అనంతపురం

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఆగస్టు 14: శ్రావణమాసం శుద్ద చవితి నాగులచవితి పర్వదినాన్ని నగరంలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయాల్లోని నాగులకట్ట, పుట్టలకు భక్తులు పూజలు చేసి పాలు పోశారు. భక్తిశ్రద్ధలతో నాగదేవతలను ఆరాదించారు. నగర నాగుల చవితి ఉత్సవ కమిటీ వ్యవస్థాపకులు కరణం వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ కల్యాణమండపంలో భజనలు, భక్తి గీతాలాపనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గం.ల నుండి నాగదేవతల నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. నగరోత్సవంలో ప్రత్యేకంగా అలంకరింపబడిన వాహనాల్లో నాగదేవతలను ఊరేగించారు. నగరోత్సవంలో కోలాటం, చెక్క భజన, పండరి భజన, గొరవయ్యలు, కీలుగుర్రాలు, ఉరుములు, డప్పులు, బంజారా కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, నాగదేవతలతో రూపొందించిన క్యాలెండర్, పుస్తకాలను ఆవిష్కరించారు. శాస్ర్తియ నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాల సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ స్వామి ఆత్మవిదానంద సరస్వతి, స్వామిని ప్రతిష్టానంద సరస్వతి తదితరులు నాగదేవతల ఆరాధన, భక్తి విశిష్టతలను వివరించారు. చలపతిరెడ్డి, సుబ్బిరెడ్డి, వివిధ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.