అనంతపురం

హంద్రీనీవాను వెంటాడుతున్న బాలారిష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం రూరల్, నవంబర్ 14 : హిందూపురం ప్రాంతానికి హంద్రీనీవా నీటిని తీసుకురావాలన్న ప్రయత్నాలకు ఆది నుంచీ బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి విడుదలైన నీరు బుధవారం నాటికి హిందూపురం రూరల్ మండలానికి చేరుతుందని ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య తెలిపినా సోమందేపల్లి మండలంలోని చాకర్లపల్లి వద్ద కాలువ గట్టు తెగిపోవడంతో ప్రవాహం ముందుకు సాగలేదు. గతంలో కూడా హిందూపురం ప్రాంతంలోని లేపాక్షి చెరువును నింపి ఆర్భాటంగా పైలాన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా జల హారతి నిర్వహించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రయత్నించినా సఫలం కాలేదు. లేపాక్షి పెద్ద చెరువుకు నీరు అందించాలని అధికారుల విశ్వ ప్రయత్నం విఫలం కాగా అరకొర నీటితోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుతో బాలకృష్ణ, మంత్రి కాలవ శ్రీనివాస్ జల హారతి ఇచ్చారు. ఈ తతంగంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకభావం ఏర్పడింది. ప్రస్తుతం హంద్రీనీవా ద్వారా రూరల్ మండల పరిధిలోని మలుగూరుకు నీరు అందించాలనే ప్రయత్నం ఫలించే అవకాశం లేదు. చాకర్లపల్లి, మంచేపల్లి వద్ద గట్లు తెగిపోవడంతో నీరు ముందుకు సాగే పరిస్థితి లేదు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు గట్లకు మరమ్మతులు చేపట్టి గురువారం నుంచి తిరిగి నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు.

20న ‘విద్య - సమగ్ర వ్యక్తిత్వ వికాసం’ పై సెమినార్
అనంతపురం, నవంబర్ 14: ఈ నెల 20న ‘ విద్య - సమగ్ర వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సంయోజకులు డా.బి.నారాయణ, కె.రాఘవయ్యలు తెలిపారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనుబంధ విద్వత్ పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహించనున్న సెమినార్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన ద్వారా వారు తెలిపారు. ఉదయం 9.30 నుండి సాయంత్రం 6 గం.ల వరకు జరిగే సెమినార్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొని, తమ అమూల్యమైన సూచనలు, సలహాలతో పత్ర సమర్పణ చేయాలని వారు కోరారు. ఈ సెమినార్‌లో పాల్గొను ఉపాధ్యాయులకు ఓడి సౌకర్యం కల్పించినట్లు వారు తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు తమను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.
సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు
అనంతపురం సిటీ, నవంబర్ 14: ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్-2 సుబ్బరాజు అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత, గిరిజన సంఘాల నాయకులు, ప్రజల నుండి 216 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ-2 మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే ఆయా వర్గాలకు చెందిన ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.