అనంతపురం

బీజేపీతోనే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్పల, నవంబర్ 16 : భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలనలోనే దేశం అన్నిరంగాలల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గూగూడులో పర్యటించిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారన్నారు. విభజనలో నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలిచి కోట్లాది నిధులు మంజూరు చేశారన్నారు. గూగూడులో పురాతణ ప్రసిద్ధి చెందిన రామాలయానికి చెందిన విలువైన స్థలాన్ని అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కబ్జా చేసి పెద్దమొత్తంలో విక్రయించడానికి పాలవులు కదుపుతున్నారని ఆరోపించారు. మత సామరస్యతకు ప్రతీకగా నిలిచిన గూగూడును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు.

మాతాశిశు మరణాలు తగ్గించాలి

* కలెక్టర్ జీ.వీరపాండ్యన్
అనంతపురం సిటీ, నవంబర్ 16 : జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ సూచించారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలోని డీపీఆర్‌సీ సమావేశపు హాల్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మాతా శిశు మరణాలపై జిల్లాలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వౌలిక వసతులు కల్పించామన్నారు. కావున మాతాశిశు మరణాల సంఖ్య జిరోశాతం ఉండేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని తెలిపారు. మాతా శిశుమరణాలు తగ్గించడంపై అన్నిశాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, డివిజన్ల స్థాయిలో సమీక్ష సమావేశాలను నిర్వహించుకోవాలన్నారు. అక్టోబర్‌లో సమారు 14 శిశు మరణాలు, 2 మాతృమరణాలు జరగాయన్నారు. ప్రధానంగా నిమోనియా, బరువు తక్కువగా బిడ్డ జన్మించడం, నెలలు పూర్తికాకముందే పుట్టడం వల్ల శిశువులు అధికంగా చనిపోతున్నారన్నారు. ప్రతి గర్భిణికీ 8 సార్లు వివిధ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రసవ సమయంలో రక్తహీనత లేకుండా చూడాలని వైద్యసిబ్బందికి సూచించారు.