12:50గంటల వరకు కూడా వధూవరులను ఆశీర్వదించారు. ఆయన రాగానే తిరుమల దేవర గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెళ్లిళ్ల జంటల వద్దకు విచ్చేశారు. కొత్త జంటలు, వారి బంధువులు వేచి వుండి ఆయన ఆశీర్వాదాలు, మంత్రి పరిటాల సునీత ఆశీర్వాదాలు పొందారు. నూతన వధూవరులకు రవి, మంత్రి సోదరులు బాలాజిలు వారికి కావాల్సిన వంట పాత్రలు, పెట్టె తదితర వస్తు సామాగ్రిని అందించారు. పెళ్లిళ్ల వద్ద మంత్రి సునీతతోపాటు ఆమె తనయులు పరిటాల శ్రీరామ్, సిద్ధార్థలు తిరుగుతూ ఎప్పటికప్పుడు పనులు సజావుగా జరిగేలా చూశారు. ఎక్కడా ఎలాంటి ఆటంకం కలుగకుండా వలంటీర్లను ఏర్పాటు చేసి పెళ్లి కార్యక్రమాలు సజావుగా సాగించారు.
పరిటాల రవీంద్ర విగ్రహం ఆవిష్కరణ
ఉచిత సామూహిక వివాహాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిటాల రవీంద్ర విగ్రహాన్ని ఆవిష్కరించారు. పరిటాల కుటుంబ సభ్యులు మొట్టమొదటిసారిగా పరిటాల రవీంద్ర విగ్రహాన్ని ఏర్పాటుచేయించారు. తిరుమల దేవర ఆలయాన్ని పునరుద్ధరించి రెండు పర్యాయాలు పెళ్లిళ్లు నిర్వహించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తపించిన పరిటాల రవీంద్ర చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ ప్రాంతంలో పరిటాల రవీంద్ర విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా వుందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.3 కోట్లు మంజూరు చేస్తానన్నారు. ఈ ఆలయం మొత్తం తరచూ పెళ్లిళ్లు జరగడానికి అనుకూలంగా విడిది భవనాలు, కల్యాణమండపాలు నిర్మించుకునేలా ఏర్పాట్లుచేస్తామన్నారు. పరిటాల రవీంద్ర ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చేసిన కృషి మరువలేనన్నారు. కాగా ఉచిత సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ఒక్కో జంటకు రూ.10వేలు చొప్పున అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా చాలా కరవుతో ఇబ్బందిపడుతోందని, ఇక్కడ సామూహిక వివాహాలు చేయడం పరిటాల రవీంద్ర స్ఫూర్తి అని, ఆయన అడుగుజాడల్లో మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌లు వెళుతున్నారన్నారు.