అనంతపురం

డిజిటల్ గ్రంథాలయం అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 12: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా నిర్మితమైన డిజిటల్ గ్రంథాలయం అద్భుతమని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం డిజిటల్ గ్రంథాలయాన్ని మంత్రి సందర్శించారు. గ్రంథాయల సంస్థ చైర్మన్ గౌస్‌మొద్దీన్, సిబ్బంది మంత్రికి స్వాగతం పలికారు. డిజిటల్ గ్రంథాలయాన్ని పరిశీలించిన మంత్రి ఆర్డీటీ సహకారంతో ఊహకందని విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన చైర్మన్‌ను మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో డిజిటల్ గ్రంథాలయాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ తరపున చైర్మన్ గౌస్‌మొద్దీన్ మంత్రిని శాలువా, జ్ఞాపికతో సత్కరించి, డిజిటల్ కార్డును అందచేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎన్.లలిత, ఉప గ్రంథాలయాధికారి ఆదిలక్ష్మి, సిబ్బంది కొమ్మా శివశంకర ప్రసాద్, రామాంజనమ్మ, మల్లికార్జున, వెంకటేష్, ప్రసాద్, సరస్వతమ్మ, నాగరాజు, జడ్పీటీసీ మల్లికార్జున, రామ్మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు.